Credits: Twitter

Hyderabad, April 29: తెలంగాణ (Telangana) రాజధాని హైదరాబాద్ (Hyderabad) సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ ఉదయం నుంచి వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో  ట్రాఫిక్ (Traffic) నిలిచిపోయింది. విద్యుత్ సరఫరాకు (Power Supply) అంతరాయం కూడా ఏర్పడింది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, హిమాయత్‌నగర్, నారాయణగూడ, ఫిలింనగర్, ఏఎస్ రావు నగర్, కుషాయిగూడ, నాగారం, కీసర, ఈసీఐఎల్ క్రాస్‌రోడ్స్, చర్లపల్లి, నాంపల్లి, లక్డీకాపూల్, మాసబ్‌ట్యాంక్ సహా పలు ప్రాంతాల్లో ఈ ఉదయం ఒక్కసారిగా మబ్బులు కమ్మి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగరంలో మరో రెండు గంటలపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలంటూ హైదరాబాద్ వాతావరణశాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది.

Rajinikanth Speech: కంటిచూపుతో బాలకృష్ణ ఏదైనా చేయగలడు! ఎన్డీఆర్ శతజయంతి వేడుకల్లో సూపర్‌స్టార్ రజినీకాంత్‌, హైదరాబాద్‌ వెళ్తే న్యూయార్క్‌లో ఉన్నట్లుంది! చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన రజినీ

రాష్ట్రాల్లో కూడా..

ఏపీ, తెలంగాణల్లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. విదర్భ నుంచి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, తెలంగాణలోనూ ఓ మోస్తరు వానలు కురుస్తాయని వివరించింది.

Telangana New Secretariat Video: తెలంగాణ నూతన సచివాలయం డ్రోన్ విజువల్స్ ఇవిగో, ఈ నెల 30న సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభం