Coronavirus in Dharavi: గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ముంబై మురికివాడ ధారావి, మరో రెండు కొత్త కేసులు నమోదు, మొత్తం 5కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికివాడగా గుర్తింపు పొందిన ముంబైలోని ధారావిలో కొత్తగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు (Coronavirus in Dharavi) నమోదయ్యాయి. దీంతో ధారావిలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5కి చేరింది. పది లక్షల మంది నివాసం ఉంటే ధారావిలో కరోనా కేసుల (Coronavirus Cases in Dharavi) పెరుగుదల ఇప్పుడు ఆందోళనకరంగా మారింది.

Dharavi (Photo Credits: Wikimedia Commons)

Mumbai, April 05: ముంబై లోని మురికి వాడ ధారావి (Dharavi) ఇప్పుడు ముంబై వాసుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికివాడగా గుర్తింపు పొందిన ముంబైలోని ధారావిలో కొత్తగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు (Coronavirus in Dharavi) నమోదయ్యాయి. దీంతో ధారావిలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5కి చేరింది. పది లక్షల మంది నివాసం ఉంటే ధారావిలో కరోనా కేసుల (Coronavirus Cases in Dharavi) పెరుగుదల ఇప్పుడు ఆందోళనకరంగా మారింది.

ప్రధాని మోదీ 9 నిమిషాల మెసేజ్ రహస్యం

ఇప్పుడు ఈ మురికివాడలో నివసించే లక్షల మంది ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఇదిలా ఉంటే ధారావిలో కరోనా సోకి (COVID-19) ఇటీవల ఓ వ్యక్తి ఇటీవల చనిపోయిన విషయం తెలిసిందే. ఢిల్లీలో నిజాముద్దీన్ మసీదు కార్యక్రమానికి హాజరైన తబ్లిఘి జమాత్ సభ్యులకు 56 ఏళ్ల వ్యక్తి ఆతిథ్యం ఇచ్చారు. ధారావి నుండి నివేదించిన మొదటి నవల కరోనావైరస్ పాజిటివ్ కేసు ఇది. తరువాత, అతను కోవిడ్ -19 చికిత్స పొందుతూ మరణించాడు.

3 రోజుల పసిపాపకు సోకిన కరోనావైరస్

ఇదిలా ఉంటే ముంబై నగరంలో ఇంటి అద్దెలు ఆకాశాన్ని అంటుతుండటంతో పేదవారే కాదు మధ్య తరగతికి చెందిన చాలా మంది ఇక్కడకు వలస వచ్చారు. ఇక్కడ ప్రజలు దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతానికి చేరుకుంటున్నా అక్కడ కనీస వసతుల గురించి ఎవరూ ఆలోచించలేదు. దీంతో ధారావి ప్రాంతం 1947 నాటికే దేశంలోనే అతి పెద్ద మురికివాడగా మారింది.

మహారాష్ట్రలో చేయి దాటుతున్న పరిస్థితి

అయితే జనాభా పెరిగినా అక్కడ సదుపాయాలు అంతంతమాత్రమే. సరైన వసతులు లేవు. ఇంకా చెప్పాలంటే ధారావిలోని మెజారిటీ ఇళ్లల్లో టాయిలెట్ సౌకర్యం అనేదే ఉండదు. పబ్లిక్ టాయిలెట్స్‌పై ఆధారపడటాన్ని జనం అలవాటు చేసుకున్నారు. దీంతో చాలాసార్లు అంటువ్యాధులు విజృంభించాయి.

ముంబై సహా రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో లాక్ డౌన్

చాలా మంది మృత్యవాత పడ్డారు. ఇప్పుడు అక్కడ కరోనా వైరస్‌ ప్రవేశించింది. ప్రజలను కంటికి కునుకు లేకుండా చేస్తోంది. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా లక్షల మంది ప్రమాదంలో చిక్కుకోవడం ఖాయం. ఈ మహమ్మారిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవడానికి యంత్రాంగం రెడీ అయింది.

ఈ వ్యాధి వ్యాప్తి చెందినప్పటి నుండి ఇప్పటివరకు మహారాష్ట్రలో 556 కేసులు నమోదయ్యాయి.  మరణించిన వారి సంఖ్య 24గా గా ఉండగా, మొత్తం 183 మంది రోగులు కోలుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా 3072 కేసులు నమోదయ్యాయి. 75 మంది మరణించారు.