Cyclone Yaas Update: యాస్ తుఫాన్ ముప్పు, భయం గుప్పిట్లో అయిదు రాష్ట్రాలు, ఈ నెల 24లోగా తుఫానుగా మారనున్న యాస్, 26న ఒడిశా-పశ్చిమ బెంగాల్‌ మధ్య తీరం దాటే అవ కాశం, హెచ్చరించిన భారత వాతావరణ శాఖ

అండమాన్‌ సమీపంలో సముద్రం లో ఏర్పడిన అల్పపీడనం బలపడి తుఫానుగా మారే అవకాశముందని, ఈ తుఫాను ఈ నెల 26న ఒడిశా-పశ్చిమ బెంగాల్‌ మధ్య తీరం దాటే అవ కాశముందని (Cyclonic Storm To Teach Odisha-West Bengal Coast) వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Cyclone | Representational Image | (Photo Credits: PTI)

Kolkata, May 22: బంగాళాఖాతంలో అల్పపీడనం ఈ నెల 24లోగా తుఫానుగా (Cyclone Yaas Update) మారనుంది. ఇది 26వ తేదీలోగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను తాకనుంది. భీకర గాలులతో పాటు భీకర వర్షం తోడుగా ఈ తుఫాన్ విరుచుకుపడనుంది. దీనికి యాప్ తుఫాన్ అని నామకరణం చేశారు. అండమాన్‌ సమీపంలో సముద్రం లో ఏర్పడిన అల్పపీడనం బలపడి తుఫానుగా మారే అవకాశముందని, ఈ తుఫాను ఈ నెల 26న ఒడిశా-పశ్చిమ బెంగాల్‌ మధ్య తీరం దాటే అవ కాశముందని (Cyclonic Storm To Teach Odisha-West Bengal Coast) వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ఈ తుఫాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముందనే కేంద్రప్రభుత్వం హెచ్చరికలతో కోస్ట్‌ గార్డ్‌ దళాలు (Coastal Districts on High Alert) అప్రమత్తమయ్యాయి. తుపాను కారణంగా సముద్రం అల్ల కల్లోలంగా ఉంటుందని, జాలర్లు చేపల వేటకు వెళ్లరాదంటూ కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది మత్స్యకార గ్రామాల్లో లౌడ్‌ స్పీకర్ల ద్వారా హెచ్చరించారు. అదే సమయంలో చేపల వేటకు వెళ్లిన వారి వివరాలు సేకరించి, సత్వరం తీరానికి చేరుకోవాలని వారికి సమాచారం పంపారు.

భారీ వర్షాలతో వణుకుతున్న తమిళనాడు

ఇదిలా ఉంటే తమిళ నాడు రాజధాని నగరం చెన్నై సహా పలు జిల్లాల్లో శుక్ర వారం భారీవర్షం కురిసింది. వర్షానికి తోడు ఈదురుగాలులకు పలు ప్రాం తాల్లో చెట్లు విరిగిపడ్డాయి. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.ఆవడి, తిరుముల్లైవాయల్‌, పోరూర్‌, వలసరవాక్కం, మధురవాయల్‌, అయపాక్కం, పూందమల్లి ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు విద్యుత్‌ నిలిపివేశారు. ఎగ్మూర్‌, అన్నాశాలై, పెరం బూర్‌, కోడంబాక్కం, టి.నగర్‌ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

భారీగా తగ్గుతున్న కేసులు, పెరుగుతున్న డిశ్చార్జ్ నంబర్లు, నిన్న ఒక్కరోజే 3,57,630 మంది కోలుకుని ఇంటికి, తాజాగా 2,57,299 మందికి కరోనా, జూన్ 7 వరకు లాక్‌డౌన్ పొడిగించిన కర్ణాటక

కాగా రానున్న 24 గంటల్లో 12 జిల్లాలో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం తెలియజేసింది.ఉపరితల ఆవర్తనం కారణంగా చెన్నై, తిరువళ్లూర్‌, కాంచీపురం, రాణిపేట, తిరుపత్తూర్‌, వేలూరు, కృష్ణగిరి, ఈరోడ్‌, సేలం, దిండుగల్‌, రామనాథపురం, తూత్తుకుడి తదితర జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం (India Meteorological Department (IMD) తెలియజేసింది.

తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు

రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి నుంచి గాలులు లోయర్ ట్రోపోస్పీయర్ వరకు బలంగా వ్యాపించి, చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని పేర్కొంది. అండమాన్‌ దీవుల్లోకి శుక్రవారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. తూర్పు మధ్య బంగాళాఖాతం, దాన్ని అనుకొని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

ఇది మరింత బలపడి 24వ తేదీ వరకు తుఫానుగా మారే అవకాశం ఉంది. వాయువత్య దిశగా ప్రయాణించి 26న ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరాన్ని చేరుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా కింది స్థాయి గాలులు రాష్ట్రంలో పశ్చిమ దిశ నుంచి వీస్తున్నాయి. వీటి ప్రభావంతో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది.

ఒడిశా రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంత జిల్లాల్లో హైఅలర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్ నేపథ్యంలో ఒడిశా రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంత జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. తుపాన్ దృష్ట్యా ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహాపాత్ర ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్ గార్డ్స్, ఐఎన్ఎస్ చిలికా, డీజీపీ, అగ్నిమాపక శాఖ డీజీలలో అత్యవసర సమావేశం నిర్వహించి సముద్ర తీర ప్రాంత జిల్లాలను అప్రమత్తం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో విద్యుత్ సరఫరా, గ్రామీణ, పట్టణ మంచినీటి సరఫరా, ఆరోగ్య, ఒడిశా విపత్తు ప్రతిస్పందన దళాలను సంసిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు ప్రధాన కార్యదర్శి మహాపాత్ర చెప్పారు.

కుప్పకూలిన ప్రపంచ పర్యాటక ప్రదేశం, రెండు స్తంభాలుగా మారి బోసిపోయి కనిపిస్తున్న డార్విన్‌ ఆర్చ్‌, సముద్రపు నీటి మధ్యలో ఉన్న రాతి కట్టడం కూలిపోయిందని తెలిపిన ఈక్వెడార్‌ పర్యావరణ మంత్రిత్వ శాఖ

లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఆశ్రయం కల్పించేందుకు తుపాన్ షెల్టర్లను సమాయత్తం చేశారు. రాబోయే తుపాన్ ను ఎదుర్కోవడానికి పరిపాలనా యంత్రాంగం సిద్ధంగా ఉందని చీఫ్ సెక్రటరీ మహాపాత్ర చెప్పారు. తుపాన్ విపత్తు దృష్ట్యా సముద్రంలో చేపలవేటకు వెళ్లిన మత్స్యకారులను హెచ్చరికలు జారీ చేసి తిరిగి ఒడ్డుకు రావాలని కోరారు. తుపాన్ నేపథ్యంలో ఇండియన్ కోస్ట్ గార్డ్స్, రెండు విమానాలు, ఓడలు పెట్రోలింగ్ చేస్తున్నాయని ఒడిశా ప్రత్యేక సహాయ కమిషనర్ ప్రదీప్ జెనా చెప్పారు.

యాస్‌ తుపాను కారణంగా పలు రైళ్లు రద్దు

యాస్‌ తుపాను కారణంగా ముందస్తు చర్యల్లో భాగంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వాల్తేర్‌ డివిజన్, సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఏ.కే.త్రిపాఠీ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24, 25 తేదీల్లో ముంబయి–భువనేశ్వర్‌(01019)కోణా ర్క్‌ స్పెషల్, 25,26 తేదీల్లో భువనేశ్వర్‌–ముంబై(01020) కోణార్క్, 24, 25 తేదీల్లో యశ్వంత్‌పూర్‌–హౌరా (02246) స్పెషల్, 25, 26 తేదీల్లో హౌరా–యశ్వంత్‌పూర్‌(02245) స్పెషల్,

24, 25 తేదీల్లో గౌహతి–బెంగళూరు (02510) స్పెషల్, 23న నాగర్‌కోయల్‌–షాలిమార్‌ (02659), 26న షాలిమార్‌–నాగర్‌కోయల్‌ (02660) స్పెషల్, 24న హౌరా–కన్యాకుమారి (02665), 25, 26, 27న హౌరా–సికింద్రాబాద్‌ (02703)స్పెషల్, 24, 25, 26న సికింద్రాబాద్‌–హౌరా (02704), 24, 25, 26న హౌరా–చెన్నై సెంట్రల్‌ (02821) స్పెషల్, 24, 25, 26న చెన్నై సెంట్రల్‌–హౌరా (02822) స్పెషల్, 23, 24న అహ్మదాబాద్‌–పూరి (02844), 25, 27న పూరి – అహ్మదాబాద్‌ (028 43) స్పెషల్, 24, 25, 26న హౌరా – యశ్వంత్‌పూర్‌(02873), 24, 25, 26న యశ్వంత్‌పూర్‌–హౌరా (02874) స్పెషల్,

