News

Mumbai Train Viral Video: ముంబై లోకల్ రైలులో షాకింగ్ వీడియో వైరల్.. ప్రమాదకరంగా బయటకు వేలాడుతూ కనిపించిన లేడీ.. మహిళల భద్రతపై మళ్లీ ఆందోళన..

Team Latestly

ముంబై రైలు ట్రాఫిక్ గురించి తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. సెంట్రల్ రైల్వే యొక్క స్లో కారిడార్‌లోని దివా - ముంబ్రా మధ్య ఉన్న ప్రమాదకరమైన వంపును దాటుతుండగా.. CSMT వైపు వెళ్తున్న ఒక సబర్బన్ రైలులోని కిక్కిరిసిన మహిళల కంపార్ట్‌మెంట్ నుండి చీర కట్టుకున్న ఓ మహిళ ప్రమాదకరంగా బయటకు వేలాడుతూ కనిపించింది.

Devshayani Ekadashi 2026: దేవశయని ఏకాదశి 2026.. శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లే పవిత్ర రోజు.. ఈ రోజును ఎందుకు అత్యంత పవిత్రంగా భావిస్తారు?

Team Latestly

దేవశయని ఏకాదశి సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినంగా చెప్పుకోవచ్చు. ఈ రోజున శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషనాగుపై యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని.. దీనితోనే నాలుగు నెలల పాటు సాగే పవిత్రమైన చాతుర్మాసం ప్రారంభమవుతుందని నమ్ముతారు. 2026వ సంవత్సరంలో జూలై 25, శనివారం నాడు ఈ పండుగను జరుపుకుంటున్నారు.

Weather Update Today: తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ ఆదేశాలు, ఈ రోజు వాతావరణం ఇదిగో...

Team Latestly

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం రాత్రి నుండి రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం చల్లబడింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది.

Horoscope Today, July 21: జూలై 21, 2026 రాశిఫలం.. ఆంజనేయస్వామి అనుగ్రహంతో ఈ రాశివారికి అనుకోని ధనలాభం!

Team Latestly

Horoscope Today, July 21: నేడు, 21 జూలై 2026, మంగళవారం నాడు చంద్రుని సంచారం, బుధుడి వక్రగతి వలన పన్నెండు రాశుల వారికి విభిన్న ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యమైన పత్రాలు, ఆర్థిక లావాదేవీల విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం.

Advertisement

Tomorrow Weather Update: రేపటి వాతావరణం అప్‌డేట్.. చురుగ్గా కదులుతున్న నైరుతి రుతపవనాలు, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Team Latestly

నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా చురుగ్గా కదులుతుండటంతో పాటుగా.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జూలై నెల మధ్య భాగం నాటికి వేసవి తాపం పూర్తిగా తగ్గి, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వాతావరణం చల్లబడింది.

Viral Video: షాకింగ్ వీడియో ఇదిగో, యూపీలో ఫేక్ అంత్యక్రియలకు యత్నించిన ముగ్గురు అరెస్ట్, బీమా డబ్బుల కోసం ఫేక్ అంత్యక్రియలు నిర్వహించాలనుకున్న ఢిల్లీ వస్త్ర వ్యాపారి, మరో ఇద్దరు వ్యక్తులు

Team Latestly

బీమా డబ్బుల కోసం ఫేక్ అంత్యక్రియలు నిర్వహించాలనుకున్న ఢిల్లీ వస్త్ర వ్యాపారి సహా ముగ్గురిని యూపీ హాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. గంగానది ఒడ్డున ఉన్న బ్రజఘాట్‌లో, నిందితులు ఒక కారులో ప్లాస్టిక్ బొమ్మను మృతదేహం వలె తయారుచేసి తీసుకొచ్చి, దహనం చేసేందుకు ప్రయత్నించారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని లెక్చ‌ర‌ర్‌ని చిత‌క‌బాదిన త‌ల్లిదండ్రులు, ప్రకాశం జిల్లా నాగలుప్పలపాడు మండలం నిడమనూరు జూనియర్ ఇంటర్ కాలేజీలో ఘటన

Team Latestly

ప్రకాశం జిల్లాలోని నాగలుప్పలపాడు మండలం నిడమనూరు జూనియర్‌ ఇంటర్‌ కాలేజీలో పనిచేస్తున్న బక్కమంతుల వినయ్ అనే లెక్చరర్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లివిరిశాయి. విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడన్న సమాచారం తెలిసిన తల్లిదండ్రులు, గ్రామస్థులు కళాశాలకు చేరుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లెక్చ‌ర‌ర్‌ని పట్టుకుని చిత‌క‌బాదారు.

Hong Kong Fire: హాంకాంగ్‌ అగ్నిప్రమాదంలో 94కు చేరిన మృతులు సంఖ్య, ఏడు భవనాలకు అంటుకున్న మంటలు,  గత 60 ఏళ్లలో ఇదే భారీ అగ్నిప్రమాదం

Team Latestly

హాంకాంగ్‌లోని ఓ ఎత్తైన భవన సముదాయంలో బుధవారం చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదానికి దారితీసింది. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 94కి పెరిగిందని అధికారులు వెల్లడించారు. 200 మందికి పైగా వ్యక్తులు ఇంకా కనుగొనబడలేదని సమాచారం. 72 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Advertisement

Allahabad High Court: భర్త నిరుద్యోగి అయినా భార్యకు భరణం చెల్లించాలల్సిందే, కీలక తీర్పును వెలువరించిన అలహాబాద్‌ హైకోర్టు, కేసు పూర్వాపరాలు ఏంటంటే..

Team Latestly

భార్యకు పోషణ భత్యం చెల్లించాల్సిన బాధ్యతను భర్త నిరుద్యోగం అనే కారణంతో తప్పించుకోలేడని అలహాబాద్‌ హైకోర్టు లక్నో బెంచ్ స్పష్టం చేసింది. శారీరకంగా పనిచేయగలిగే స్థితిలో ఉన్న భర్తకు ఆదాయం లేకపోవడం సరైన నెపంగా పరిగణించబడదని కోర్టు స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది.

Hyderabadi Biryani: ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని దక్కించుకున్న హైదరాబాద్‌ బిర్యానీ, టాప్ 10 రైస్ డిషెస్‌లో చోటు, అగ్రస్థానంలో జపనీస్ వంటకాలు

Team Latestly

ప్రపంచవ్యాప్తంగా మరోసారి హైదరాబాదీ బిర్యానీ తన ప్రత్యేక రుచితో అందరినీ ఆకట్టుకుంది. అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన ఆన్‌లైన్‌ ఫుడ్ & ట్రావెల్‌ ప్లాట్‌ఫార్మ్‌ టేస్ట్ అట్లాస్ తాజాగా విడుదల చేసిన వరల్డ్ బెస్ట్ రైస్ డిషెస్ 2025 జాబితాలో మన హైదరాబాదీ బిర్యానీ టాప్ 10లో చోటు దక్కించుకోవడం గర్వకారణం.

Hong Kong Tai Po Apartment Fire: హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదంపై సంచలన విషయాలే, 55 మందికి పైగా మృతి, కిటికీల వద్దే సిగరెట్‌ పీకల వల్లే మంటలు ఎగసాయా..

Team Latestly

హాంకాంగ్‌ను విషాదంలో ముంచెత్తిన భయంకరమైన అగ్నిప్రమాదం ప్రపంచాన్ని కదిలించింది. నగరంలోని ఒక ప్రముఖ హౌసింగ్‌ కాంప్లెక్స్‌లో ఉన్న ఆకాశాన్ని తాకే అట్టడుగు భవనాల్లో విపరీతంగా చెలరేగిన మంటల్లో 55 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతయ్యారు. గత ఆరు దశాబ్దాల్లో ఇదే అత్యంత పెద్ద అగ్ని ప్రమాదమని అధికారులు స్పష్టం చేశారు.

Bengaluru: వీడియో ఇదిగో, బ్యాగు నిండా డబ్బు.. ఆటోలో మరచిపోయిన ప్రయాణికుడు, నిజాయితీగా ఆ డబ్బును మరచిపోయిన వ్యక్తికి అందజేసిన ఆటో డ్రైవర్‌, సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ

Team Latestly

ఈ రోజుల్లో డబ్బు లేదా విలువైన వస్తువులు దొరికితే వాటిని తమవిగా చేసుకోవడమే చాలామంది ఆచారం. అయితే బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్‌ నిజాయతీకి నిదర్శనంగా నిలిచాడు. జీవనోపాధి కోసం ఆటో నడుపుతున్న రాజు, తన ఆటోలో ఒక ప్రయాణికుడు మరిచిపోయిన డబ్బులతో నిండిన బ్యాగును గుర్తించాడు. ఆ డబ్బును స్వంతం చేసుకోవాలన్న ఆలోచన చేయకుండా, ప్రయాణికుడిని వెతికి అతనికి తిరిగి అందజేశాడు.

Advertisement

Visakhapatnam: కూతురి పెళ్లి ఆగిపోయిందన్న మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య, వరుడి కుటుంబ సభ్యులను వేడుకున్నా ఫలితం శూన్యం, వాట్సాప్‌లో బంధువులకు సూసైడ్ నోట్ పంపిన మృతుడు

Team Latestly

కూతురు పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయిందన్న ఆవేదనను తట్టుకోలేక ఓ తండ్రి ప్రాణాలు తీసుకున్న విషాదకర ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. వివాహం రద్దయిందన్న షాక్ నుంచి బయటపడలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది.

