Lockdown 4: వలస కూలీలను మింగేస్తున్న రోడ్డు ప్రమాదాలు, తాజాగా బీహార్ రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి, ఇప్పటివరకు జరిగిన ప్రమాదాల్లో మృతుల సంఖ్య వందకు పైగానే..

లాక్‌డౌన్‌తో ఉపాధి లేక తమ స్వస్థలాకు బయలుదేరిన పలువురు వలస కూలీలు (Labourers) రోడ్డు ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా బిహార్‌లోని బగల్‌పూర్‌లో నౌగచియాలో (Bhagalpur Accident) మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో 9మంది వలస కూలీలు మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి.

Visuals from accident site in Bihar's Bhagalpur (Photo Credits: ANI)

Patna, May 19: దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్‌ (Lockdown 4) వలస కూలీల పాలిట శాపంగా మారింది. లాక్‌డౌన్‌తో ఉపాధి లేక తమ స్వస్థలాకు బయలుదేరిన పలువురు వలస కూలీలు (Labourers) రోడ్డు ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా బిహార్‌లోని బగల్‌పూర్‌లో నౌగచియాలో (Bhagalpur Accident) మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలను వెంటాడిన మృత్యువు, ప్రకాశం జిల్లాలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్, 9 మంది అక్కడికక్కడే దుర్మరణం

బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో 9మంది వలస కూలీలు మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. వలకార్మికులతో వెళుతున్న లోడు లారీ, బస్సును ఢీకొట్టి అదుపుతప్పి రోడ్డుపక్కనపడిపోయింది. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  వలస కూలీల ఘోషలో ఓ పేజీ, 9 నెలల గర్బిణీ 70 కిలోమీటర్లు నడిచింది, మార్గం మధ్యలో ప్రసవం, మళ్లీ బిడ్డను ఎత్తుకుని 160 కిలోమీటర్లు నడిచింది

లాక్‌డౌన్‌తో (Lockdown) ఉపాధి లేక తమ స్వస్థలాకు బయలుదేరిన పలువురు వలస కూలీలు (Migrant Workers) రోడ్డు ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా జరిగిన పలు రోడ్డు ప్రమాదాల్లో వందల సంఖ్యల్లో వలస కూలీలు మృతిచెందారు. ప్రతి రోజు దేశంలోని ఏదో ఒక చోట ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం, వలస కూలీల పైనుంచి దూసుకెళ్లిన గూడ్స్ రైలు, 16 మంది మృతి, పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించిన ప్రధాని నరేంద్ర మోదీ

మహారాష్ట్ర యవత్మాల్‌లో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వలసకూలీలు మృతిచెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వలస కూలీలు ప్రయాణిస్తున్న బస్సు, ట్రక్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ బస్సులోని వలసకూలీలు షోలాపూర్‌ నుంచి జార్ఖండ్‌కు వెళ్తున్నారు.  వలస కార్మికులను వెంటాడిన రోడ్డు ప్రమాదాలు, మధ్య ప్రదేశ్‌‌లో 8 మంది మృతి, ఉత్తరప్రదేశ్‌‌లో 6 మంది దుర్మరణం, ఎంపీ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన యూపీ సీఎం

మరోవైపు సోమవారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లో ఝాన్సీ-మీర్జాపూర్‌ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వలస కూలీలు మృతిచెందగా, 12 మంది గాయపడ్డారు. 17 మంది వలసకూలీలతో వెళ్తున్న డీసీఎం వాహనం బోల్తాపడటంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టుగా అధికారులు తెలిపారు.