#AatmanirbharBharat: ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరుతో రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ, సర్కార్ నుంచి వెళ్లే ప్రతి రూపాయి ప్రతి శ్రామికుడు, రైతు జేబులోకి, 21వ శతాబ్దం భారత్‌దేనని తెలిపిన ప్రధాని మోదీ
ఈ క్రమంలో ఆయన భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు అంటూ భారీ ప్యాకేజిని ప్రకటించారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ (Aatma Nirbhar Bharat Abhiyan) పేరిట రూ.20 లక్షల కోట్లతో ప్యాకేజి ప్రకటించారు.
New Delhi, May 12: గత 4 నెలలుగా కోవిడ్ 19తో పోరాడుతున్నామని, యావత్ ప్రపంచంతో పాటు భారత్ కూడా శక్తివంచన లేకుండా శ్రమిస్తోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు అంటూ భారీ ప్యాకేజిని ప్రకటించారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ (Aatma Nirbhar Bharat Abhiyan) పేరిట రూ.20 లక్షల కోట్లతో ప్యాకేజి ప్రకటించారు. లాక్‌డౌన్ 4కు సిద్ధమవండి, మే 18లోపు పూర్తి వివరాలు, కరోనాపై పోరాటంలో అలసిపోవద్దు, కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ
21వ శతాబ్దం భారత్ దేనని, ఈ ప్యాకేజి అండగా మన దేశం మున్ముందు కూడా మరింత మెరుగైన ఆర్థిక పురోగతి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాజా ప్యాకేజి (Economic Relief Package) భారత్ జీడీపీలో 10 శాతం ఉంటుందని అన్నారు. ల్యాండ్, లేబర్, లా, లిక్విడిటీలకు బలం చేకూర్చేలా ప్యాకేజీ ఉండనుందని మోదీ స్పష్టం చేశారు. ప్యాకేజీతో సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు ఊతమిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ మొత్తాన్ని ప్రధానంగా వ్యవసాయం, కార్మికులు, కుటీర పరిశ్రమలు, లఘు పరిశ్రమలపై వెచ్చించనున్నామని, పేదలు, వలస కార్మికులు, కూలీలు, మత్స్యకారులకు ఈ ప్యాకేజి ఊతమిస్తుందని వివరించారు. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రేపు వెల్లడిస్తారని మోదీ పేర్కొన్నారు. విపత్తును కూడా భారత్ అవకాశంగా మల్చుకుంటుందని తెలిపారు. ఇప్పుడు భారత్ పురోగతే ప్రపంచ పురోగతిగా మారిందని వివరించారు. రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజి, ప్రాణాలు కాపాడుకుంటూ కరోనాపై యుద్ధం చేయాల్సిందే, భారత్ సామర్ధ్యాన్ని ప్రపంచం నమ్ముతోంది, జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు, ప్రతి పారిశ్రామికుల్ని కలుపుకొనిపోయేలా ప్యాకేజీ ఉంటుందని ప్రధాని మోదీ వెల్లడించారు. సర్కార్ నుంచి వెళ్లే ప్రతి రూపాయి ప్రతి శ్రామికుడు, రైతు జేబులోకి వెళ్తుందని మోదీ ప్రకటించడం విశేషం. సంఘటిత, అసంఘటిత కార్మికులందర్నీ ప్యాకేజీతో ఆదుకుంటామని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. అలాగే లోకల్ బ్రాండ్లకు విశేష ప్రజాదరణ కల్పించాలన్నారు. ఇది మన ఉత్పత్తి అన్న భావన కలిగేలా చేయాలన్నారు. స్థానిక ఉత్పత్తుల అమ్మకాలు పెరిగితే, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్న ఉద్దేశంతో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
చేనేత, ఖాదీ వస్త్రాలకు ఇప్పుడు ఉన్న డిమాండ్‌ను కూడా ఆయన గుర్తు చేశారు. లోకల్ బ్రాండ్లనే జీవన మంత్రంగా చేసుకోవాలన్నారు. ఇప్పుడు గ్లోబల్ బ్రాండ్లుగా పేరుగాంచిన వస్తువులన్నీ.. ఒకప్పుడు లోకల్ మాత్రమే అన్నారు. అయితే ఎప్పుడైతే ప్రజలు వాటికి మద్దతు ఇస్తారో అప్పుడే ఆ బ్రాండ్లు గ్లోబల్‌గా మారుతాయన్నారు. అందుకే నేటి నుంచి ప్రతి భారతీయుడు లోకల్ బ్రాండ్లకు.. స్వరంగా మారాలన్నారు. గతంలో లోకల్ బ్రాండ్లే మనల్ని రక్షించాయన్నారు. అవి అవసరమే కాదు, వాటిని వాటడం కూడా మన బాధ్యత అన్నారు.