Fight Against Covid-19: కరోనా కట్టడికి రాష్ట్రాలకు అత్యవసర నిధులు, రూ. 11,092 కోట్ల విడుదలకు హోంశాఖ అమోదం, ఎస్‌డీఆర్‌ఎంఎఫ్‌ కింద తొలి విడత నిధులు విడుదల
Union Home Minister Amit Shah (Photo Credits: ANI)

New Delhi April 4: దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేపుతున్న కరోనావైరస్ (Coronavirus pandemic) కట్టడికి కేంద్రం నడుం బిగించింది.ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు అత్యవసర నిధులను విడుదల చేసింది. రాష్ట్ర విపత్తు ప్రమాద నిర్వహణ నిధి (SDRMF) కింద రాష్ట్రాలకు 11,092 కోట్లు విడుదల చేసేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆమోదం (Home Minister Amit Shah) తెలిపారు.

ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్స్ ఆఫ్ చేసి జ్యోతులు వెలిగించండి

ఎస్‌డీఆర్‌ఎంఎఫ్‌కు తొలి విడత కింద ఈ నిధులు విడుదల చేయనున్నట్లు కేంద్రం పేర్కొంది. ఈ నిధులను క్వారంటైన్‌ కేంద్రాల ఏర్పాటు సహా ఇతర వ్యవహారాల కోసం ఉపయోగించుకోవచ్చని తెలిపింది. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ( PM Modi Video Conference) నిర్వహించారు అనంతరం ఈ నిధులు విడుదల చేయడం గమనార్హం.

కాగా కేంద్రం నుంచి రెండు పద్దుల్లో ఆంధ్రప్రదేశ్‌కు (AP) రూ.1050.64 కోట్లు నిధులు రానున్నాయి. ఇందులో జాతీయ విపత్తుల నిర్వహణ (ఎస్‌డీఆర్‌ఎంఎఫ్‌) కోసం 2020-21 సంవత్సరానికి తొలి విడత కింద రూ.559.50 కోట్లు విడుదల కానున్నాయి. దీనికి కేంద్ర హోం శాఖ శుక్రవారం ఆమోదం తెలిపింది. అలాగే 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక లోటు భర్తీ చేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ 2020-21 సంవత్సరానికి రూ.491.14 కోట్లు విడుదల చేసింది.

తెలుగు సినీ హీరోలను మెచ్చుకున్న ప్రధాని

కాగా మహమ్మారి కరోనా వైరస్‌పై రాష్ట్రాలు మరింత సమర్ధంగా పోరాడేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రూ 17,287 కోట్లు విడుదల చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన ఈ నిధుల్లో 14 రాష్ట్రాలకు సంబంధించి పదిహేనో ఆర్థిక సంఘం సూచించిన మేర ఆదాయ లోటు గ్రాంటు రూ 6195 కోట్లు కూడా కలిపిఉన్నాయి. ఆదాయ లోటు గ్రాంట్‌ను ఏపీ, అసోం, హిమచల్‌ ప్రదేశ్‌, కేరళ, మణిపూర్‌, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్‌, పంజాబ్‌, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్‌, పశ్చిమ బెంగాల్‌లకు ఆర్థిక శాఖ మంజూరు చేసింది.రూ 17,287 కోట్ల నుంచి రూ 6195 కోట్లు తీసివేస్తే వచ్చే మొత్తం రాష్ట్ర విపత్తు ప్రమాద నిర్వహణ నిధిగా ఉంది.

తెలంగాణలో 229కి చేరిన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య శుక్రవారానికి 3041కి, మరణాల సంఖ్య 90కి చేరింది. రాష్ట్రాలవారీగా ప్రకటించిన గణాంకాల మేరకు శుక్రవారం ఒక్కరోజే 534 కొత్త కేసులు, 14 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ కోవిడ్‌–19తో 26 మంది మరణించగా, గుజరాత్‌(8), మధ్యప్రదేశ్‌(6), పంజాబ్‌(5), ఢిల్లీ(6), కర్నాటక(3), పశ్చిమబెంగాల్‌(3), జమ్మూకశ్మీర్‌(2), ఉత్తరప్రదేశ్‌(2), కేరళ(2) తదితర రాష్ట్రాల్లోనూ మరణాలు చోటు చేసుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో తొలి కోవిడ్-19 మరణం నమోదు

అయితే, కేంద్రం పేర్కొంటున్న గణాంకాలకు, రాష్ట్రాలు ప్రకటిస్తున్న వివరాలకు మధ్య అంతరం ఉంటోంది. మహారాష్ట్రలో కేసుల సంఖ్య కూడా భారీగానే ఉంది. అక్కడ మొత్తం 490 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత స్థానంలో తమిళనాడు(411) ఉంది. ఢిల్లీలో శుక్రవారానికి కేసుల సంఖ్య 386కి చేరింది. వీటిలో శుక్రవారం ఒక్కరోజులోనే 93 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 211 మంది కరోనా నుంచి కోలుకున్నారని శుక్రవారం సాయంత్రం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

శుక్రవారం నాటికి ఉత్తరప్రదేశ్‌లో 172, తమిళనాడులో 309, రాజస్తాన్‌లో 167, కర్నాటకలో 124, మధ్యప్రదేశ్‌లో 104, గుజరాత్‌లో 95, జమ్మూకశ్మీర్లో 75, పశ్చిమబెంగాల్‌లో 63, బిహార్‌లో 29 కేసులు నమోదయ్యాయి. గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 647 కేసులు ఢిల్లీలో జరిగిన తబ్లిగి జమాత్‌ మత కార్యక్రమంలో పాల్గొన్నవారికి సంబంధించినవేనని ఆరోగ్య శాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు.