Cyclone Tauktae Update: తీర రాష్ట్రాలను వణికిస్తోన్న తౌక్టే తుఫాను, గుజరాత్‌ తీర ప్రాంతంలో ఆరెంజ్‌ అలర్ట్‌, తీరం దాటే సమయంలో గంటకు 145 నుంచి 175 కిమీల వేగంతో ఈదురుగాలులు
Cyclone | Representational Image | (Photo Credits: PTI)

Mumbai, May 17: కరోనావైరస్ విజృంభనకు తోడయిన తుపాను ‘తౌక్టే’ (Cyclone Tauktae Update) తీర రాష్ట్రాలను వణికిస్తోంది. తౌక్టే అత్యంత తీవ్రమైన తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ ఆదివారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం తీరం దాటనున్న గుజరాత్‌ తీర ప్రాంతంలో ‘ఆరెంజ్‌ అలర్ట్‌’ను జారీ చేసింది. అరేబియా సముద్రంలో పుట్టిన అల్పపీడనం తీవ్రమై తుపానుగా మారి ఉత్తర– వాయవ్య దిశగా గుజరాత్‌ తీరం వైపు దూసుకు వస్తోందని, సోమవారం రాత్రి గుజరాత్‌ తీరానికి చేరువవుతుందని వెల్లడించింది. మంగళవారం తెల్లవారుజామున పోరుబందరు– మహువ మధ్య తీరం దాటే అవకాశముందని తెలిపింది.

తౌక్టే (Tauktae Cyclone Tropical) తీరం దాటే సమయంలో అత్యంత తీవ్రమైన వేగంతో.. గంటకు 145 నుంచి 175 కిమీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. దక్షిణ మహారాష్ట్ర, గోవా, సమీప కర్ణాటక తీర ప్రాంతాల్లోనూ ఈ గాలుల వేగం గంటకు 140– 150 కిమీల వరకు ఉంటుందని తెలిపింది. డయ్యూడామన్‌ తీర ప్రాంతానికి కూడా ఆరెంజ్‌ అలర్ట్‌ను జారీ చేసినట్లు తెలిపింది. ఉత్తర మహారాష్ట్ర తీరంలో సోమవారం నుంచే గంటకు 65 నుంచి 85 కిమీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ఈదురుగాలులకు తోడు ఈ అన్ని తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన ‘తౌక్టే’ తుపాను ప్రభావం కారణంగా తేని, నీలగిరి, కోయంబత్తూరు, కన్నియాకుమారి జిల్లాల్లో నాలుగురోజులపాటు భారీగా వర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం సంచాలకుడు ఎన్‌. పువియ రసన్‌ ప్రకటించారు.

ఆరు రాష్ట్రాలకు తౌక్టే తుఫాను ముప్పు, కర్ణాటకలో నలుగురు, కేరళలో ఇద్దరు మృతి, ఈ నెల 18న ఉద‌యం గుజ‌రాత్ తీరాన్ని తాక‌నున్న తౌక్టే తుఫాను, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ

కర్ణాటకలోని ఏడు జిల్లాల్లోని 70 గ్రామాలపై తౌక్టే ప్రభావం తీవ్రంగా ఉంది. దక్షిణ కన్నడ, ఉడుపి, ఉత్తర కన్నడ, శివమొగ్గ, కొడగు, చిక్కమంగళూరు, హసన్‌ జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. ఉడుపి జిల్లాలోని నాదాలో గరిష్ఠంగా 38.5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. కుంభవృష్టికి తోడు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీంతో తీర ప్రాంత గ్రామాల్లో భారీ నష్టం వాటిల్లింది. గోవాలోనూ ఆదివారం ఉదయం నుంచి భీకరమైన గాలులతో భారీ వర్షాలు కురిశాయి.చెట్లు కూలిపడటంతో చాలాచోట్ల 33 కేవీ ఫీడర్లు, మహారాష్ట్ర నుంచి గోవాకు విద్యుత్తు సరఫరా చేస్తున్న 220 కేవీ లైన్లు దెబ్బతిన్నాయి.