Hyderabad: ట్రాఫిక్ డ్యూటీలో రౌడీషీటర్లు, రాచకొండ పోలీసుల వినూత్న ప్రయోగం, తొలి దశలో 60 మందికి బాధ్యతలు, మంచి పౌరులుగా మార్చడమే లక్ష్యమన్న కమిషనర్

Team Latestly

సమాజంలో మార్పు తీసుకురావాలంటే కఠిన శిక్షలు మాత్రమే సరిపోవు, మార్పు అవకాశాలు కూడా ఇవ్వాలి. నేర చరిత్ర ఉన్నవారికి కొత్త జీవితం ఇవ్వాలనే లక్ష్యంతో రాచకొండ పోలీసులు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.

India vs South Africa: దక్షిణాఫ్రికా చేతిలో భారత్‌‌కు ఘోర పరాభవం, రెండో టెస్టులో 408 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం, 2–0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకున్న సఫారీలు

Team Latestly

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్‌ ఘోర పరాజయం పాలైంది. గువాహటి వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో దక్షిణాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ టార్గెట్ ను ఛేదించే క్రమంలో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమిండియా కేవలం 140 పరుగులకే ఆలౌటైంది.

Curry Leaves benefits: కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలు, మధుమేహం కంట్రోల్‌లో రావాలన్నా, హానికరమైన ఎల్డిఎల్ తగ్గాలన్నా కరివేపాకును మించినది లేదంటే నమ్మగలరా..

Team Latestly

కరివేపాకు.. మన రోజువారీ వంటల్లో తప్పనిసరి అయ్యే ఈ ఆకులకు రుచి, వాసన మాత్రమే కాదు, ఆరోగ్య పరంగా అద్భుతమైన ఔషధ విలువలు ఉన్నాయి. చాలా మంది ఇది కేవలం సువాసనకే ఉపయోగిస్తారని భావించి, వడ్డించినప్పుడు పక్కకు తొలగిస్తారు. కానీ కరివేపాకుల్లో శరీరానికి అవసరమైన ఎన్నో పౌష్టిక గుణాలు దాగి ఉన్నాయి.

Advertisement

Thane Shocker: ప్రియురాలిని చంపి సూట్‌కేసులో కుక్కాడు, చివరకు ఆమె చేతి మీద ఉన్న పచ్చబొట్టుతో దొరికిపోయాడు, థానే జిల్లాలో వెలుగు చూసిన దారుణ ఘటన

Team Latestly

మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగిన ఒక భయానక హత్య కేసు వెలుగులోకి వచ్చింది. సహజీవనం చేస్తున్న మహిళను చంపి, ఆమె శవాన్ని సూట్‌కేసులో నింపి కాలువలో పడేసిన ఘోర ఘటన స్థానికులను కలవరపరిచింది. ఈ కేసులో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Hyderabad: ప్రియురాలు మోసం చేసిందని ఆత్మహత్య చేసుకున్న ఇన్ఫోసిస్ టెక్కీ, హైదరాబాద్‌లో విషాదకర ఘటన, కేసు నమోదు చేసుకున్న పోలీసులు

Team Latestly

హైదరాబాద్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ఒక యువ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యక్తిగత సమస్యలతో తీవ్ర నిరాశకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మోసపోయాననే మనస్తాపంతో ఈ దుస్థితి ఎదురైందని పోలీసులు వెల్లడించారు. ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ రెడ్డి (26) ఈ ఘటనలో మరణించాడు.

Andhra Pradesh: ఏపీలో మరో 3 జిల్లాలు ఏర్పాటు, కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు, రాష్ట్రంలో 29కి చేరనున్న మొత్తం జిల్లాల సంఖ్య,మంత్రుల కమిటీ సిఫార్సులకు ఆమోదం తెలిపిన సీఎం చంద్రబాబు

Team Latestly

ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మరో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆయన ఆమోదం తెలిపారు.

Hydrogen Balloon Blast: తీవ్ర విషాదం, పెళ్లి వేడుకలో పేలిన హైడ్రోజన్ బెలూన్లు, వధూవరులకు తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..

Team Latestly

ఒక విషాదకరమైన సంఘటనలో, ఒక జంట హల్ది వేడుకలో వారి ప్రవేశానికి ఏర్పాటు చేసిన హైడ్రోజన్ బెలూన్లు పేలిపోవడంతో వధూవరులు ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Advertisement
Advertisement