24న ముజఫర్‌పూర్‌–యశ్వంత్‌పూర్‌ (05228) స్పెషల్, 24, 25, 26న సికింద్రాబాద్‌–çభువనేశ్వర్‌ (07016) స్పెషల్, 26, 27, 28న భువనేశ్వర్‌–సికింద్రాబా ద్‌ (070 15) స్పెషల్, 24, 25, 26న తిరుపతి–పూరి (07479)స్పెషల్, 26, 27, 28న పూరి–తిరుపతి (07480) స్పెషల్, 25, 26 తేదీల్లో బెంగళూరు–భువనేశ్వర్‌ (08464)స్పెషల్, 26, 27 తేదీల్లో భువనేశ్వర్‌–బెంగళూరు (08463) స్పెష ల్, 25న బెంగళూరు–న్యూటిన్‌సుకియా (022 49) స్పెషల్, 25న షాలిమార్‌–త్రివేండ్రం (026 42) స్పెషల్,

తీరం దాటిన తౌక్టే తుఫాను, అయినా పెను ముప్పే, మళ్లీ 23న అండమాన్‌లో అల్పపీడనం, భారీ వర్షాలతో వణుకుతున్న మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాలు

24, 25 తేదీల్లో ఎర్నాకుళం–పాట్నా (02643) స్పెషల్, 25న తిరుచ్చిరాపల్లి–హౌరా (02664) స్పెషల్, 25న సికింద్రాబాద్‌–షాలిమా ర్‌(02774) స్పెషల్, 26న షాలిమార్‌–సికింద్రాబాద్‌ (02773) స్పెషల్, 25న సంత్రాగచ్చి–చెన్నై (02807) స్పెషల్, 24న న్యూటిన్‌సుకియా – తాంబరం (05930) స్పెషల్, 26న భాగల్‌పూర్‌–యశ్వంత్‌పూర్‌ (02254) స్పెషల్, 26న జసిద్ది – తాంబరం (02376), 25న త్రివేండ్రం–సిల్చార్‌(02507), 26న కామాఖ్య–యశ్వంత్‌పూర్‌ (02 552) స్పెషల్, చెన్నై సెంట్రల్‌–న్యూజల్పయ్‌గురి, 27న భువనేశ్వర్‌–చెన్నై (02839) స్పెషల్, 26న యశ్వంత్‌పూర్‌–హౌరా (02864) స్పెషల్, పుదుచ్చేరి–హౌరా (02868) రైళ్లను రద్దు చేశారు.

ముంబై తీరంపై విరుచుకుపడిన తౌక్డే తుఫాను

మే 17న ముంబై తీరంపై తౌక్డే తుఫాను విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. అరేబియా సముద్రంలో ఈ తుఫాన్ ధాటికి మునిగిపోయిన బార్జ్ పి 305 యాంకర్ పడవ నుండి ఇద్దరు సహా 188 మందిని భారత కోస్ట్ గార్డ్ రక్షించింది. బార్జ్ నౌక నుంచి 60 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన సిబ్బంది కోసం అన్వేషణ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రత్యేక బృందాలు మరియు సామగ్రిని ఉపయోగించి బార్జ్ పి 305 శిధిలాలను గుర్తించడానికి ఇండియన్ నేవీ సర్వే షిప్ ద్వారా నీటి అడుగున శోధన మొదలు పెట్టారు. ఐఎన్ఎస్ టెగ్ ఐఎన్ఎస్ బెట్వా ఐఎన్ఎస్ బియాస్ పి8ఐ విమానం మరియు సీకింగ్ హెలోస్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీంలుగా విడిపోయి ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.

తీర రాష్ట్రాలను వణికిస్తోన్న తౌక్టే తుఫాను, గుజరాత్‌ తీర ప్రాంతంలో ఆరెంజ్‌ అలర్ట్‌, తీరం దాటే సమయంలో గంటకు 145 నుంచి 175 కిమీల వేగంతో ఈదురుగాలులు

ఎస్ఎస్ -3లో 196 మంది సిబ్బంది సాగర్ భూషణ్ పై 101 మంది సిబ్బంది సురక్షితంగా ఈ విపత్తు నుంచి బయటపడ్డారు. ఆఫ్షోర్ సప్లై వెసెల్స్ను ఒఎన్జిసి- ఎస్సిఐ టోయింగ్ సంస్థలు అద్దెకు తీసుకొని తమ కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నారు. ఐఎన్ఎస్ తల్వార్ కూడా ఈ ప్రాంతంలో ఉంది ”అని రక్షణ శాఖ తెలిపింది. చమురు మరియు సహజ వాయువు కార్పొరేషన్ (ఒఎన్జిసి) ప్రధాన ఉత్పత్తి సంస్థ -డ్రిల్లింగ్ రిగ్లు తుఫాను తీవ్రతను చవిచూశాయి. కానీ వీటికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని రక్షణ శాఖ తెలిపింది. తౌక్తా తుఫాను ధాటికి ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలలో కుంభవృష్టి వర్షం కురిసింది.