Bandra Migrant Chaos: ఛ‌లో ఘ‌ర్ కీ ఓర్‌ అంటూ మెసేజ్‌లు, బాంద్రాలో వలస కూలీలను రెచ్చగొట్టిన వ్యక్తి అరెస్ట్, వారిని స్వస్థలాలకు పంపబోమని ప్రకటించిన మహారాష్ట్ర హోమంత్రి

అత‌న్ని విన‌య్ దూబేగా (Vinay Dubey) గుర్తించారు. కార్మికుల నేత‌గా అత‌ను చెప్పుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో లాక్ డౌన్ (Maharashtra Lockdown) కొనసాగుతున్న వేళ ఛ‌లో ఘ‌ర్ కీ ఓర్‌ (ఇంటికి వెళ్దాం ప‌దండి) అంటూ విన‌య్ వ‌ల‌స కూలీల‌ను రెచ్చ‌గొడుతూ మెసేజ్‌లు చేసిన‌ట్లు పోలీసులు గుర్తించారు. ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌లో విన‌య్‌ పెట్టిన పోస్టుల వ‌ల్లే కూలీలు భారీ సంఖ్య‌లో త‌రిలివచ్చార‌న్న కోణంలో విచార‌ణ సాగిస్తున్నారు.

Vinay Dubey, accused of instigating migrants in Mumbai | (Photo Credits: Facebook)

Mumbai, April 15: దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ( Lockdown) మే 3వరకు పొడిగిస్తూ దేశ ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మహారాష్ట్రలోని ముంబైల్ ఒక్కసారిగా కలకలం రేగిన విషయం విదితమే. కూలీలంతా ఒక్కసారిగా ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ లోకి వచ్చేశారు. లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ వీరంతా ఒక్కసారిగా రైల్వే స్టేషన్లలోకి ఎలా వచ్చారని పోలీసులు ఆరాతీయగా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ముంబై బాంద్రాలో వలస కార్మికుల ఘోష, లాక్‌డౌన్ పొడిగింపుపై నిరసన

కాగా బాంద్రా రైల్వే స్టేష‌న్ ప‌రిస‌రాల్లో ఉన్న వ‌ల‌స కూలీల‌ను (Bandra Migrant Chaos) రెచ్చ‌గొట్టిన వ్య‌క్తిని ముంబై పోలీసులు (Mumbai Police) అరెస్టు చేశారు. అత‌న్ని విన‌య్ దూబేగా (Vinay Dubey) గుర్తించారు. కార్మికుల నేత‌గా అత‌ను చెప్పుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో లాక్ డౌన్ (Maharashtra Lockdown) కొనసాగుతున్న వేళ ఛ‌లో ఘ‌ర్ కీ ఓర్‌ (ఇంటికి వెళ్దాం ప‌దండి) అంటూ విన‌య్ వ‌ల‌స కూలీల‌ను రెచ్చ‌గొడుతూ మెసేజ్‌లు చేసిన‌ట్లు పోలీసులు గుర్తించారు. ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌లో విన‌య్‌ పెట్టిన పోస్టుల వ‌ల్లే కూలీలు భారీ సంఖ్య‌లో త‌రిలివచ్చార‌న్న కోణంలో విచార‌ణ సాగిస్తున్నారు.

Update by ANI

కూలీల్లో ఎక్కువ శాతం బెంగాల్‌, బీహార్‌, యూనీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన‌వాళ్లు ఉన్నారు. వ‌ల‌స‌కూలీల‌కు ర‌వాణా ఏర్పాట్లు చేయాల‌ని విన‌య్ దూబే ఓ వీడియోలో కోరారు. ఆ వీడియో బాంద్రా ప్రాంతంలో వైర‌ల్‌గా మారిన‌ట్లు గుర్తించారు. ఏప్రిల్ 14వ తేదీన లాక్‌డౌన్ ముగుస్తుంద‌ని, ఒక‌వేళ ప్ర‌భుత్వం ర‌వాణా ఏర్పాట్లు చేయ‌కుంటే, తానే కాలిన‌డ‌క‌న వారితో ర్యాలీ తీయ‌నున్న‌ట్లు దూబే ఆ వీడియోలో పేర్కొన్నాడు.

లాక్‌డౌన్ (Lockdown) మే 3 వరకూ పొడిగింపు

కాగా ఉత్త‌ర్ భార‌తీయ మ‌హాపంచాయ‌త్ అనే ఓ ఎన్జీవోను దూబే న‌డుపుతున్నాడు. మ‌హారాష్ట్ర‌లో ఉత్త‌ర‌భార‌త కూలీలు ప‌డుతున్న ఇబ్బందుల గురించి అత‌ను ప్ర‌తి రోజూ మాట్లాడుతూనే ఉన్నాడు. గ‌తంలో ఓసారి అత‌ను.. రాజ్ ఠాక్రేను కూడా త‌న స‌భ‌కు ఆహ్వానించాడు. న‌వీముంబైలో నిన్న రాత్రే అత‌న్ని అదుపులోకి తీసుకున్న‌ట్లు పోలీసులు చెబుతున్నారు. లాక్‌డౌన్ ఆంక్ష‌లు ఉల్లంఘించిన వెయ్యి మందిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు.

దేశవ్యాప్తంగా రైళ్లు, విమానాలు అన్నీ బంద్

ఇదిలా ఉంటే ఏప్రిల్ 14 తర్వాత కేంద్రం లాక్‌డౌన్‌ ఎత్తివేస్తుందని భావించిన వారంతా గుంపులుగుంపులుగా మంగళవారం ఉదయం నుంచి బాంద్రా రైల్వేస్టేషన్‌కు చేరుకోవడం ప్రారంభించారు. ఇంతలోనే లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించగానే అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సుమారు వెయ్యి మంది వలస కూలీలు రైల్వే స్టేషన్‌ వద్ద నిరసనకు దిగారు. స్వగ్రామాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

లాక్‌డౌన్ గైడ్‌లైన్స్ వచ్చేశాయి, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర హోంశాఖ

పోలీసులు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు. దాదాపు రెండు గంటల అనంతరం పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ పరిణామంపై మహారాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తుందని వలసకూలీలు భావించారనీ, ప్రధాని ప్రకటనతో వారంతా అసంతృప్తికి గురయ్యారని అన్నారు. వలసకూలీలను స్వస్థలాలకు పంపబోమని, రాష్ట్రాల సరిహద్దులు మూసివేసి ఉంటాయని అనిల్‌ స్పష్టంచేశారు. వారి బాగోగులను ప్రభుత్వం చూసుకుంటుందని, ఈ మేరకు హామీ ఇవ్వడంతో వారంతా శాంతించారని వెల్లడించారు.

రెండవ దశ దేశవ్యాప్త లాక్డౌన్‌కు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

ముంబైలో పరిణామాలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో ఫోన్‌లో మాట్లాడారు. లాక్‌డౌన్‌ అమల్లో ఉండగానే వందలాదిగా జనం గుమికూడటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వానికి అన్నివిధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు హోం శాఖ అధికారి ఒకరు తెలిపారు. బాంద్రాలో ఉద్రిక్త పరిస్థితులకు కేంద్రమే కారణమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే కేంద్రంపై మండిపడ్డారు.