COVID-19 Cases in India: ఇండియాలో 271కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు, నలుగురు మృతి, ప్రకటన విడుదల చేసిన ఐసీఎంఆర్‌, పాజిటివ్ కేసుల్లో 39 మంది విదేశీయులే

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య (Coronavirus Cases In India) 271కు చేరాయని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ICMR) ప్రకటన చేసింది. కరోనా కారణంగా ఇప్పటివరకు దేశంలో మొత్తం నలుగురు మృతి చెందారని ఈ రోజు ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.

Coronavirus in India | Representational Image (Photo Credits: PTI)

New Delhi, March 21: ఇండియాలో (India) కరోనావైరస్ రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య (Coronavirus Cases In India) 271కు చేరాయని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ICMR) ప్రకటన చేసింది. కరోనా కారణంగా ఇప్పటివరకు దేశంలో మొత్తం నలుగురు మృతి చెందారని ఈ రోజు ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.

ఇటలీలో పిట్టల్లా రాలిపోతున్న జనం, ఒక్కరోజే 627 మంది కరోనాకు బలి

మరోవైపు మహారాష్ట్రలో వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు 67 కేసులు నిర్థారణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి వెల్లడించారు.  గత 24 గంటల్లో మరో 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా వచ్చిన 11 కేసుల్లో 10 ముంబైలో, ఒకటి పూణేలో నమోదయ్యాయి. దుబాయ్ నుంచి మహారాష్ట్రకు వచ్చిన 63 ఏళ్ల వ్యక్తి ముంబైలోని కస్తూర్బా ఆసుపత్రిలో కన్నుమూసిని విషయం విదితమే. ఇది రాష్ట్రంలో మొదటి COVID-19 బాధితుడి మరణంగా ప్రభుత్వం పేర్కొంది.

ఈనెల 22న 'జనతా కర్ఫ్యూ' కు పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్‌, మహారాష్ట్రల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారని వివరించింది. కరోనా పాజిటివ్ అని తేలిన వారిలో 39 మంది విదేశీయులని తెలిపింది. కరోనా పాజిటివ్‌ అని తేలిన వారితో గతంలో కలిసున్నవారికి పరీక్షలు నిర్వహించాలని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) (Indian Council of Medical Research (ICMR) సూచించింది.

ఈ క్రమంలోనే వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. కాగా, కరోనా వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా రేపు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోదీ (PM Modi) సూచించిన విషయం తెలిసిందే.

Here's the tweet:

ఇదిలా ఉంటే ప్రముఖ కంపెనీ సిప్లా రాబోయే 6 నెలల్లో కరోనా వైరస్ నివారణకు ఔషధాన్ని రూపొందించనున్నట్లు తెలిపింది. ఇదేగానీ సాధ్యమైతే భారత్‌లో కరోనా నివారణకు తొలుత ఔషధాన్ని రూపొందించిన కంపెనీగా సిప్లా నిలవనుంది. ఇందుకోసం ప్రభుత్వ వైద్య పరిశోధనాలయాలతో సిప్లా భాగస్వామ్యం ఏర్పరుచుకోనుంది.

కనికా కపూర్‌కు కరోనా, కరోనా సెల్ఫ్‌ క్వారంటైన్‌ విధించుకున్న ఎంపీలు

ఈ సందర్భంగా సిప్లా ప్రమోటర్ యూసుఫ్ హమిద్ మాట్లాడుతూ దేశ ప్రయోజనాల కోసం పనిచేయడం మా కర్తవ్యంగా భావిస్తున్నాం. సిప్లా కంపెనీ ఇప్పటికే స్విట్జర్లాండ్‌కు చెందిన రోచేజ్‌ రూపొందించిన యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ యాక్టెమ్రాను భారత్‌లో పంపిణీ చేసింది, ఇది తీవ్రమైన ఊపితిత్తుల సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగపడుతుందని తెలిపారు.

దేశ వ్యాప్తంగా నిలిచిపోనున్న 3700 రైళ్లు

ఈ ఔషధం కరోనా విషయంలో సమర్థవంతంగా పనిచేస్తుందని నిరూపితమయ్యిందన్నారు. ప్రస్తుతానికి కోవిడ్ -19కు తగిన చికిత్స లేదు. దీనికి హెచ్‌ఐవి, యాంటీ వైరల్, యాంటీ మలేరియల్ ఔషధాలతో చికిత్స చేస్తున్నారని తెలిపారు.