Hathras Gangrape: హత్రాస్ అత్యాచార బాధితురాలు మృతి, దారుణంగా హింసించి గ్యాంగ్ రేప్, నిందితులను అరెస్టు చేశామని తెలిపిన హత్రాస్ పోలీసు అధికారి, పోలీసులు పట్టించుకోలేదని బాధిత యువతి కుటుంబసభ్యులు ఆరోపణ

ఈ ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేకెత్తిస్తోంది. ఇదిలా ఉంటే హత్రాస్ అత్యాచార బాధితురాలు ఢిల్లీ ఆసుపత్రిలో (Safdarjung Hospital in Delhi) చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. అత్యాచారం జరిగిన బాధిత యువతిని ఢిల్లీ ఆసుపత్రిలోని ఐసీయూలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించింది. తాము ఫిర్యాదు చేసినా యూపీ పోలీసులు పట్టించుకోలేదని బాధిత యువతి కుటుంబసభ్యులు ఆరోపించారు. కాగా తాము నిందితులను అరెస్టు చేశామని హత్రాస్ పోలీసు అధికారి ప్రకాష్ కుమార్ చెప్పారు.

Image used for representational purpose only | (Photo Credits: ANI)

New Delhi, September 29: యుపీలో ఓ యువతిని అతి కిరాతకంగా హింసిస్తూ నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన సంగతి (Hathras Gangrape) విదితమే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేకెత్తించింది. కాగా హత్రాస్ అత్యాచార బాధితురాలు ఢిల్లీ ఆసుపత్రిలో (Safdarjung Hospital in Delhi) చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. అత్యాచారం జరిగిన బాధిత యువతిని ఢిల్లీ ఆసుపత్రిలోని ఐసీయూలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించింది. తాము ఫిర్యాదు చేసినా యూపీ పోలీసులు పట్టించుకోలేదని బాధిత యువతి కుటుంబసభ్యులు ఆరోపించారు. కాగా తాము నిందితులను అరెస్టు చేశామని హత్రాస్ పోలీసు అధికారి చెప్పారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ పట్టణానికి చెందిన 20 ఏళ్ల ఎస్సీ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసి ఆ తరువాత నాలుక కోసి హింసించారు. యువతి తన కుటుంబసభ్యులతో కలిసి గడ్డి కోస్తుండగా నలుగురు వ్యక్తులు వచ్చి ఆమెను దుపట్టాతో లాక్కెళ్లి అత్యాచారం జరిపారు. ఉన్నతవర్గానికి చెందిన నలుగురు అత్యాచారం జరిపి యువతి నాలుక కోసి హింసించారు.అయితే ఈ ఘటన సెప్టెంబర్‌ 14న చోటుచేసుకున్నా ఆలస్యంగా వెలుగుచూసింది. ఆస్పత్రికి వచ్చినప్పుడు ఆమె శరీరంపై చాలా గాయాలున్నాయని.. నాలుకను కూడా కోసినట్లు యువతిని పరీక్షించిన డాక్టర్లు పేర్కొన్నారు.

డబ్బు కోసం నిత్య పెళ్లికూతురు అవతారం, నలుగురిని పెళ్లి చేసుకుని మోసం చేసిన కిలాడీ లేడీ, అరెస్ట్ చేసిన పోలీసులు, 14 రోజుల రిమాండ్‌, ప్రకాశం జిల్లాలో ఘటన

యువతి షెడ్యూల్‌ కులానికి చెందినది కావడం.. అ‍త్యాచారానికి పాల్పడ్డ నలుగురు అగ్రవర్ణ కులానికి చెందినవారు కావడంతోనే మొదట పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిసింది. అయితే యువతి ప్రాణాపాయ స్థితిలో ఉందని తెలుసుకున్న పోలీసులు ఆ నలుగురిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. అయితే ఈ విషయంలో పోలీసులు తొలుత తమకు సహకరించలేదని.. ఫిర్యాదు చేస్తే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని యువతి సోదరుడు ఆరోపించారు.

ఫ్రీ వైఫై‌తో 80 వేల పోర్న్ చిత్రాలను డౌన్‌లోడ్ చేసింది, ఆస్పత్రి బెడ్ మీద నుంచే వీడియోలు చూసింది, యూకేలో పోలీసులకు షాకిచ్చిన ఘటనపై ఓ లుక్కేయండి

యువతి సోదరుడు మాట్లాడుతూ.. నా సోదరి తల్లితో పాటు పొలం పనులు చేయడానికి వెళ్లింది. మా పెద్దన్న అప్పటికే గడ్డి కోసుకొని ఇంటికి వచ్చాడు. అయితే గడ్డంతా ఏపుగా పెరగడంతో మా అమ్మ, చెల్లి దానిని కోసే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే మా చెల్లి పొలం పనులు చేస్తుండగా నలుగురు యువకులు వచ్చి ఆమె తలకు ఉన్న దుప్పటను లాగి మెడకు చుట్టి అక్కడినుంచి లాక్కెల్లారు. ఆ తర్వాత ఆమెపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డ ఆ నలుగురు ఆమెపై దాడి చేసి తమ పేర్లు ఎక్కడ బయటపెడుతుందోనని బయపడి నాలుకను కోసేశారు. నా చెల్లిపై అఘాయిత్యానికి పాల్పడ్డవారు మా ఊరి యువకులే అని తర్వాత తెలిసింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ యువతి సోదరుడు ఆవేదనతో పేర్కొన్నాడు.