AP Weather Update: బంగాళఖాతంలో మరో అల్ప పీడనం, రానున్న రెండు రోజుల పాటు ఏపీలో మోస్తరు వర్షాలు, తెలంగాణలో అక్కడక్కడా నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం

ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతం నుంచి దానికి ఆనుకుని ఉన్న ఒడిశా తీర ప్రాంతం వరకూ అల్పపీడనం ఉందని, దానికి అనుబంధంగా 5.8 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం కూడా ఉందని వెల్లడించిన అధికారులు, దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలకు అవకాశాలు ఉన్నాయని, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు.

Weather report: Heavy rains likely in Andhra Pradesh for next two days (Photo-Twitter)

Amaravati, Oct 5: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం (Low pressure) 9వ తేదీన ఏర్పడనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.ఉత్తర అండమాన్ తీర ప్రాంతం నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతం నుంచి దానికి ఆనుకుని ఉన్న ఒడిశా తీర ప్రాంతం వరకూ అల్పపీడనం ఉందని, దానికి అనుబంధంగా 5.8 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం కూడా ఉందని వెల్లడించిన అధికారులు, దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలకు అవకాశాలు ఉన్నాయని, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు.

మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలతో (Telugu States) పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని అధికారులు వ్యాఖ్యానించారు. కాగా, నిన్న కూడా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. నారాయణ పేట్ ప్రాంతంలో అత్యధికంగా 4.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, మిగతా జిల్లాల్లో చిరు జల్లులు కురిశాయి. ఈశాన్య రుతుపవనాలు వచ్చేశాయని, ఈ సీజన్ లో ఇప్పటి వరకూ సగటున 18.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి వుండగా, నిన్నటివరకూ 5.5 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైందని, రానున్న అల్పపీడనాలతో మరింత వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

అక్టోబర్ 7న పోలీస్ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం, కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం, ఏసీపీ న‌ర్సింహారెడ్డిని కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వానలు, పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని (Moderate rain likely in Andhra Pradesh in next 2 days) వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు ఉత్తర అండమాన్‌ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 9వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని పేర్కొంది. గడచిన 24 గంటల్లో పార్వతీపురంలో 7 సెం.మీ, కురుపాం, వీరఘట్టం, బొబ్బిలి, గురుగుబెల్లిలో 5, పమిడి, బలిజిపేట, వేపాడ, సీతానగరం, పాలకొండ, అమలాపురంలో 3 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది.

పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో కృష్ణా, ఉప నదుల్లో వరద తగ్గుముఖం పట్టింది. శ్రీశైలం ప్రాజెక్టులోకి ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి 41,436 క్యూసెక్కులకు ప్రవాహం తగ్గడంతో గేట్లను ఆదివారం ఉదయం 9.30 గంటల సమయంలో పూర్తిగా మూసివేశారు. కుడి కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 27,460 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 7 వేల క్యూసెక్కులు, హంద్రీ–నీవాకు 1,350 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.8 అడుగుల్లో 214.36 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. సాగర్‌లోకి 45,945 క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి కాలువకు 8,650, ఎడమ కాలువకు 5,782, ఏఎమ్మార్పీకి 1,800, ఎఫ్‌ఎఫ్‌సీకి 600 క్యూసెక్కులు వదులుతున్నారు.

రైతులకు జగన్ సర్కారు శుభవార్త, అక్టోబర్ 16 నుంచి పంటల కొనుగోలు, రైతు భరోసా కేంద్రాల్లో వివరాలు నమోదు చేసుకోవాలని అధికారుల సూచన

విద్యుత్‌ కేంద్రం ద్వారా 29,142 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 45,828 క్యూసెక్కులు చేరుతోంది. ప్రకాశం బ్యారేజీలోకి 91,642 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలో గోదావరి నిలకడగా కొనసాగుతోంది. బ్యారేజీలోకి 1,52,376 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 11 వేల క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 1.41 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గొట్టా బ్యారేజీలోకి వంశధార వరద కొనసాగుతుండగా 7,500 క్యూసెక్కులను బంగాళాఖాతంలోకి వదులుతున్నారు.