
Tirumala, June 5: తిరుమలలో (Tirumala) కలకలం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం ఓ విమానం (Flight) తిరుమల శ్రీవారి ఆలయానికి (Tirumala Srivari Temple) సమీపం నుంచి వెళ్లింది. ఉదయం 8.00-8.30 గంటల మధ్యలో విమానం గుడి పక్క నుంచి వెళ్లినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. అయితే, విమానం ఎక్కడి నుంచి బయలుదేరింది, గమ్యస్థానం (Destination Place) ఏమిటనేది ఇంకా తెలియాల్సిఉంది. ఆగమశాస్త్రం ప్రకారం.. శ్రీవారి ఆలయం పైనుంచి విమానాలు వెళ్లడం నిషిద్ధం. అయితే, ఇటీవల విమానాలు ఆలయానికి సమీపం నుంచి వెళ్లిన ఘటనలు తరుచూ వెలుగు చూశాయి. ఇక తాజా ఘటనపై విమానయాన శాఖ అధికారులు టీటీడీ విజిలెన్స్ అధికారులతో చర్చిస్తున్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.