Amaravati, August 29: మ్యాట్రిమోనీ సైట్లలో పేర్లు, హోదాలు మార్చుకుని యువకులు, విద్యావంతులను మోసం చేసి పెళ్లి చేసుకుని అనంతరం డబ్బు డిమాండ్‌ చేసి రూ.లక్షలు స్వాహా చేసి చివరకు వారిపై కేసులు పెట్టి వేధించే నిత్య పెళ్లి కూతురును (woman arrested for marrying cheating 4 men) పోలీసులు శుక్రవారం కటకటాల వెనక్కి నెట్టారు. న్యాయమూర్తి ఆమెకు 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు పొదిలి సీఐ వేలమూరి శ్రీరామ్‌ తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు.

సీఐ తెలిపిన కథనం ప్రకారం.. తిరుపతిలో ఓ హాస్టల్‌లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేసిన స్వప్న అనే యువతి తొలిసారి మేనమామను పెళ్లి చేసుకుంది. అయితే కొద్ది రోజులకే అతన్ని వదలేసి తిరుపతికే చెందిన పృథ్వీరాజ్‌ను పెళ్లి చేసుకుంది. కొద్ది రోజులు కాపురం చేసిన తర్వాత అతడిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి రూ. 25 లక్షలు డిమాండ్‌ (Women Cheating) చేసింది. అతను పోలీసులను ఆశ్రయించగా కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఆమెపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు. అతన్ని వదిలించుకున్న తరువాత తర్వాత జర్మనీలో పని చేసే ఆత్మకూరుకు చెందిన సుధాకర్‌ను మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం చేసుకుని, పెళ్లికి సిద్ధమైంది. పెళ్లిలోగా అతడి నుంచి రూ. 5 లక్షలు డబ్బు లాగింది. నిత్య పెళ్లికూతురు బాగోతం బట్టబయలు, పోలీసులను ఆశ్రయించిన మూడో భర్త, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు

అతడిని వదిలించుకున్న తరువాత ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలంలోని వీరేపల్లికి చెంది విపర్ల వీరాంజనేయులు డెన్మార్క్‌లో ఉద్యోగం చేస్తుండగా మ్యాట్రిమోనిలో అతడిని పరిచయం చేసుకుని వివాహం చేసుకుంది. వీరాంజనేయులు ఆమె విషయాలు ఆలస్యంగా తెలుసుకుని స్వగ్రామం నుంచి డెన్మార్కు వెళ్లిపోయాడు. ఈమె భర్తపై పోలీసుస్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది. ఈమె గురించి కూపీ లాగిన భర్తకు దిమ్మతిరిగే నిజాలు తెలిసాయి.రామాంజనేయులు కంటే ముందు మరో ఇద్దరిని ఆమె వివాహం చేసుకున్నట్టు తెలిసింది. పృధ్వీపై తిరుపతి మహిళా పోలీస్ స్టేషన్‌ స్వప్న కేసు కూడా పెట్టినట్టు తెలుసుకున్నాడు. అంతే కాదు తిరుపతికి చెందిన ఓ మహిళకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమె రూ.ఆరు లక్షలు వసూలు చేసిన ఆరోపణలున్నాయని తెలుసుకున్నాడు. దీంతో అతను పోలీస్ గడప తొక్కాడు. పోలీసులకు జరిగింది చెప్పడంతో మొత్తం కూపీ లాగగా నిజాలన్నీ బయటకు వచ్చాయి.

ఈ కేసు కొనసాగుతుండగానే ముంబైలో పౌరోహిత్యం చేస్తూ తిరుపతిలో వేద విద్యాభ్యాసం చేస్తున్న దేవక్‌ శుక్లా పూజారిని పెళ్లి పేరుతో మోసం చేసి రూ.20 లక్షలు కొట్టేసింది. ఇలా ఆమె నిత్య పెళ్లి కూతురుగా వెలుగులోకి వచ్చింది. గత నెలలో నిందితురాలు స్వప్నపై ఎస్‌ఐ ఫణిభూషణ్‌ కేసు నమోదు చేశారు. పలువురిని మోసం చేసి రూ.లక్షలు స్వాహా చేసి బెదిరించి ఇబ్బంది పెడుతోందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆమెను దర్శి సబ్‌ కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. నిందితురాలిని ఒంగోలు సబ్‌జైలుకు తీసుకెళ్లినట్లు సీఐ శ్రీరామ్‌ తెలిపారు. దీంతో పాటుగా మహారాష్ట్ర, ఆంధ్రా, తెలంగాణలో ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి.