Amaravati, April 23: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి (Covid-19 pandemic in AP) విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ( andhra pradesh) గత 24 గంటల్లో 80 కరోనా కేసులు నమోదవగా, ముగ్గురు మరణించారు. ఇవాళ ఒక్కరోజే కర్నూల్‌లో- 31, గుంటూరులో -18, చిత్తూరు-14 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య (AP COVID-19) 893కి చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో కర్నూలు, గుంటూరు జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా ఈ రెండు జిల్లాల్లో 48.7 శాతం కేసులు నమోదయ్యాయి. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో రిజర్వేషన్లు 50 శాతం మించరాదు, తెలుగు రాష్ట్రాలను హెచ్చరించిన సుప్రీంకోర్టు, అప్పటి నియామకాల్లో జోక్యం చేసుకోబోమంటూ వెల్లడి
ఇప్పటివరకు కర్నూలులో 234 మంది, గుంటూరులో 195 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. రాష్ట్రంలో ఈ ప్రాణాంతక వైరస్ వల్ల 27 మంది చనిపోగా, ఇందులో గుంటూరు జిల్లాకు చెందినవారు ఎనిమిది మంది ఉన్నారు. నిన్న 56 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ప్రస్తుతం 725 మంది పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు హెల్త్ బులెటిన్‌లో ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. గడిచిన 24 గంటల్లో 6522 శాంపిల్స్‌ను సేకరించి టెస్ట్‌లు చేయగా 80 మంది పాజిటివ్ అని తేలింది.
Here's AP Covid-19 report
రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 80 కేసు లు పాజిటివ్ గా నమోదయ్యాయి.
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 893 పాజిటివ్ కేసు లకు గాను 141 మంది డిశ్చార్జ్ కాగా, 27 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 725. #APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/QxvmihvyBP
— ArogyaAndhra (@ArogyaAndhra) April 23, 2020
కరోనా (కోవిడ్-19) వైరస్ నిరోధానికి ఉయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ (HCQ) అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాష్ట్రంలోని మందుల షాపుల్లో సాధారణ ప్రజలకు హెచ్‌సీక్యూ మందులను విక్రయించరాదని ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు ఈ ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర కోవిడ్-19 నోడల్ అధికారి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్రాల సీఎంలతో ఈనెల 27న ప్రధాని 3వ సారి భేటీ, భద్రతపై రాజీపడే ప్రసక్తే లేదు
వైద్యులు సూచించిన వారు మాత్రమే హెచ్‌సీక్యూ విక్రయించాలని, ప్రిస్కిప్షన్ లేకుండా వీటిని విక్రయించరాదని పేర్కొన్నారు. ఈ మందులను వైద్యులు సూచించిన వారు, కోవిడ్-19 వైరస్ బారిన పడ్డవారు, ఇంట్లో వారి ద్వారా వ్యాప్తి చెందినవారు మాత్రమే వీటిని వినియోగించాలని, సాధారణ ప్రజలు వినియోగిస్తే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంది.