Malware Alert: వందకి పైగా యాప్స్‌ లో ప్రమాదకరమైన వైరస్.. మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే వెంటనే అన్ ఇన్‌స్టాల్ చేయాల్సిందే.. ఆ యాప్స్ జాబితా ఇదిగో..

సమాచార తస్కరణ నిత్యకృత్యంగా మారిపోయింది. భయంకర వైరస్‌లను ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా స్మార్ట్ ఫోన్స్‌ లోకి పంపి డేటాను తస్కరిస్తున్నారు మోసగాళ్లు. తాజాగా గూగుల్ ప్లే స్టోర్‌లోని 100 కంటే ఎక్కువ యాప్‌లకు సోకిన కొత్త మాల్వేర్‌ను పరిశోధకులు గుర్తించారు.

Beware of fake OTP delivery scam Representational Image (Photo Credit: PTI)

Newdelhi, June 5: సమాచార తస్కరణ (Data Theft) నిత్యకృత్యంగా మారిపోయింది. భయంకర వైరస్‌లను ఆండ్రాయిడ్ యాప్స్ (Android Apps) ద్వారా స్మార్ట్ ఫోన్స్‌ (Smart Phones) లోకి పంపి డేటాను తస్కరిస్తున్నారు మోసగాళ్లు. తాజాగా గూగుల్ ప్లే స్టోర్‌ (Google Play Store)లోని 100 కంటే ఎక్కువ యాప్‌లకు సోకిన కొత్త మాల్వేర్‌ను పరిశోధకులు గుర్తించారు. ‘స్పిన్ ఓకే’ అనే కొత్త స్పైవేర్‌ను ఇటీవల గుర్తించారు. పైగా ఈ యాప్స్ 400 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లతో ఉన్నాయి. ఈ ట్రోజన్ మాల్వేర్ వినియోగదారులను ఆకర్షించడానికి రోజువారీ రివార్డ్‌లతో కూడిన మినీగేమ్‌లను అందించడం ద్వారా చట్టబద్ధమైనదిగా కనిపిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు.

Flight Over Tirumala: తిరుమలలో కలకలం.. శ్రీవారి ఆలయం సమీపం నుంచి వెళ్లిన విమానం.. ఘటనపై టీటీడీతో చర్చిస్తున్న విమానయాన శాఖ అధికారులు

డౌన్‌లోడ్ తర్వాత ఏం జరుగుతుంది?

డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఈ మాల్వేర్ వినియోగదారుల పరికరాలలో నిల్వ చేసి ఉన్న ప్రైవేట్ డేటాను దొంగిలించి రిమోట్ సర్వర్‌కు పంపుతుంది. ఉపరితలంపై ‘స్పిన్ ఓకే’ మాడ్యూల్ మినీ-గేమ్‌లు, టాస్క్‌ ల సిస్టమ్, బహుమతులు, రివార్డ్ డ్రాయింగ్‌ల సహాయంతో యాప్‌లపై వినియోగదారుల ఆసక్తిని కొనసాగించడానికి రూపొందించారని నివేదికల ద్వారా తెలుస్తుంది. ఈ వైరస్ సోకిన యాప్‌లు వివిధ స్థాయిలలో హానికరమైన కంటెంట్‌ను కలిగి ఉన్నాయి.

CBI Probe in Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ, నిందితులను గుర్తించామన్న కాసేపటికే మాట మార్చిన రైల్వే మంత్రి, మృతుల సంఖ్యను తగ్గిస్తూ సవరణ

ట్రోజన్ మాల్వేర్ ద్వారా ప్రభావితమైన యాప్‌లు ఇవే

  • నాయిజ్: సంగీతంతో వీడియో ఎడిటర్
  • జాప్యా:  ఫైల్ బదిలీ, భాగస్వామ్యం
  • వీఫ్లై: వీడియో ఎడిటర్&వీడియో మేకర్
  • ఎంవీ బిట్- ఎంవీ వీడియో స్టేటస్ మేకర్
  • బియూగో- వీడియో మేకర్&వీడియో ఎడిటర్
  • క్రేజీ డ్రాప్
  • క్యాష్‌జైన్ – డబ్బు రివార్డ్‌ను సంపాదించండి
  • ఫిజ్జో నవల – ఆఫ్‌లైన్‌లో చదవడం
  • క్యాష్ ఈఎం: రివార్డ్‌ లను పొందండి
  • టిక్: సంపాదించడానికి చూడండి

Astrology, Horoscope June 5: సోమవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి నేడు ధనయోగం ఉంది.. మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ చెక్ చేసుకోండి..

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now