జార్ఖండ్‌లోని దేవ్‌గఢ్‌ జిల్లాలో రోప్‌వే కేబుల్‌ కార్లు ఆదివారం సాయంత్రం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టికే ముగ్గురు మ‌ర‌ణించారు. రోప్ వే క్యాబిన్ల‌లో చిక్కుకున్న వారిని సుర‌క్షితంగా కాపాడేందుకు స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. మంగ‌ళ‌వారం ఉద‌యం ఏడు మందిని సైన్యం సుర‌క్షితంగా కాపాడింది. కేబుల్ కార్ల‌లో మ‌రో ఏడుగురు వ్య‌క్తులు ఉన్న‌ట్లు సైన్యం భావిస్తోంది. వారిని కూడా సుర‌క్షితంగా త‌ర‌లించేందుకు య‌త్నిస్తున్న‌ట్లు ఐటీబీపీ జ‌వాన్లు పేర్కొన్నారు. దేవ్‌గఢ్‌లోని ప్రముఖ బైద్యనాథ్‌ దేవాలయానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రికూట్‌ పర్వత ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దాదాపు 50 మంది ప్రయాణికులు 24 గంటల పాటు రోప్‌వే క్యాబిన్లలో చిక్కుకుపోయారు. ఎంఐ-17 హెలికాప్టర్ల ద్వారా 22 మందిని నిన్న‌ రక్షించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)