Dead Body Falling Off Ambulance (Photo/Screen shot video/Twitter)

Vidisha, April 24: దేశంలో కరోనా కల్లోలం రేపుతోంది. పలు రాష్ట్రాల్లో పీక్ స్టేజీకి చేరింది. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో కోవిడ్ మరణాలు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. తాజాగా ఎంపీలో ఓ వీడియో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. కోవిడ్ -19 బాధితుల మృతదేహాలను తరలించడంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపే ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. విదిషా జిల్లాలో ఓ ఆసుపత్రి నుంచి శ్మశాన వాటికకు తరలిస్తున్న అంబులెన్స్‌ నుంచి ఓ కరోనా మృతదేహం ( Dead Body Falling Off Ambulance) కిందపడిపోయింది.

ఈ సంఘటన శుక్రవారం అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో (Viral Video of Dead Body Falling Off Ambulance) చోటుచేసుకుంది. ND TV ప్రకారం  డ్రైవర్ అధిక వేగంతో వాహనాన్ని మలుపు తిప్పడంతో మృతదేహాన్ని తీసుకెళ్తున్న అంబులెన్స్ గేట్ ఒకటి విరిగింది. దీంతో మృతదేహం ఎగిరి రోడ్డుపై పడింది. దీన్ని గమనించిన కోవిడ్ -19 రోగుల బంధువులు ఆసుపత్రి (Atal Bihari Vajpayee Vidisha District Hospital) బయటకి వచ్చి హాస్పిటల్‌ తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. దీనికి సంబధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతోంది.

Here's Viral Video

అంతేగాక ఆసుపత్రి యాజమాన్యం తమ కుంటుంబీకుల మృతదేహాలను సకాలంలో అప్పగించడం లేదని కొంతమది ఆరోపించారు. అంతేగాక అసలు మరణ వార్త గురించి కుటుంబ సభ్యులకు, బంధువులకు చెప్పడం లేదని విమర్శస్తున్నారు. ఇక ఇటీవల విధిశా జిల్లాలో కోవిడ్‌ మరణాలు అధికమయ్యాయి. ప్రతిరోజూ సుమారు 20 నుంచి 25 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో నమోదవుతున్న మరణాలను ప్రభుత్వం అధికారికంగా చెప్పడం లేదనే అనుమానాలూ ఉన్నాయి.

మోడీ సర్కారు సంచలన నిర్ణయం, రాష్ట్రాల‌కు ఉచితంగా కరోనా వ్యాక్సిన్, ప్రతిపక్షాల విమర్శలతో దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం

ఓవైపు కరోనా (Madhya Pradesh Covid) తీవ్ర రూపం దాల్చుతుండటంతో ప్రజలు ఉలిక్కిపడుతుంటే.. మరోవైపు కోవిడ్‌ బాధితుల మృతదేహాలను పూడ్చి పెట్టేందుకు సరైన స్థలం దొరక్కపోవడం మరింత ఆందోళనకరంగా మారింది. ప్రతి చోట కరోనా మృతదేహాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. శవాలను మోసుకొచ్చి, శ్మశాన వాటికలు ఖాళీగా లేకపోవడంతో తమ వంతుకోసం అంబులెన్సులు వరసగా నిలుచుంటున్నాయి.

మరో ఘోరం..ఆక్సిజన్ అందక 20 మంది మృతి, ప్రమాదంలో 200 మంది పేషెంట్లు, మరో అరగంట పాటే ఆక్సిజన్‌ నిల్వలు, ఢిల్లీలో విషాద ఘటన

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 12,384 కోవిడ్ -19 కేసులు నమోదు కాగా, 75 మంది మరణించారు. ఇప్పుడు రాష్ట్రంలో యాక్డివ్ కేసుల సంఖ్య 4.59 లక్షలకు పైగా ఉంది, జిల్లాల్లో చాలా మంది ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్నారని, దీని ఫలితంగా చాలా మంది మరణించారని నివేదికలు వెలువడుతున్నాయి.

మే నెలలో మరింతగా కరోనా ఉగ్రరూపం, మరణాలు అత్యధిక స్థాయిలో నమోదయ్యే అవకాశం, సంచలన విషయాలను వెల్లడించిన యుఎస్ ఐఎంహెచ్‌ఈ అధ్యయనం

సెకండ్ వేవ్ లో కేసులు విపరీతంగా పెరుగుతున్నందున రాష్ట్రంలో భారీగా ఆక్సిజన్ కొరత ఏర్పడింది. రోజుకు 400 టన్నుల వరకు అవసరం ఏర్పడగా పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఇది 500 టన్నుల వరకు అవసరం ఉంటుందని తెలుస్తోంది.