IPL Auction 2025 Live

Fire Engulfs 20 Electric Scooters: అమ్మ బాబోయ్‌! కాలిబూడిదైన 20 ఎలక్ట్రిక్ స్కూటర్లు, కంటైనర్‌లో తీసుకెళ్తుండగా ఒక్కసారిగా మంటలు, వరుస ఘటనలతో భయాందోళనలో ఈవీ స్కూటర్ల యజమానులు

Jitendra EV నుంచి బెంగళూరుకు ఎలక్ట్రిక్ స్కూటర్లను (Electric Scooters) ట్రాన్స్‌పోర్ట్ చేస్తుండగా ఈ దుర్ఘటన నమోదైందని అధికారులు చెబుతున్నారు. ఘటనపై ఆరా తీసేందుకు కంపెనీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు చెబుతున్నారు.

Maharashtra, April 13: మహారాష్ట్రలోని (Maharashtra) నాశిక్ లో (Nasik) 20 ఎలక్ట్రిక్ స్కూటర్లు (Electric Scooters) దగ్ధమైన ఘటన యావత్ దేశాన్ని వణికిస్తోంది. Jitendra EV నుంచి బెంగళూరుకు ఎలక్ట్రిక్ స్కూటర్లను (Electric Scooters) ట్రాన్స్‌పోర్ట్ (Transport)చేస్తుండగా ఈ దుర్ఘటన నమోదైందని అధికారులు చెబుతున్నారు. ఘటనపై ఆరా తీసేందుకు కంపెనీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు చెబుతున్నారు. కంటైనర్ లో మొత్తం 40 స్కూటర్లు ఉన్నట్లుగా చెబుతుండగా మొత్తం అన్నింటికీ డ్యామేజ్ (Damage) అయినట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఉపయోగించే బ్యాటరీలు (Battery), సంబంధిత అంశాల్లో నాణ్యతే ఈ ఘటనలకు కారణమై ఉండొచ్చని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు.

Ideas2IT: కష్టానికి తగిన ప్రతిఫలం, కంపెనీని లాభాల్లోకి తీసుకువచ్చిన వంద మంది ఉద్యోగులకు కార్లను బహుమతిగా అందించిన ఐడియాస్‌2ఐటీ కంపెనీ

“స్కూటర్ ట్రాన్స్‌పోర్ట్ కంటైనర్‌లో తరలిస్తుండగా దురదృష్టవశాత్తు ఏప్రిల్ 9న ఈ ఘటన జరిగింది. సమయానికి స్పందించడంతో పరిస్థితి వెంటనే అదుపులోకి వచ్చింది. సేఫ్టీని ప్రాథమికంగా తీసుకుంటాం. దీనికి కారణాల్ని పర్యవేక్షిస్తున్నాం. ఇటీవలి కాలంలో జరుగుతున్న ఘటనలపై ఆరా తీస్తున్నాం” అని జితేంద్ర EV అధికారి ప్రతినిధి వెల్లడించారు.

Jharkhand Cable-Car Mishap: రోప్‌వే కేబుల్‌ కార్ల ప్రమాదం, మరో ఏడుమందిని రక్షించిన సైన్యం, ఇంకా కొనసాగుతున్న ఆపరేషన్‌

మూడు వారాల వ్యవధిలో ఎలక్ట్రిక్‌ ద్విచక్రవాహనాలకు మంటలు అంటుకున్న ఘటనల్లో ఇది ఐదోది కావడం గమనార్హం. మార్చి 26న పుణెలో ఓలా ఎస్‌1 ప్రో ఎలక్ట్రికల్‌ స్కూటర్‌ మంటల్లో కాలిపోయింది. అదేరోజు తమిళనాడులోని వెల్లూరులో ఒకినావా ఎలకట్రిక్‌ స్కూటర్‌కు మంటలు అంటుకున్నాయి. మార్చి 28న తిరుచ్చిలో ఇలాంటి ఘటనే చెలరేగగా.. ఆ మరుసటి రోజు చెన్నైలో నాలుగో ఘటన చోటుచేసుకుంది.