Coronavirus in India: జూన్ నాటికి కరోనా కేసులు తగ్గుముఖం, వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం వల్లే కేసుల పెరుగుదల అంటున్న నిపుణులు, దేశంలో కొత్తగా 3,49,691 కరోనా కేసులు నమోదు, పలు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమల్లోకి..
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ లో రోజు రోజుకు కరోనా మరణాలు, కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో వరుసగా ఐదో రోజు 2 వేలకుపైగా కరోనా మరణాలు (Covid Deaths) సంభవించాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 3,49,691 కరోనా కేసులు (Coronavirus in India) నమోదు కాగా, 2,767 మంది మృతి చెందారు.
New delhi, April 25: భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ లో రోజు రోజుకు కరోనా మరణాలు, కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో వరుసగా ఐదో రోజు 2 వేలకుపైగా కరోనా మరణాలు (Covid Deaths) సంభవించాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 3,49,691 కరోనా కేసులు (Coronavirus in India) నమోదు కాగా, 2,767 మంది మృతి చెందారు.
ఇప్పటి వరకు దేశంలో 26,82,751 లక్షల కరోనా పాజిటివ్ కేసులు ఉండగా..దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.69 కోట్లకు (India Coronavirus) చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాతో 1,92,311 మంది మృతి (Covid Deaths in India) చెందారు. ఇప్పటి వరకు దేశంలో 14.09 కోట్ల మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్ర వైద్యఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో తెలిపింది.
ఉత్తరప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా 38,055 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 223 మంది కరోనాతో కన్నుమూయగా, 23,221 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. యూపీలో ఇప్పటి వరకూ 7 లక్షల 52 వేల 221 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 10,959 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమిత్ మోహన్ ప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటివరకూ యూపీలో మొత్తం 3 కోట్ల 95 లక్షల 40 వేల 989 కరోనా టెస్టులు చేశామన్నారు. రాష్ట్రంలోని ఆసుపత్రులకు ఆక్సిజన్ చేరుతున్నదని తెలిపారు.
ఉత్తరాఖండ్‌లోని సుర్‌సింగ్ ధార్‌లోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 93 మంది విద్యార్థులు కరోనా పాజిటివ్‌గా పరీక్షలు చేశారు. ఆ తర్వాత అధికారులు కళాశాల హాస్టల్‌ను కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. 200 మంది విద్యార్థుల నమూనాలను పరీక్షలకు పంపగా.. 93 మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. మరికొందరి టెస్టుల ఫలితాలు రావాల్సి ఉన్నది.
నెగెటివ్ వచ్చిన 65 మంది విద్యార్థులకు ఇంటికి పంపించి వేశారు. జిల్లా మెజిస్ట్రేట్ టెహ్రీ ఆదేశాల మేరకు హాస్టల్‌ను కంటైనేషన్ జోన్‌గా ప్రకటించారు. ఇదిలా ఉండగా.. ఉత్తరాఖండ్‌లో నిన్న 5,084 కరోనా పాజిటివ్ కేసులు, 81 మరణాలు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 33,330కు పెరిగిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైన తర్వాత భారీ సడలింపులతో అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను ప్రభుత్వం మళ్లీ బిగించింది. కొన్ని రోజుల క్రితం సడలింపులను సవరించగా ప్రతి ఆది వారం పూర్తి లాక్‌డౌన్‌ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా సెకండ్ వేవ్‌లో తొలి పూర్తి లాక్‌డౌన్ ఈ నెల 25వ తేదీ నుంచి అమల్లోకి వస్తోంది. 236 రోజుల తర్వాత మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్ చట్రంలోకి ప్రజలు మళ్లీ వెళ్లిపోవాల్సి వస్తోంది.
ఆదివారాల్లో వర్తక, వాణిజ్య, వ్యాపార కేంద్రాలు మూసివేస్తారు. వాహనాల రాకపోకలు కూడా పూర్తిగా నిషేధం. ప్రజలు రోడ్లపైకొస్తే అరెస్టు చేసేలా ఆంక్షలు తీసుకొచ్చారు. ఆదివారాల్లో మెట్రో రైలును ప్రతిగంటకోసారి సేవలందించేలా సవరించారు. ప్రతి ఆదివారం పూర్తి లాక్‌డౌన్ వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడకుండా అమ్మ క్యాంటీన్‌లను యథావిధిగా నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో 3,816 రైల్వే కోచ్‌లను కొవిడ్-19కేర్ కోచ్‌లుగా మార్చినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్ మేరకు కోచ్‌లను మోహరిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది. మహారాష్ట్రలోని నందూర్‌బార్ జిల్లాలో 21 కొవిడ్ -19 కేర్ కోచ్‌లను మోహరించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. షుకుర్ బస్తీ వద్ద 25, ఆనంద్ విహార్‌లో 25, వారణాసిలో 10, భడోహిలో పది, ఫైజాబాద్ వద్ద 10 కొవిడ్-19 కేర్ కోచ్‌లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ఆరోగ్య సంరక్షణ ప్రయత్నాల్లో భాగంగా మొత్తం 5,601 రైల్ కోచ్‌లను కొవిడ్ కేర్ సెంటర్లుగా మారుస్తున్నట్లు చెప్పింది. ప్రస్తుతం 3,816 కోచ్‌లు వినియోగానికి అందుబాటులో ఉన్నాయని, కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. తేలిక పాటి కరోనా రోగులకు సేవలందించేందుకు ఉపయోగించుకోవచ్చని చెప్పింది.
కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆలిండియా ఇన్‌స్టిట్యూ ట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ రణ్‌దీప్ గులేరియా స్పష్టం చేశారు. అత్యవసరంగా కరోనా చెయిన్‌ను బ్రేక్ చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన తేల్చి చెప్పారు.రోజూ ఇన్ని కేసులను భరించడం సాధ్యం కాదు అని దీనికోసం కనీసం పది శాతం పాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించాల్సిందేనని ఆయన చెప్పారు. ప్రాణాలు కాపాడటం అనేది ముఖ్యం. కేసులు పెరిగిపోతుండటం వల్ల ఆరోగ్య వ్యవస్థ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ముందు కేసుల సంఖ్యను తగ్గించడంపై దృష్టి సారించాలి అని గులేరియా అన్నారు.
కరోనా కేసుల కల్లోలం నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ విధించారు. కరోనా కట్టడికి 34 గంటల కర్ఫ్యూని అధికారులు అమలు చేస్తున్నారు. శనివారం రాత్రి 8 గంటలకు ప్రారంభమైన కర్ఫ్యూ సోమవారం ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు. దీంతో అన్నిరకాల మార్కెట్లు, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. కేవలం అత్యవసరమైన సేవలకు మాత్రమే అనుమతిస్తున్నారు.
జమ్ముకశ్మీర్‌లోని ఎనిమిది జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఈనెల 8 నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉన్నది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉన్నది. అనంతరం ఏప్రిల్ 20న దాన్ని 20 జిల్లాల్లోని మున్సిపల్, గ్రామీణ ప్రాంతాలకు పెంచారు. కేంద్రపాలిత ప్రాంతంలో నిన్న 2030 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,58,374కు చేరింది. ఇందులో 2126 మంది మరణించారు.
సెకండ్ వేవ్ తక్కువ వ్యవధితో ఎక్కువ ఉద్ధృతితో కొనసాగనున్నదని వైరాలజిస్ట్ జాకబ్ జాన్, బయోఎథిక్స్, పాలసీ నిపుణులు ఆనంద్, సాంక్రమిక వ్యాధినిపుణులు డేవిడ్ హేమన్ అభిప్రాయపడ్డారు. దేశంలో ఏప్రిల్ చివరినాటికి కేసులు గరిష్ఠస్థాయికి చేరకుంటాయని అంచనా వేశారు. జూన్‌నాటికి ఎండెమిక్ స్టేజ్‌కి (కేసులు సాధారణ స్థాయికి రావడం) వస్తాయని పేర్కొన్నారు. వైరస్ ఉత్పరివర్తనం చెంది వేగంగా వ్యాపించడం, ప్రజలు, రాజకీయ నాయకులు కరోనా మార్గదర్శకాలు పాటించకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే కేసులు భారీగా పెరుగుతున్నాయని వివరించారు.
దేశంలో వైరస్ సీక్వెన్సింగ్ తగిన విధంగా జరుగడం లేదని, ఇది వ్యవస్థాగతమైన లోపమని పేర్కొన్నారు. బ్రిటన్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున సీక్వెన్సింగ్ నిర్వహిస్తున్నారని వెల్లడించారు. వ్యాక్సిన్ బూస్టర్ డోస్ ఇవ్వడం ద్వారా ఉత్పరివర్తనాలను చాలా వరకు ఎదుర్కొనవచ్చని పేర్కొన్నారు. వైరస్‌తో కలిసి జీవించడం తప్పదన్నారు. మహమ్మారిని పూర్తిగా నిర్మూలించడం అతిపెద్ద సవాల్ అని, పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ద్వారానే వైరస్‌ను నియంత్రించగలమని పేర్కొన్నారు.
ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 25 మంది రోగులు చనిపోయి 24 గంటలు కూడా కాకముందే ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ దవాఖానలో 20 మంది ప్రాణవాయువు లేక ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్ సరఫరాలో ఆలస్యం వల్లే ఈ ఘోరం జరిగింది. ఆక్సిజన్ లేక రెండు రోజుల్లోనే 45 మంది ప్రాణాలు కోల్పోవడం, దాదాపు అన్ని దవాఖానల్లో ఆక్సిజన్‌కు కొరత ఉండటంతో ఇంకా ఎంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందో అని భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)