COVID-19 Pandemic: యువ ఐఏఎస్ అధికారికి కరోనావైరస్, సెల్ఫ్ క్వారంటైన్‌లోకి పలువురు ఉన్నతాధికారులు, మధ్య ప్రదేశ్‌లో 106కి చేరిన కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య

చిన్నా,పెద్దా, ముసలి అని తేడా లేకుండా అందర్నీ కాటేస్తోంది. ఈ నేపథ్యంలోనే మధ్య ప్రదేశ్ (Madhya Pradesh) ఆరోగ్య శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ యువ ఐఏఎస్ అధికారి (IAS Officer) కరోనా వైరస్ బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో కోవిడ్-19 (COVID-19) పాజిటివ్ ఉన్నట్టు తేలడంతో హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆయనతో సన్నిహితంగా మెలిగిన సహోద్యోగులు, కుటుంబ సభ్యులు కూడా సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు.

Coronavirus Outbreak in AP | Photo: IANS

Bhopal, April 4: కరోనావైరస్ (COVID-19 Pandemic) ఎవ్వరినీ వదలడం లేదు. చిన్నా,పెద్దా, ముసలి అని తేడా లేకుండా అందర్నీ కాటేస్తోంది. ఈ నేపథ్యంలోనే మధ్య ప్రదేశ్ (Madhya Pradesh) ఆరోగ్య శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ యువ ఐఏఎస్ అధికారి (IAS Officer) కరోనా వైరస్ బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో కోవిడ్-19 (COVID-19) పాజిటివ్ ఉన్నట్టు తేలడంతో హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆయనతో సన్నిహితంగా మెలిగిన సహోద్యోగులు, కుటుంబ సభ్యులు కూడా సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు.

కరోనా కోరల్లో అమెరికా, రికార్డు స్థాయి మరణాలు

వీరిలో రాష్ట్రానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా ఉన్నట్టు సమాచారం. నిన్న సాయంత్రం ఆరోగ్య శాఖకు చెందిన 120 మంది అధికారులు, సిబ్బంది నుంచి నమూనాలు సేకరించి కోవిడ్-19 పరీక్షల కోసం పంపినట్టు ఓ సీనియర్ అధికారి మీడియాకు వెల్లడించారు. కాగా కోవిడ్-19 వ్యాధికి గురైన యువ ఐఏఎస్ అధికారి స్వయంగా డాక్టర్ కావడంతో... కరోనా వైరస్ కట్టడిపై ఇప్పటికే ఉన్నత స్థాయిలో పలు సమావేశాలు నిర్వహించినట్టు చెబుతున్నారు.

కరోనా కట్టడికి రాష్ట్రాలకు అత్యవసర నిధులు

అత్యంత సమర్థుడైన అధికారిగా గుర్తింపు ఆయన హెల్త్ డైరెక్టరేట్‌లోని 126 మందిని ప్రత్యక్షంగా కలిశారని తెలుస్తోంది. ఇటీవల ఆయన అస్వస్థతకు గురికావడంతో గురువారం రాత్రి తొలిసారి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. కాగా మధ్య ప్రదేశ్‌లో ఇప్పటి వరకు మొత్తం 106 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. ఈ మహమ్మారి కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్స్ ఆఫ్ చేసి జ్యోతులు వెలిగించండి

కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు COVID-19 నుండి ఎవరూ కోలుకోలేదు. భోపాల్‌లో 10 కి పైగా కోవిడ్ -9 కేసులు నమోదయ్యాయి. 100 మందికి పైగా కరోనావైరస్ బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇండోర్ అత్యంత నష్టపోయిన జిల్లాగా మారింది. ధృవీకరించబడిన కేసుల సంఖ్య భారతదేశంలో ఇప్పటికే 2,900 దాటింది.