JEE Main 2023 Result: జేఈఈ మెయిన్‌ ఫలితాలు వచ్చేశాయోచ్.. హైదరాబాద్‌ విద్యార్థికి మొదటి ర్యాంక్‌.. ఫలితాల కోసం ఈ లింక్స్ క్లిక్ చేయండి..

దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్‌ 2023 సెషన్‌-2(JEE Main 2023 session 2) ఫలితాలు విడుదలయ్యాయి.

EXams declared

Hyderabad, April 29: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్‌ 2023 సెషన్‌-2(JEE Main 2023 session 2) ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్‌ 6 నుంచి 15 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (NTA) శనివారం ఉదయం విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. స్కోర్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్షలు జనవరిలో జరగ్గా.. ఏప్రిల్‌ 6 నుంచి 15వరకు రెండో విడత పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన ఉత్తమ స్కోరు (రెండు సార్లు రాసి ఉంటే)ను పరిగణనలోకి తీసుకొని ఎన్‌టీఏ ర్యాంకులు ప్రకటించింది. జేఈఈ మెయిన్‌లో కేటగిరీల వారీగా కటాఫ్‌ మార్కులు నిర్ణయించి మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయడానికి అర్హత కల్పిస్తారు. తొలి విడత జేఈఈ మెయిన్‌ పరీక్షను 8.24 లక్షల మంది విద్యార్థులు రాయగా.. రెండో విడత పరీక్షను దాదాపు 9లక్షల మంది వరకు హాజరైనట్టు అంచనా.

Rains In Hyderabad: హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. ఈ తెల్లవారుజామున భారీ వర్షం.. జలమయమైన రోడ్లు.. పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా.. మరో రెండు గంటలపాటు కుండపోత.. ఏపీ, తెలంగాణకు రెండురోజులపాటు వర్ష సూచన

హైదరాబాద్‌ విద్యార్థికి మొదటి ర్యాంక్‌

ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. జేఈఈ మెయిన్‌లో హైదరాబాద్‌ (Hyderabad) విద్యార్థి సింగారపు వెంకట్‌ కౌండిన్య మొదటి ర్యాంక్‌ సాధించాడు. 300/300 మార్కులు స్కోర్‌ చేశాడు. కౌండిన్య పాఠశాల విద్య నుంచి ఇంటర్‌ వరకు హైదరాబాద్‌లోని శ్రీచైతన్య విద్యా సంస్థల్లో చదివాడు. జూన్‌ 4వ తేదీన జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తమ ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతానని కౌండిన్య తెలిపాడు.

Rajinikanth Speech: కంటిచూపుతో బాలకృష్ణ ఏదైనా చేయగలడు! ఎన్డీఆర్ శతజయంతి వేడుకల్లో సూపర్‌స్టార్ రజినీకాంత్‌, హైదరాబాద్‌ వెళ్తే న్యూయార్క్‌లో ఉన్నట్లుంది! చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన రజినీ

ర్యాంకులు సాధించిన తెలుగు విద్యార్థులు..

  • పి. లోహిత్‌ ఆదిత్య సాయి - నెల్లూరు - 2వ ర్యాంక్‌
  • సాయి దుర్గారెడ్డి - హైదరాబాద్‌ - 6వ ర్యాంక్‌
  • కె.సాయినాథ్‌ శ్రీమంత - అమలాపురం - 10వ ర్యాంక్‌

ఈ నెల 30 నుంచే అడ్వాన్స్‌డ్‌కు రిజిస్ట్రేషన్లు మొదలు..

ఈ నెల 30 నుంచి జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ పరీక్షకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. మే 7 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు ఫీజు మే 8 వరకు చెల్లించవచ్చు. మే 29 నుంచి జూన్‌ 4 వరకు అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్ష జూన్‌ 4న జరుగుతుంది. పేపర్‌ 1 ఉదయం 9 నుంచి 12 వరకు; పేపర్‌ 2 మధ్యాహ్నం 2.30 నుంంచి సాయంత్రం 5.30వరకు ఉంటుంది. ఈ పరీక్ష ప్రాథమిక సమాధానాల కీ జూన్‌ 11న; ఫలితాలు జూన్‌ 18న విడుదల చేయనున్నట్టు ఐఐటీ గువాహటి షెడ్యూల్‌లో పేర్కొంది. జేఈఈ మెయిన్‌లో కనీస కటాఫ్‌ మార్కులు నిర్ణయించి మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అర్హత కల్పిస్తారు.

Telangana New Secretariat Video: తెలంగాణ నూతన సచివాలయం డ్రోన్ విజువల్స్ ఇవిగో, ఈ నెల 30న సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభం

ఫలితాల కోసం కింది లింక్స్ క్లిక్ చేయండి

లింక్ 1

లింక్ 2

లింక్ 3

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement