Amaravati, April 24: డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ (YS Jagan Govt) తీపి కబురు అందించింది. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ( AP CM YS Jagan Mohan Reddy) అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని (YSR Zero Interest loan scheme) సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. పోలీస్ శాఖ సాంకేతిక బృందానికి డీజీపీ అభినందనలు, నిఘా కోసం అత్యంత అధునాతన టెక్నాలజీ వాడుతున్నామన్న దామోదర్ గౌతం సవాంగ్
క్యాంపు కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో పొదుపు సంఘాల అక్క చెల్లమ్మల ఖాతాలకు సున్నా వడ్డీ డబ్బులను జమ చేసే బటన్‌ను నొక్కుతారు. ఈ బటన్ నొక్కగానే సెర్ప్, మెప్మాల పరిధిలోని గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉండే 8,78,874 పొదుపు సంఘాల ఖాతాల్లో సీఎఫ్‌ఎంఎస్ ద్వారా ఒకే విడతన డబ్బులు జమ అవుతాయని సెర్ప్ సీఈవో రాజాబాబు తెలిపారు.
90,37,254 మహిళలు సభ్యులుగా ఉండే ఆయా సంఘాల ఖాతాల్లో రూ.1,400 కోట్లు ఒకే విడత జమ అవుతుంది. కాగా, ఇప్పటికే మీ రుణాలపై వడ్డీ భారం ప్రభుత్వానిదేనని పొదుపు సంఘాలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పేదలను ఆదుకోవడానికి ఉచిత బియ్యం, కందిపప్పు పంపిణీతో పాటు పేద కుటుంబాలకు 1000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. దడపుట్టిస్తున్న కర్నూలు, గుంటూరు, రెండు జిల్లాల్లోనే 48.7 శాతం కేసులు, తాజాగా 80 కొత్త కేసులు నమోదు, ఏపీలొ 893కి చేరిన మొత్తం కేసుల సంఖ్య
డ్వాక్రా మహిళలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై జీరో వడ్డీ పథకం ఉంది. కొన్నేళ్లగా ఈ పథకం అమలు ఆగిపోయింది. మళ్లీ ఇప్పుడు ఈ పథకాన్ని జగన్ సర్కార్ తిరిగి ప్రారంభించనుంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 6.95 లక్షల సంఘాలకు సున్నా వడ్డీ కింద రూ.975 కోట్లు.. పట్టణ ప్రాంతాల్లోని 1.83 లక్షల సంఘాలకు రూ.425 కోట్ల చొప్పున జీరో వడ్డీ సాయం అందనుంది. ఆయా సంఘాల్లో సభ్యులుగా ఉండే మొత్తం 90 లక్షల మందికిపైగా ఈ పథకం ద్వారా లబ్ది చేకూరనుంది. ఇప్పటికే ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో రిజర్వేషన్లు 50 శాతం మించరాదు, తెలుగు రాష్ట్రాలను హెచ్చరించిన సుప్రీంకోర్టు, అప్పటి నియామకాల్లో జోక్యం చేసుకోబోమంటూ వెల్లడి
అలాగే రాష్ట్రవ్యాప్తంగా 11.50 లక్షల మంది పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని చెల్లించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే సోమవారం ఈ నిధులను విడుదల చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దీంతో ఈ నెల 27న ఆ మేరకు నిధులను విడుదల చేయనున్నారు. ప్రతి మూడు నెలలకు మొత్తాన్ని తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. కేరళలొ నెలల పసిపాపను చంపేసిన కరోనా, ఇండియాలో 23 వేలు దాటిన కోవిడ్-19 కేసులు, 718కి చేరిన మృతుల సంఖ్య
డబ్బు జమ అయినట్లు రశీదు, ఏదైనా సమస్య వస్తే ఫిర్యాదు చేసేందుకు సెర్ప్, మెప్మా అధికారుల ఫోన్ నంబర్లు లేఖతో పాటే అందజేస్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పావలా వడ్డీ పథకం ప్రారంభమైంది. తర్వాత అది సున్నా వడ్డీ పథకంగా మారింది. అయితే 2016లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నిధులివ్వక పోవడంతో ఈ పథకం ఆగిపోయింది.
కాగా పొదుపు సంఘాలకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆరు జిల్లాల్లో 7 శాతం వడ్డీకి.. మిగిలిన ఏడు జిల్లాల్లో 11 నుంచి 13 శాతం వడ్డీకి బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఈ వడ్డీ భారం పేద అక్క చెల్లెమ్మల మీద పడకూడదన్న ఆరాటంతో.. ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఆ వడ్డీ భారం మన ప్రభుత్వమే భరిస్తుందని మాట ఇచ్చాను. అక్షరాలా దాదాపు రూ.1,400 కోట్ల వడ్డీ భారం పేదింటి అక్కచెల్లెమ్మల మీద పడకుండా, ఆ భారాన్ని చిరునవ్వుతో భరించేందుకు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ‘వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం’ పేరుతో అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు.
దీంతో పాటుగా 43 లక్షల మంది తల్లులకు అమ్మఒడి, అక్కచెల్లెమ్మల పేరుతో దాదాపు 27 లక్షల ఇళ్ల పట్టాలు, పెద్ద చదువులు చదువుతున్న దాదాపు 12 లక్షల మంది పిల్లల తల్లులకు వసతి దీవెన, నామినేషన్‌పై కాంట్రాక్టులు – నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం మహిళలకు కేటాయిస్తూ చట్టం, పేదింటి ఆడ పిల్లలకు అండగా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చే మన బడి నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, దిశ పోలీసు స్టేషన్లు, దిశ బిల్లు.. ఇలా అనేక చట్టాలు, కార్యక్రమాల ద్వారా మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారితలో మన ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా ఉందని సవినయంగా తెలియజేస్తున్నానని ఏపీ సీఎం వైయస్ జగన్ తెలిపారు.