Commercial LPG Prices Change: ఒకటో తారీఖు వచ్చింది... గ్యాస్ సిలిండర్ ధర మారింది... కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు గుడ్‌ న్యూస్.. 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.30 మేర తగ్గింపు..

మరి కొంత ఖేదం అన్నట్టు చేశాయి.

LPG (Credits: X)

Hyderabad, July 1: ఒకటో తారీఖు ఎప్పుడు వస్తుందా? గ్యాస్ బండ భారం ఎప్పుడు తగ్గుతుందా? అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న పేద, మధ్య తరగతి వర్గాలకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (Oil Marketing Companies) కొంత మోదం.. మరి కొంత ఖేదం అన్నట్టు చేశాయి. హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు ఇతర కమర్షియల్ గ్యాస్ (Commercial LPG Prices Change) వినియోగదారులకు గుడ్‌ న్యూస్ చెప్పిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.. గృహ వినియోగదారులకు మాత్రం హ్యాండ్ ఇచ్చింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.30 మేర తగ్గిస్తున్నట్టు కంపెనీలు ప్రకటించాయి. సవరించిన ధరలు ఈ రోజు నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశాయి.

ఎన్నికల ముందు జగన్ సర్కారు ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు, జులై 1న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, టెట్ నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం

డొమెస్టిక్ సిలిండర్ ఇలా..

కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించిన కంపెనీలు.. గృహ వినియోగ అవసరాల కోసం ఉపయోగించే 14 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పుచేయలేదు. దీంతో సామాన్యులు ఉసూరుమంటున్నారు.

మెగా డీఎస్సీ, పెన్షన్ల పెంపుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం, ఏపీ మంత్రివర్గ సమావేశం తీసుకున్న నిర్ణయాలు ఇవే..



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif