China Antibody Test Kits: చైనా నాసిరకం కిట్లకు డబ్బులు చెల్లించలేదు, ఆ కిట్లను వెనక్కి పంపిస్తాం, ఇండియాలో కరోనా వ్యాప్తి చాలా తక్కువ, మీడియాతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్
దేశంలో కరోనావైరస్ (Coronavirus) మీద వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ (Union Health Minister Dr Harsh Vardhan) శుక్రవారం అన్ని రాష్ట్రాల వైద్యశాఖ మంత్రులతో కరోనా పై తీసుకుంటున్న చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చైనా కిట్లు నాసిరకంగా (Faulty Antibody Test Kits) వున్నందున వాటికి డబ్బులు చెల్లించే ప్రసక్తే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు.
New Delhi, April 24: దేశంలో కరోనావైరస్ (Coronavirus) మీద వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ (Union Health Minister Dr Harsh Vardhan) శుక్రవారం అన్ని రాష్ట్రాల వైద్యశాఖ మంత్రులతో కరోనా పై తీసుకుంటున్న చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చైనా కిట్లు నాసిరకంగా (Faulty Antibody Test Kits) వున్నందున వాటికి డబ్బులు చెల్లించే ప్రసక్తే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. కరోనా నియంత్రణపై గుడ్ న్యూస్, సానుకూల ఫలితాలను ఇస్తోన్న ప్లాస్మా చికిత్స, మీడియాకు వెల్లడించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
హర్షవర్దన్ మాట్లాడుతూ.. నాసిరకం కరోనా టెస్ట్ కిట్లను చైనాకు వెనక్కి తిప్పి పంపిస్తామన్నారు. చైనా కంపెనీలకు టెస్ట్ కిట్ల డబ్బులు చెల్లించలేదన్నారు. ఇకపై చెల్లించేది లేదని ఆయనన్నారు. కేంద్ర బృందాలు రాష్ట్రాలకు సహకరించడం కోసమే కానీ.. రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించేందుకు కాదని ఆయన క్లారిటీ ఇచ్చారు.
Take a Look at the Tweets:
లాక్‌డౌన్ చాలా రాష్ట్రాల్లో సరిగా అమలు చేయడం లేదని, యూపీ సీఎం లాక్‌డౌన్ విషయంలో కఠినంగా ఉన్నారని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. లాక్ డౌన్‌ని మరింత కట్టుదిట్టంగా అమలు చేయడమే దేశ ప్రజలందరి బాధ్యత అని ఆయన సూచించారు. రాష్ట్రాలు లాక్ డౌన్ అమలులో మరింత కఠినంగా వుండాలని హర్షవర్థన్ తెలిపారు. కేరళలొ నెలల పసిపాపను చంపేసిన కరోనా, ఇండియాలో 23 వేలు దాటిన కోవిడ్-19 కేసులు, 718కి చేరిన మృతుల సంఖ్య
ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో కరోనా వ్యాప్తి చాలా తక్కువగా ఉందన్నారు. కరోనా బారినపడ్డ వారిలో మిగతా దేశాలతో పోలిస్తే రికవరీ రేటు మన దేశంలో బాగుందని హర్ష వర్దన్ వెల్లడించారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 23వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 718కి చేరింది. కాగా మృతుల సంఖ్య ఒకింత ఆందోళన కలిగిస్తున్నా ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న కరోనా మృతులతో పోల్చుకుంటే మాత్రం భారత్‌లో మరణాలు తక్కువగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కొత్తగా 62 కేసులు, ఏపీలో 955కు చేరిన కోవిడ్ 19 బాధితుల సంఖ్య, కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కరోనా కలవరం
కేంద్ర ప్రభుత్వ తాజా వివరాల ప్రకారం, కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పటికీ 17,600 వరకూ ఉంది. 4,700 మంది వ్యక్తులు కోలుకున్నారు. మృతుల సంఖ్య 718కి చేరింది. ఆ ప్రకారం మృతుల రేటు 3.1గా ఉంది.కోలుకున్న వారు, మృతులతో సహా ఎక్కువ కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఇక్కడ 6,400 మందికి పైగా కేసులు నమోదు కాగా, 283 మంది మృతి చెందారు. 1,500కు పైగా కేసులు నమోదైన రాష్ట్రాల్లో గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. పులులు, సింహాలకు కరోనావైరస్, జూ టైగర్ మౌంటైన్‌లో 3 పులులకు, మూడు ఆఫ్రికన్ సింహాలకు కోవిడ్-19 పాజిటివ్
కరోనా మృతుల సంఖ్యలో రెండో స్థానంలో గుజరాత్ ఉంది. ఇక్కడ 2,600 కేసులు నమోదు కాగా, 123 మంది మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్ ఉంది. ఆ రాష్ట్రంలో 83 మంది మృతి చెందగా, ఢిల్లీలో మృతుల సంఖ్య 50 వరకూ ఉంది. అరుణాచల్ ప్రదేశ్, మిజోరంలో ఒక్కో కేసు నమోదు కాగా, అరుణాచల్ ప్రదేశ్‌లో పేషెంట్ కోలుకున్నాడు. సిక్కింలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దాద్రా అండ్ నగర్ హవేలి, డామన్ అండ్ డయ్యూ, లక్షద్వీప్‌లలోఇంతవరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)