Anti-CAA Protests: సీఏఏ నిరసనకారులకు పంపిన 274 రికవరీ నోటీసులను వెనక్కి తీసుకున్న యూపీ సర్కారు, వసూలు చేసిన మొత్తం వారికి తిరిగిస్తామని సుప్రీంకోర్టుకు వెల్లడి

పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక నిరసనకారులకు (Anti-CAA Protests) నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ పంపిన నోటీసులను (Withdrawn Recovery Notices Against Protestors) ఉపసంహరించుకుంది

Representative Image of Supreme Court ( Photo Credits: Wikimedia Commons )

New Delhi, February 18: ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం.. పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక నిరసనకారులకు (Anti-CAA Protests) నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ పంపిన నోటీసులను (Withdrawn Recovery Notices Against Protestors) ఉపసంహరించుకుంది. కాగా ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టాన్ని నిరసనకారుల నుంచి వసూలు చేయడాన్ని అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ఆ సొమ్మును తిరిగి వారికి ఇచ్చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో యూపీ సర్కారు (UP Govt Tells Supreme Court) దీనిపై వెనక్కి తగ్గింది.

అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన కొత్త చట్టం ప్రకారం తాజా నోటీసులు జారీ చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతించింది. సుప్రీంకోర్టుకు హాజరైన యూపీ ప్రభుత్వం, 274 రికవరీ నోటీసులను ఉపసంహరించుకున్నామని, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు జరిగిన నష్టానికి సంబంధించి 2019లో CAA వ్యతిరేక నిరసనకారులపై కొట్ట చట్టం ద్వారా చర్యలు ప్రారంభించామని న్యాయమూర్తులు DY చంద్రచూడ్, సూర్యకాంత్‌ల ధర్మాసనానికి తెలియజేశారు. కాగా CAA వ్యతిరేక నిరసనకారులపై కొత్త చట్టం ప్రకారం కొనసాగడానికి సుప్రీం కోర్టు UP ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది.

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా 2019లో జరిగిన నిరసన కార్యక్రమాల సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం జరిగింది. ఈ నష్టాన్ని భర్తీ చేయాలని నిరసనకారులకు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులిచ్చిన సంగతి విదితమే. రికవరీ నోటీసులను రద్దు చేయాలని కోరుతూ పర్వేజ్ అరిఫ్ టిటు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. చట్టవిరుద్ధంగా జారీ చేసిన నోటీసులను ఉపసంహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలో ఆదేశించింది. దీంతో 274 రికవరీ నోటీసులను ఉపసంహరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది.

వరుస పేలుళ్ల కేసులో 38 మందికి ఉరిశిక్ష, అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో స్పెషల్ కోర్టు తీర్పు, 13 ఏళ్ల పాటూ సాగిన విచారణ, ట్విస్టుల మధ్య సాగిన దర్యాప్తు

సీఏఏ వ్యతిరేక నిరసనకారుల నుంచి వసూలు చేసిన మొత్తం సొమ్మును తిరిగి వారికి ఇచ్చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది. నష్టపరిహారాన్ని రాబట్టేందుకు 2019 డిసెంబరులో చేపట్టిన చర్యలు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని తెలిపింది. అయితే ఉత్తర ప్రదేశ్ రికవరీ ఆఫ్ డ్యామేజెస్ టు పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవచ్చునని తెలిపింది. ఈ చట్టాన్ని 2020 ఆగస్టు 31న నోటిఫై చేశారు.

2019 డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో కొందరు నిరసనకారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంపై సీఎం యోగి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న కొందరి నుంచి నష్టం వ్యయాన్ని వసూలు చేసింది. కొందరి ఆస్తులను జప్తు చేసింది. ఈ మేరకు మరి కొందరికి నోటీసులు జారీ చేసింది.

Delhi: ఢిల్లీలో బ్యాగులో బాంబు, పరారీలో నలుగురు యువకులు, సీమపురిలో ఓ ఇంట్లో బ్యాగులో పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్న ఎన్‌ఎస్‌జీ బృందం

అయితే ఈ నోటీసులను రద్దు చేయాలని, ప్రభుత్వం వసూలు చేసిన కోట్లాది మొత్తాన్ని నిరసనకారులకు తిరిగి ఇప్పించాలని కోరుతూ పర్వైజ్ ఆరిఫ్ టిటు అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆరేండ్ల కిందట 94 ఏండ్ల వయసులో మరణించిన వ్యక్తి, 90 ఏండ్లు పైబడిన ఇద్దరు వ్యక్తులతో సహా పలువురికి ఈ నోటీసులు పంపారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు దిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. సీఏఏపై సుప్రీంకోర్టు నిర్దేశించిన చట్టానికి ఇది విరుద్ధమని పేర్కొంది. రికవరీ నోటీసులు, దీనికి సంబంధించిన చర్యలను వెనక్కి తీసుకోవాలని, ఇదే చివరి అవకాశమని ఈ నెల 11న యూపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఈ నేపథ్యంలో 274 రికవరీ నోటీసులను వెనక్కి తీసుకున్నామని, సీఏఏ వ్యతిరేక నిరసనకారులపై సంబంధిత చర్యలను నిలిపివేశామని కోర్టుకు యూపీ ప్రభుత్వం తెలిపింది.

కాగా, రికవరీ సొమ్మును వెనక్కి తిరిగి వచ్చే బదులు ఈ వ్యవహారాన్ని ట్రిబ్యునల్‌కు బదిలీ చేయడానికి అనుమతించాలని ప్రభుత్వం తరుపున అదనపు అడ్వకేట్ జనరల్ గరిమా ప్రసాద్ అఫిడవిట్‌ ద్వారా కోర్టును కోరారు. సుప్రీంకోర్టు దీనికి నిరాకరించింది. సీఏఏ వ్యతిరేక నిరసనకారుల నుంచి రికవరీ చేసిన కోట్లాది పూర్తి మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే యూపీ సర్కారు వాటిని ఉపసంహరించుకుంటున్నామని అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది.



సంబంధిత వార్తలు

Weather Forecast: కోస్తా తీరం వైపు దూసుకొస్తున్న అల్పపీడనం, వచ్చే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనం మారే అవకాశం, ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత

Andhra Pradesh Cabinet Meeting: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినేట్ భేటీ.. రాజధాని నిర్మాణంలో యువత భాగస్వామ్యం, పరిశ్రమలకు భూ కేటాయింపు, కీలక నిర్ణయాలు తీసుకోనున్న మంత్రివర్గం

Cold Wave Grips Telangana: హైదరాబాద్ వాసులకు అలర్ట్, మరో రెండు రోజులు వణికించనున్న చలిగాలులు, తెలంగాణలో కనిష్ఠానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు

Rain Alert for AP: ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif