Bank Unions Oppose RBI's Decision: రుణాలు ఎగవేసినవారితో రాజీ చేసుకోవాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచన, ఇదేమి నిర్ణయమంటూ దుమ్మెత్తిపోస్తున్న బ్యాంక్‌ యూనియన్లు

బ్యాంకు యూనియన్లు AIBOC, AIBEA రాజీ సెటిల్మెంట్ కింద ఉద్దేశపూర్వక ఎగవేతదారుల రుణాలను సెటిల్ చేయడానికి రుణదాతలు అనుమతించే రిజర్వ్ బ్యాంక్ యొక్క చర్యను వ్యతిరేకించాయి

RBI

Compromise Settlement for Wilful Defaulters: బ్యాంకు యూనియన్లు AIBOC, AIBEA రాజీ సెటిల్మెంట్ కింద ఉద్దేశపూర్వక ఎగవేతదారుల రుణాలను సెటిల్ చేయడానికి రుణదాతలు అనుమతించే రిజర్వ్ బ్యాంక్ యొక్క చర్యను వ్యతిరేకించాయి .RBI యొక్క ఇటీవలి 'రాజీ పరిష్కారాలు, సాంకేతిక రైట్-ఆఫ్‌ల ఫ్రేమ్‌వర్క్' అనేది బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క సమగ్రతను రాజీ చేసే హానికరమైన చర్య, ఉద్దేశపూర్వక ఎగవేతదారులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రయత్నాలను బలహీనపరుస్తుందని యూనియన్లు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.

కాగా రుణాల్ని ఉద్దేశపూర్వకంగా ఎగవేసినవారితో రాజీ పరిష్కారం చేసుకోవాలని బ్యాంక్‌లకు రిజర్వ్‌బ్యాంక్‌ తాజాగా సూచించిన సంగతి విదితమే. దీనిపై బ్యాంక్ యూనియన్లు స్పందిస్తూ.. ఇది బ్యాంకింగ్‌ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీస్తుందని, ఎగవేతదార్లను సమర్థవంతంగా దారికి తీసుకొచ్చే చర్యలకు అవరోధంగా మారుతుందని ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ ఫెడరేషన్‌, ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌లు దుమ్మెత్తిపోశాయి.

1000 కంపెనీలకు వెళ్లినా నో ఆఫర్, లేఆఫ్స్‌ ఉద్యోగులకు జాబ్ ఇచ్చేది లేదంటున్న టెక్ కంపెనీలు, చేదు అనుభవాన్ని పంచుకున్న మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి

బ్యాంకింగ్‌ పరిశ్రమలో కీలకమైన భాగస్వాములుగా ఉద్దేశపూర్వక ఎగవేతదారుల సమస్య పరిష్కారానికి కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఎల్లప్పుడూ మేము కోరుతున్నాం. మోసపు, ఉద్దేశపూర్వక ఎగవేతగా వర్గీకరించిన ఖాతాలకు రాజీ పరిష్కారాన్ని అనుమతించడం న్యాయ సూత్రాల్ని ధిక్కరించడమేనంటూ యూనియన్లు తీవ్రంగా విమర్శించాయి. ఇది మోసపు రుణగ్రస్తుల్ని ప్రోత్సహించడమే కాకుండా, నిజాయితీపరులకు తప్పుడు సంకేతాలిచ్చినట్టవుతుందన్నాయి.

RBI తన 'ప్రూడెన్షియల్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ రిజల్యూషన్ ఆఫ్ స్ట్రెస్డ్ అసెట్స్' (జూన్ 7, 2019)లో, మోసాలు/దుష్ప్రవర్తన/ఉద్దేశపూర్వక డిఫాల్ట్‌కు పాల్పడిన రుణగ్రహీతలు పునర్నిర్మాణానికి అనర్హులుగా ఉంటారని స్పష్టం చేసింది. ఇప్పుడు ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు రాజీ సెటిల్మెంట్లను మంజూరు చేయడానికి RBI ఫ్రేమ్‌వర్క్‌లో చేసిన ఈ ఆకస్మిక మార్పు షాక్‌కు గురిచేసింది. ఇది బ్యాంకింగ్ రంగంపై ప్రజల విశ్వాసాన్ని కోల్పోవడమే కాకుండా డిపాజిటర్ల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని యూనియన్స్ హెచ్చరించాయి.

ఆధార్ వివరాలు ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు ఇవాళే చివరి తేదీ! ఎవరెవరు ఉచితంగా మార్చుకోవచ్చు, ఎలా అప్‌ డేట్ చేసుకోవాలంటే?

వ్యక్తులైనా, సంస్థలైనా ఇక మీదట రుణాల ఎగవేతనే ఎంచుకుంటాయని, బ్యాంకుల్ని, వాటి ఉద్యోగుల్ని నష్టాల్లో ముంచేస్తారన్నాయి. నిజాయితీ రుణగ్రస్తులు, డిపాజిటర్ల ప్రయోజనాల సంరక్షణకు ఈ రాజీ నిర్ణయాన్ని రిజర్వ్‌బ్యాంక్‌ ఉపసంహరించుకోవాలని యూనియన్లు డిమాండ్‌ చేశాయి.