Income Tax Return 2019-20: ఆదాయపు పన్ను చెల్లింపు దారులకు శుభవార్త, ఐటీ రిటర్న్ 2019-20 గడువు నవంబర్ వరకు పొడిగింపు, టీడీఎస్ రేట్లు 25 శాతం తగ్గింపు
ఆర్థిక మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 3 నుండి అక్టోబర్ 31 వరకు పన్ను ఆడిట్ గడువును పొడిగించింది. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (FM Nirmala Sitharaman) మాట్లాడుతూ.. చారిటబుల్ ట్రస్టులు,స్వచ్చంధ సంస్థలు, సహకార సంఘాలకు పెండింగ్ రీ ఫండ్స్ సత్వరమే చెల్లించనున్నట్టుగా కేంద్రం తెలిపింది.
New Delhi, May 13: ఆదాయపు పన్ను దాఖలు (ఐటిఆర్) దాఖలు 2019-2020 గడువును (Income Tax Return 2019-20) నవంబర్ 30 వరకు కేంద్రం పొడిగించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 3 నుండి అక్టోబర్ 31 వరకు పన్ను ఆడిట్ గడువును పొడిగించింది. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (FM Nirmala Sitharaman) మాట్లాడుతూ.. చారిటబుల్ ట్రస్టులు,స్వచ్చంధ సంస్థలు, సహకార సంఘాలకు పెండింగ్ రీ ఫండ్స్ సత్వరమే చెల్లించనున్నట్టుగా కేంద్రం తెలిపింది. ఎంఎస్‌ఎంఈలకు అర్థం మారింది, రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ వివరాలను వెల్లడించిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, పూర్తి వివరాలు ఇవే
ఇదిలా ఉంటే టీడీఎస్ రేట్లను (TDS Rates) 25 శాతం తగ్గించారు. వడ్డీ, అద్దె, బ్రోకరేజ్, సరఫరా తదితర మొదలైన అన్ని రకాల చెల్లింపులపై ఇది వర్తిస్తోందని, రేపటి నుండి వచ్చే ఏడాది మార్చి 31వరకు ఇది అమల్లో ఉంటుందని కేంద్రం ప్రకటించింది. తద్వారా ప్రజల చేతిలో సుమారు రూ. 50 వేల కోట్లు ఉంటాయని కేంద్రం ప్రకటించింది.
2019-20 ఆర్ధిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ (IT Returns) దాఖలుకు జూలై 30 వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు గతంలో గడువు పెంచారు. ఈ గడువును ఇవాళ నవంబర్ 30వ తేదీకి పొడిగించారు. టాక్స్ ఆడిట్స్ ను గడువును సెప్టెంబర్ 30వ తేదీ నుండి అక్టోబర్ 31వరకు పెంచుతున్నట్టుగా కేంద్ర మంత్రి తెలిపారు. డేట్ ఆఫ్ అసెస్ మెంట్ కు మూడు మాసాల పాటు గడువును పెంచింది. సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు పొడిగించింది. . ప్రధాని మోదీ 'ఆత్మ నిర్భర్' గుట్టు విప్పిన కేంద్ర ఆర్థికమంత్రి, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అంటే స్వయం ఆధారిత భారతం, ఉద్దీపన ప్యాకేజీ వివరాలు వెల్లడించిన నిర్మలా సీతారామన్
మార్చి 2021 వరకు గడవు ముగిసిన వారికి వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు గడువును పొడిగిస్తున్నట్టుగా కేంద్రం తెలిపింది. అయితే ఎలాంటి అదనపు పన్నులు ఉండవని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఐటీ రిటర్న్ దాఖలు చేయడానికి గతంలో కూడ గడువును కేంద్రం పెంచిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో దేశాన్ని ఆర్ధికంగా పరిపుష్టం చేసేందుకు ప్రకటించిన రూ.రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా ఈ నిర్ణయాలను కేంద్రం తీసుకొంది. ...