COVID 19 Testing (Photo Credits: Pixabay)

Itanagar, April 15: ఓ వైపు దేశవ్యాప్తంగా కోవిడ్ 19 (COVID 19) కేసులు పెరుగుతున్నాయి, మరోవైపు పలు రాష్ట్రాల్లో కరోనా బాధితులు కోలుకుంటున్నారు. చికిత్స తరువాత పాజిటివ్ కేసులు క్రమంగా నెగెటివ్‌గా మారుతున్నాయి. ఇదిలా ఉంటే అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో న‌మోదైన తొలి క‌రోనా పాజిటివ్ కేసు ఇపుడు నెగెటివ్ గా (COVID-19 Patient Tests Negative) నిర్దార‌ణ అయింది.

ఆగని కరోనా మరణాలు, దేశ వ్యాప్తంగా 437 మంది మృతి, 13 వేలు దాటిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు

క‌రోనా పాజిటివ్ వ్య‌క్తికి రెండో సారి ప‌రీక్ష నిర్వ‌హించ‌గా నెగిటివ్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత 3, 4వ సారి కూడా ప‌రీక్ష‌లు చేయ‌గా నెగెటివ్ వ‌చ్చింది. దీంతో ప్ర‌స్తుతం అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ (Arunachal Pradesh) లో క‌రోనా పాజిటివ్ కేసులేవి లేవ‌ని ఆ రాష్ట్ర సీఎం పెమా ఖండూ (Pema Khandu) తెలిపారు. ఈ మేర‌కు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఇంటిలోనే ఉండండి..సుర‌క్షితంగా ఉండండి అంటూ హ్యాష్ ట్యాగ్ జ‌త చేశారు.

ఇక మనదేశంలో అతి తక్కువ కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో అరుణాల్ ప్రదేశ్ ఒకటి. అక్కడ ఇప్పటి వరకు ఒకే ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. అతడిని ఆస్పత్రిలో చేర్చించి కొన్ని ట్రీట్‌మెంట్ ఇవ్వడంతో ప్రస్తుతం కోలుకున్నాడు. మూడు, నాలుగోసారి కూడా నిర్వహించిన పరీక్షల్లోనూ నెగెటివ్ వచ్చింది. ఉన్న ఒక్క బాధితుడూ కోలుకోవడంతో అరుణాల్ ప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య సున్నాకు చేరింది.

Arunachal Pradesh CM Pema Khandu's Tweet

దేశంలో కరోనావైరస్ (Coronavirus) మరణాలు ఆగడం లేదు. కొవిడ్-19 (COVID 19) కట్టడికి పటిష్ట చర్యలు కొనసాగుతున్నా మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు వైరస్ బారిన పడి 437 మంది మృతి (Coronavirus Death Toll) చెందారు. మొత్తం 13,387 మందికి కొవిడ్ సోకినట్లు గుర్తించారు. దేశంలో 1,749 మంది కోలుకోగా, 11,200 పాజిటివ్ కేసులు కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో కేసుల సంఖ్య 1007 నమోదు కాగా 23 మంది చనిపోయారు.