Polavaram Project: వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పోలవరం పూర్తి, ప్రణాళికలు రూపొందించిన ప్రభుత్వం, మేఘా సంస్థ, ఈ నెల 27న ప్రాజెక్ట్ ప్రాంతాన్ని సందర్శించనున్న ఏపీ సీఎం వైయస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( Andhra Pradesh Govt) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) ఊపందుకుంది. గోదావరి నదిపై (Godavari River) కడుతున్న ఈ జాతీయ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి నిర్ధేశించిన లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతోంది. దేశంలోనే పెద్దదైన ఈ బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ పోలవరంను వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేసే లక్ష్యంగా ప్రభుత్వం, మేఘా సంస్థలు (Megha Engineering) ప్రణాళికలు రూపొందించాయి. ఆరు దశాబ్దాల క్రితం ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగిన విషయం విదితమే.
Amaravathi, Febuary 26: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( Andhra Pradesh Govt) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) ఊపందుకుంది. గోదావరి నదిపై (Godavari River) కడుతున్న ఈ జాతీయ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి నిర్ధేశించిన లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతోంది. దేశంలోనే పెద్దదైన ఈ బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ పోలవరంను వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేసే లక్ష్యంగా ప్రభుత్వం, మేఘా సంస్థలు (Megha Engineering) ప్రణాళికలు రూపొందించాయి. ఆరు దశాబ్దాల క్రితం ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగిన విషయం విదితమే.
ఆడిట్ పూర్తయ్యాక నిధులు విడుదల చేస్తామన్న కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పోలవరం ప్రాజెక్ట్ పై రివర్స్ టెండరింగ్‌కు వెళ్లారు. రివర్స్ టెండరింగ్ లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణ కాంట్రాక్టును ప్రభుత్వానికి రూ. 628 కోట్లు ఆదా అయ్యేలా మేఘా ఇంజనీరింగ్ దక్కించుకుంది. ఆ వెంటనే పనుల వేగం పెరిగింది. ప్రభుత్వం, మేఘా సర్వశక్తులు సమీకరించి ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తున్నాయి.
3. 07 లక్షల ఘణపు మీటర్ల కాంక్రీట్ పనిని ఈ ఏడాది ఆగష్టు నాటికి పూర్తి చేయాలనీ మేఘా సంస్థ లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. ఇప్పటికే దేశంలోనే ప్రతిష్టాత్మకంగా పేరు గాంచిన కాళేశ్వరం, పట్టిసీమ, హంద్రీనీవా వంటి అనేక పధకాలను చేపట్టి మేఘా ఇంజనీరింగ్ సంస్థ అనుకున్న సమయానికే వాటిని పూర్తి చేయడంతో పోలవరం ప్రాజెక్ట్ కూడా అనుకున్న సమయానికే పూర్తి అవుతుందని అందరూ భావిస్తున్నారు.
వచ్చే ఏడాది ఖరీఫ్ కాలానికి పోలవరం ప్రాజెక్ట్ జలాశయం లో ప్రధానమైన స్పిల్ వే, ఎర్త్ కం రాక్ ఫీల్ డ్యామ్ పూర్తి చేసేలా ప్రభుత్వం, మేఘా సంస్థ ప్రణాళికలు రూపొందించాయి. ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈ నెల 27న ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించనున్నారు.
పోలవరం ప్రాజెక్టుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
ప్రస్తుతం పోలవరం పనులు ఊపందుకున్నాయి. జలాశయంలో కీలకమైన స్పిల్‌వే లో 53 బ్లాకులను నిర్మించాలి. ఒక్కొక్క బ్లాకు 55 మీటర్ల ఎత్తు ఉంటుంది . వీటిని పూర్తి చేసే పనులు ఊపందుకున్నాయి. ఒక బ్లాకులో ఒక మీటర్ ఎత్తు నిర్మించడానికి (కాంక్రీట్ వేయడానికి) నాలుగు రోజుల సమయం పడుతుంది. సరాసరిన ప్రతీరోజు 12 బ్లాకుల్లో ఎత్తు పెంచే పని చురుగ్గా జరుగుతోంది. ఈ మొత్తం స్పిల్‌వేలో రెండున్నర లక్షల క్యూబిక్ మీటర్ల పనిచేయాలి. గత ఏడాది వరదల వల్ల ఎదురైనా అడ్డంకులను అధిగమించి జనవరి నెలాఖరు నాటికి 25 వేల క్యూబిక్ మీటర్ల పనిని ఎంఇఐఎల్ పూర్తిచేసింది.
పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 628 కోట్లు ఆదా
ఫిబ్రవరిలో 40 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనిని పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయి. మార్చిలో 50 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనిని పూర్తి చేసి, మిగిలిన పనిని ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో పూర్తిచేయాలని మైల్ స్టోన్ గా పెట్టుకున్న మేఘా సంస్థ జలవనరుల శాఖ అధికారుల పర్యవేక్షణలో ముందుకు సాగుతోంది. రోజుకు 15 వందల క్యూబిక్ మీటర్ల పనిచేయాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు ఈ ప్రాజెక్ట్‌లో కీలకమైన స్పిల్‌వేలోని పియర్స్, ఎర్త్‌కమ్ ర్యాక్‌ఫిల్ డ్యామ్ పునాది పనులు మేఘా మొదలుపెట్టింది. జలాశయంలో కీలకమైన మోడీ గ్యాపులలో 1,3కి సంబంధించిన డిజైన్లు ఆమోదం పొందే పని మేఘా చేపట్టింది.
పోలవరం నిధులను విడుదల చేసిన కేంద్రం, రూ. 1850 కోట్లు నాబార్డు నుంచి ఏపీ ఖాతాలోకి
పోలవరం జలాశయం ఒక్కటైనా దీనిని మూడు విభాగాలుగా పరిగణలోకి తీసుకుంటారు. గ్యాప్1తో పాటు స్పిల్ వే, ఎర్త్ కమ్ ర్యాక్‌ఫిల్ డ్యాం కీలకమైనవి. ఇందులో గ్యాప్3ను 150 మీటర్ల పొడవుతో చిన్నపాటి కాంక్రీట్ డ్యామ్‌గా పూర్తిచేయాలి. గ్యాప్2లో ఎర్త్‌కమ్ ర్యాక్‌ఫిల్ డ్యాం ఉంటుంది. దీనినే ప్రధానమైన జలాశయంగా పిలుస్తారు. దీని పొడవు 1.75 కిలోమీటర్లు ఉంటుంది. గ్యాప్1లో కూడా ఎర్త్‌కమ్ ర్యాక్‌ఫిల్ డ్యామే నిర్మించాలి.
Polavaram Project Mission @2021
దీని పొడవు 450 మీటర్లు ఉంటుంది. ప్రాజెక్ట్‌లో ర్యాక్‌ఫిల్ డ్యాం పనులు చేపట్టడానికి అవసరమైన వైబ్రో కంప్యాక్షన్ పరీక్షలను మేఘా నిర్వహిస్తోంది. అదే సమయంలో ప్రాజెక్ట్‌కు ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులు ప్రారంభమయ్యాయి. వీటి నిర్మాణం వల్ల ప్రాజెక్ట్ పనిజరుగుతున్నప్పుడు వరదలు వస్తే నీటిని మళ్లించడం వీలవుతుంది. గ్యాప్3లో డయాఫ్రం వాల్, స్పిల్ వే ఎగువ, దిగువన కాంక్రీట్ పనులు ప్రారంభించడానికి మేఘా ఏర్పాట్లు చేసుకుంది.
ప్రాజెక్ట్ కోటింగ్, సర్‌ఫేస్ డ్రస్సింగ్, తారు రహదారి లాంటి ఫినిషింగ్ పనులు 2021 ఆగష్టు నాటికి పూర్తవుతాయి. పోలవరం ప్రాజెక్ట్ ద్వారా ఉభయగోదావరి జిల్లాల్లో లక్షా ముప్పైవేలు సాగులోకి రావడంతో పాటు 80 టిఎంసీల నీటిని కృష్ణకు తరలించడమే కాకుండా గోదావరి డెల్టాలో 13 లక్షల ఆయకట్టు రబీలో స్థిరీకరించి ఎడమ కాలువ క్రింద లక్షా అరవైవేల ఎకరాలకు నీరందిస్తారు. విశాఖ నగరానికి తాగునీటి అవసరాల కోసం 23.44 టిఎంసీల నీరు అందిస్తారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)