మరో 2 రోజులు..వణికిస్తున్న తౌక్టే తుఫాన్, మహారాష్ట్ర, కేరళలో భారీ వర్షాలు, తెలంగాణకు భారీ వర్ష సూచన, ఈ నెల 18న గుజరాత్ వద్ద తీరం దాటే అవకాశం

దక్షిణ గుజరాత్‌ తీరంలోని పోరుబందర్, జునాగఢ్, గిర్‌ సోమనాథ్, అమ్రేలీ జిల్లాల్లో, డయ్యూడామన్‌లో గాలుల వేగం మంగళవారం నాటికి తీవ్రమవుతుందని, గంటకు 150 నుంచి 175 కిమీల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. అలాగే ద్వారక, జామ్‌నగర్, భావ్‌నగర్‌ జిల్లాల్లో మే 18 ఉదయం నుంచి గంటకు 150 నుంచి 165 కిమీల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో జునాగఢ్‌లో అలలు 3 మీటర్ల ఎత్తు వరకు ఎగసే అవకాశముందని తెలిపింది. జునాగఢ్, భావ్‌నగర్‌ తీవ్రస్థాయిలో ఆస్తి నష్టం జరగవచ్చని పేర్కొంది.

ముంచుకొస్తున్న తౌక్టే తుఫాను ముప్పు, వాయుగుండంగా మారిన అల్ప పీడనం, ఈ నెల 8న తౌక్టే గుజరాత్ వద్ద తీరం దాటుతుందని అంచనా, తమిళనాడు, కర్ణాటక, కేరళ, గుజరాత్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసిన ఐఎండీ

తుపాను ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో సమాచార, విద్యుత్‌ వ్యవస్థలు నిలిచిపోవచ్చని, రైల్వే సేవలకు అంతరాయం కలగవచ్చని హెచ్చరించింది. గుజరాత్‌ తీరంలో లోతట్టు ప్రాంతాల నుంచి లక్షన్నర మందిని సహా య కేంద్రాలకు తరలించారు. రాష్ట్రానికి చెందిన ఇతర సహాయ బృందాలతో కలిసి ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందిన 54 బృం దాలు సహాయ చర్యల్లో పాలు పంచుకుంటు న్నా యి. మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లవ ద్దని కో రామని, ఇప్పటికే వేటకు వెళ్లిన 149 బోట్లలో 107 తిరిగివచ్చాయని సీఎం విజయ్‌ రూపానీ చెప్పారు.

మహారాష్ట్రలోని ఉత్తర కొంకణ్, ముంబై, థానె, పాల్ఘార్‌ల్లో సోమవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబైలో ఈదురుగాలులు, వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. గోవాలో ఆదివారం ఉదయం నుంచే ఈదురుగాలులు, వర్షా లు గోవాలోని పలు ప్రాంతాలను ముంచెత్తాయి. భారీ అలలు తీర ప్రాంతాల్లోకి చొచ్చుకువచ్చాయి. ఇళ్లు, రహదారులు ధ్వంసమయ్యాయి. తుపాను కారణంగా ఇద్దరు చనిపోయారు. చెట్టు కూలడంతో ఒక బాలిక, బైక్‌పై వెళ్తుండగా విద్యుత్‌ స్తంభం కూలిపడడంతో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఈదురుగాలుల ధాటికి పలు 33 కేవీ ఫీడర్లు, మహారాష్ట్ర నుంచి గోవాకు విద్యుత్‌ను సరఫరా చేసే పలు 220 కేవీ లైన్లు ధ్వంసమయ్యాయి.

కరోనాకు తోడవుతున్న తీవ్ర తుఫాన్, అరేబియా సముద్రంలో పుట్టిన తౌక్టే, పశ్చిమ తీరాన్ని వణికించేందుకు రెడీ, ఈ నెల 16 నాటికి తుపాను తీవ్ర రూపం దాల్చుతుందని తెలిపిన ఐఎండీ

కేరళలోని తీర ప్రాంతంలోని పలు డ్యాముల్లో నీటిమట్టాలు ప్రమాదకర స్థాయికి పెరిగాయి. ఎర్నాకులం, ఇదుక్కి, మలప్పురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తీర ప్రాంతాల్లోని ప్రజలను సహాయ కేంద్రాలకు తరలించారు. ఎర్నాకులం జిల్లాలోని చెల్లానం తీర గ్రామంపై పెద్ద ఎత్తున అలలు విరుచుకుపడటంతో నౌకాదళం ఆ గ్రామస్తులను కాపాడి, సహాయ కేంద్రాలకు తరలించింది.