Coronavirus in BSF: 67 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా, ఢిల్లీలోని బీఎస్‌ఎఫ్‌ కార్యాలయం మూసివేత, క్వారంటైన్‌లోకి 50 మంది భద్రతా సిబ్బంది

మే 4 వ‌ర‌కు ఈ కేసులు న‌మోదు కాగా..ఈ కేసుల్లో త్రిపుర లో 13 మంది ఉన్నారు. వీరిలో 10 మంది సరిహద్దు భద్రతా దళాల జ‌వాన్లు కాగా వారిలో ఒక జ‌వాను భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లున్నారు. ఢిల్లీలో (Delhi) అత్య‌ధికంగా 41 మంది జ‌వాన్ల‌కు (BSF jawans) క‌రోనా వ‌చ్చిన‌ట్లు తేల‌గా..కోల్ క‌తా నుంచి మ‌రో జ‌వాను ఉన్నారు. సెల‌వులో ఉన్న మ‌రో జ‌వానుకు కూడా క‌రోనా పాజిటివ్ గా వ‌చ్చిన‌ట్లు బీఎస్ ఎఫ్ ప్ర‌తినిధి పేర్కొన్నారు.

Border Security Force | representational Image | (Photo Credits: PTI)

New Delhi, May 4: ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 67 మంది బీఎస్ఎఫ్ ( BSF) జ‌వాన్లకు క‌రోనా పాజిటివ్ గా (Coronavirus in BSF) నిర్దార‌ణ అయింద‌ని బీఎస్ఎఫ్ ప్ర‌తినిధి ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. మే 4 వ‌ర‌కు ఈ కేసులు న‌మోదు కాగా..ఈ కేసుల్లో త్రిపుర లో 13 మంది ఉన్నారు. వీరిలో 10 మంది సరిహద్దు భద్రతా దళాల జ‌వాన్లు కాగా వారిలో ఒక జ‌వాను భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లున్నారు. ఢిల్లీలో (Delhi) అత్య‌ధికంగా 41 మంది జ‌వాన్ల‌కు (BSF jawans) క‌రోనా వ‌చ్చిన‌ట్లు తేల‌గా..కోల్ క‌తా నుంచి మ‌రో జ‌వాను ఉన్నారు. సెల‌వులో ఉన్న మ‌రో జ‌వానుకు కూడా క‌రోనా పాజిటివ్ గా వ‌చ్చిన‌ట్లు బీఎస్ ఎఫ్ ప్ర‌తినిధి పేర్కొన్నారు. 24 గంటల్లో 195 మంది మృతి, దేశంలో 46 వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య, దడపుట్టిస్తున్న మహారాష్ట్ర, ముంబైలో మే 17 వరకు 144 సెక్షన్

త్రిపురలో సోమవారం 10 మంది జవాన్లు కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన తరువాత మొత్తం 67 బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్) సిబ్బందికి COVID-19 పాజిటివ్ అని తేలింది. త్రిపురలోని ఈ దళాలు 138 వ బెటాలియన్‌కు చెందినవి. మొత్తం 41 మంది బీఎస్‌ఎఫ్ సైనికులు ఢిల్లీలో కరోనావైరస్ బారిన పడ్డారు. ఒకరు కోల్‌కతాకు చెందినవారు. సెలవులో ఉన్న ఒక బిఎస్ఎఫ్ జవాన్ కు కూడా COVID-19 పాజిటివ్ గా నిర్థారణ అయింది. పశ్చిమ బెంగాల్ లో పర్యటిస్తున్న కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖ బృందంలోని కానిస్టేబుల్ కి కరోనా సోకడంతో అతనితో సన్నిహితంగా ఉన్న 50 మంది భద్రతా సిబ్బందిని క్వారంటైన్ కు తరలించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏపీ రాష్ట్రంలో 1650కి చేరిన కరోనావైరస్ కేసులు, 524 మంది కోలుకుని డిశ్చార్జ్, 33 మంది మృతి, తాజాగా 67 కేసులు నమోదు

కరోనా నియంత్రణకు రాష్ట్రాలు చేపడుతున్న చర్యలను పర్యవేక్షించేందుకు ఐఎంసీటీ బృందాలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా సోకిన కానిస్టేబుల్ ఐఎంసీటీ బృందంలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతనికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే అతన్ని ఐసోలేషన్ కు అలాగే మిగతావారిని క్వారంటైన్ కి తరలించారు. తమిళనాడులో కరోనా కల్లోలం, ఒక్కరోజే 527 కేసులు నమోదు, గ్రీన్ జోన్లలో కేసులు పెరిగితే మరోసారి లాక్‌డౌన్‌ తప్పదని స్పష్టం చేసిన లవ్‌ అగర్వాల్‌

ఇక ఢిల్లీలో కేసులు పెరుగుతుండడంతో బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్‌) ప్రధాన కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ఉన్న ప్రధాన కార్యాలయంలోని రెండు అంతస్తులకు బీఎస్‌ఎఫ్‌ అధికారులు సోమవారం సీల్ వేశారు. ఇటీవల కొంతమంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో బీఎస్‌ఎఫ్‌ ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు .



సంబంధిత వార్తలు