Arunachal Hunters: ఆకలికి తట్టుకోలేక 12 అడుగుల కింగ్ కోబ్రాను చంపేశారు, లాక్‌డౌన్ నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్‌లో ఘటన, వన్యప్రాణుల రక్షణ చట్టం కింద కేసు నమోదు
ఆహారం లేక కొన్ని చోట్ల పరిస్థితి చాలా దారుణంగా మారింది. అందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా ఈ వీడియోని చెప్పవచ్చు. అరుణాచల్ ప్రదేశ్‌లో (Arunachal Pradesh) విందు కోసం 12 అడుగుల పొడవైన కింగ్ కోబ్రాను (king cobra) వేటగాళ్ల బృందం చంపేసింది.
Guwahati, April 20: కరోనా వైరస్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ (Lockdown) కారణంగా కొన్నిచోట్ల ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆహారం లేక కొన్ని చోట్ల పరిస్థితి చాలా దారుణంగా మారింది. కాగా అరుణాచల్ ప్రదేశ్‌లో (Arunachal Pradesh) విందు కోసం 12 అడుగుల పొడవైన కింగ్ కోబ్రాను (king cobra) వేటగాళ్ల బృందం చంపేసింది.
ఇండియాలో 17 వేలు దాటిన కోవిడ్-19 కేసులు
అనంతరం కింగ్ కోబ్రా మాంసాన్ని ముక్కలుగా చేసి విందు కోసం భారీ ఏర్పాట్లు చేశారు. కోబ్రా మాంసాన్ని శుభ్రపరించేందుకు అరటి ఆకులను వేశారు. కింగ్ కోబ్రాను చంపిన వీడియో ఒకటి వైరల్ కావడంతో అధికారుల దృష్టికి వెళ్లింది. కోవిడ్-19 రహిత రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్
ఎన్‌డిటివి రిపోర్ట్ ప్రకారం, లాక్డౌన్ కారణంగా వారి ధాన్యాగారాలలో బియ్యం మిగిలి లేవని పురుషుల్లో ఒకరు వీడియోలో చెప్పడం మనం వినవచ్చు. "కాబట్టి మేము ఏదో వెతుకుతూ అడవికి వెళ్లి, దీనిని కనుగొన్నామని , "వారిలో ఒకరు చెప్పారు. వారిపై వన్యప్రాణుల రక్షణ చట్టం కింద సంబంధిత కేసు నమోదైంది, ప్రస్తుతం నిందితులందరూ పరారీలో ఉన్నారు. అయితే ఈ వీడియోపై అరుణాచల్ ప్రదేశ్ సర్కారు స్పందించింది.
ఇది అంతా పుకారు అని రాష్ట్రంలో ఆహార కొరత లేదని అరుణాచల్ ప్రదేశ్ సర్కారు స్పష్టం చేసింది. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేసింది. "అరుణాచల్ ప్రదేశ్ లో బియ్యం కొరత లేదు. రాష్ట్రంలో అన్ని ప్రదేశాలలో కనీసం మూడు నెలల స్టాక్ ఉంది మరియు జీవనోపాధి కోల్పోయిన వారికి ఉచిత రేషన్ అందిస్తోంది. ఈ రోజు వరకు సుమారు 20000 మందికి ఉచిత రేషన్ అందించబడింది" అని అరుణాచల్ ప్రభుత్వ ప్రజా సంబంధాల విభాగం ఒక వివరణ విడుదల చేసింది .
Here's ARUNACHAL IPR Tweet
Here's the video that is going viral on social media:
కింగ్ కోబ్రా చట్టం ప్రకారం రక్షిత సరీసృపాలు, వాటిని చంపడం బెయిల్ మంజూరు చేయలేని నేరంగా పరిగణిస్తారు. అరుణాచల్ ప్రదేశ్ పెద్ద సంఖ్యలో అంతరించిపోతున్న పాము జాతులకు నిలయంగా మారింది. పరిశోధకులు ఇటీవల ఒక విషపూరిత పాము కొత్త జాతిని అక్కడ కనుగొన్నారు.
ఇంటర్నెట్‌లో వైరల్ అయిన మరో విషాద వీడియోలో, జెహానాబాద్‌లోని పిల్లల బృందం కప్పలు తింటున్నట్లుగా ఓ వీడియోలో కనిపించారు. COVID-19 లాక్డౌన్ కారణంగా వారి ఇళ్ళ వద్ద ఉన్న ఆహార నిల్వ అయిపోయినందున ఉభయచరాలు తినడం ద్వారా వారు తమ ఆకలిని తీర్చవలసి వచ్చిందని మైనర్లు చెప్పారు.