Coronavirus in India: కరోనాని కట్టడి చేయడం ఎలా ? రాష్ట్రాల సీఎంలతో మరోసారి ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌, దేశంలో 3 లక్షల 50 వేలకు చేరువలో కోవిడ్-19 కేసులు

గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,667 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 380 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 3,43,091 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1,53,178 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 1,80,013 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు భారత్‌లో 9,900 మంది కరోనాతో (Coronavirus Deaths) చనిపోయారు. మహారాష్ట్రలో అత్యధికంగా 1,10,744 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 4,128 మంది చనిపోయారు. తమిళనాడులో 46,504(మృతులు 479), ఢిల్లీలో 42,829(మృతులు 1,400), గుజరాత్‌లో 24,104(మృతులు 1,506), యూపీలో 14,091(మృతులు 417) కేసులు నమోదు అయ్యాయి.

PM Narendra Modi in West Bengal (Photo Credits: ANI)

New Delhi, June 16: దేశ ప్రజలను కరోనా వైరస్‌ (Coronavirus in India) గజగజ వణికిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,667 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 380 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 3,43,091 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1,53,178 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 1,80,013 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు భారత్‌లో 9,900 మంది కరోనాతో (Coronavirus Deaths) చనిపోయారు. ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్‌ విధించే ఆలోచన లేదని స్పష్టం చేసిన కేజ్రీవాల్, హోంమంత్రితో ముగిసిన అఖిలపక్ష సమావేశం, మ‌ళ్లీ లాక్‌డౌన్ ఉండ‌దన్న గుజరాత్ సీఎం విజయ్ రూపానీ

మహారాష్ట్రలో అత్యధికంగా 1,10,744 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 4,128 మంది చనిపోయారు. తమిళనాడులో 46,504(మృతులు 479), ఢిల్లీలో 42,829(మృతులు 1,400), గుజరాత్‌లో 24,104(మృతులు 1,506), యూపీలో 14,091(మృతులు 417) కేసులు నమోదు అయ్యాయి.

దేశంలో లాక్‌డౌన్‌ (Lockdown 5) ఆంక్షలు సడలించిన తర్వాత కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ (PM Narendra Modi) మంగళ, బుధవారాల్లో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల(యూటీ) సీఎంలు, లెఫ్టినెంట్‌ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ (Video Conferencing) నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు, లాక్‌డౌన్‌ సడలింపులపై చర్చించనున్నారు. తమిళనాడులో నాలుగు జిల్లాల్లో మళ్లీ పూర్తి స్థాయి లాక్‌డౌన్, జూన్ 19 నుంచి 30 వరకూ అమల్లో.., నిబంధనలు మరింత కఠినతరం చేయాలని పళని స్వామి సర్కారు ఆదేశాలు

అన్‌లాక్‌ 1 పేరుతో ఇప్పటికే పరిశ్రమలకు, వ్యాపారాలకు వెసులుబాట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దేశంలో కరోనా ఉద్ధృతి తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకొన్నది. వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా ఆయన మంగళవారం 21 రాష్ట్రాలు, యూటీలు, బుధవారం 15 రాష్ట్రాలు, యూటీల నేతలతో సమావేశం నిర్వహిస్తారు. ప్రధాని మోదీ ఇప్పటి దాకా ముఖ్యమంత్రులతో ఐదుసార్లు సమావేశమయ్యారు. చివరిసారిగా మే 11న ముఖ్యమంత్రులతో చర్చలు జరిపారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif