Coronavirus in India (Photo Credits: PTI)

Amaravati, April 24: ఏపీలో కొత్తగా మరో 62 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో (Deadly COVID-19 in AP) ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 955కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. ఏపీలో ఇప్పటివరకు కరోనా (Coronavirus) నుంచి కోలుకున్న 145 మంది డిశ్చార్జ్‌ కాగా, 29 మరణించినట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనాతో 781 మంది చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. దడపుట్టిస్తున్న కర్నూలు, గుంటూరు, రెండు జిల్లాల్లోనే 48.7 శాతం కేసులు

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో జరిపిన పరీక్షల్లో అనంపురం జిల్లాలో 4, తూర్పు గోదావరి జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 11, కృష్ణా జిల్లాలో 14, కర్నూలు జిల్లాలో 27, నెల్లూరు జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 3 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా, ఏపీలో (Andhra Pradesh) నమోదైన కేసులో ఎక్కువ భాగం మూడు జిల్లాలోనే ఉన్నాయి. కర్నూలు జిల్లాలో 261, గుంటూరు జిల్లాలో 206, కృష్ణా జిల్లాలో 102 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. అమల్లోకి వైఎస్ఆర్‌ సున్నా వడ్డీ పథకం, ఏపీ సీఎం వైయస్ జగన్ మరో సంచలన నిర్ణయం, ఆయా సంఘాల ఖాతాల్లో రూ.1,400 కోట్లు ఒకే విడత జమ

Here's AP Corona Update

అందరి సహకారంతోనే కరోనా వైరస్‌(కోవిడ్‌–19) నివారణ సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 48,034 మందికి శాంపిల్స్‌ సేకరించి పరీక్ష కోసం పంపించగా 47,139 నెగిటివ్, 896 మందికి పాజిటివ్‌ నివేదికలు వచ్చాయన్నారు. వైద్యం అందించిన 141 మందికి రెండుసార్లు పరీక్షల్లో నెగిటివ్‌ నివేదిక వచ్చాక డిశ్చార్జ్‌ చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 3,534 శాంపిల్స్‌ పరీక్షకు పంపిస్తే 3,299 నెగిటివ్‌గా, 234 పాజిటివ్‌గా వచ్చాయన్నారు.