India Coronavirus: ఢిల్లీలో కరోనాతో పెరుగుతున్న మరణాలు, అసోం మాజీ సీఎం తరుణ్ గొగాయ్ కన్నుమూత, కరోనాతో ఒడిషా గవర్నర్ భార్య, గాంధీ మనవడు సతీష్ ధుపేలియా మృతి, దేశంలో తాజాగా 37,975 క‌రోనా కేసులు

వరుసగా నాలుగో రోజూ కరోనా మృతుల సంఖ్య 100 (Covid Deaths in Delhi) దాటింది. గడచిన 24 గంటల్లో 121 మంది కరోనా బాధితులు మ‌ర‌ణించారు. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 8,512 దాటింది. నిన్న కొత్త‌గా 4,454 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో రాష్ట్రంలో క‌రోనా కేసులు 5.34 ల‌క్ష‌లు దాటాయి.

coronavirus ward in hospital

New Delhi, November 24: దేశంలో క‌రోనా కేసులు కొంచెం తగ్గుముఖం పట్టాయి. నిన్న 44 వేల‌కుపైగా కేసులు న‌మోద‌వ‌గా, నేడు 37 వేల‌పైచిలుకు కేసులు (Coronavirus in India) వ‌చ్చాయి. ఇది సోమ‌వారం కంటే 13.8 శాత త‌క్కువ అని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ‌శాఖ తెలిపింది. దీంతో మొత్తం క‌రోనా కేసులు 92 ల‌క్ష‌ల‌కు (Covid Cases in India) చేరువ‌లో నిలిచాయి. దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 37,975 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో క‌రోనా కేసులు సంఖ్య 91,77,841కి చేరాయి. ఇందులో 4,38,667 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

మ‌రో 86,04,955 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకోగా, 1,34,218 మంది క‌రోనా వ‌ల్ల‌ మ‌ర‌ణించారు. ఇందులో నిన్న‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు కొత్త‌గా 480 మంది మ‌ర‌ణించ‌గా, 42,314 మంది కోలుకున్నారు. క‌రోనా రిక‌వ‌రీరేటు 93.75 శాతంగా ఉంది. నిన్న దేశంలో 10.9 ల‌క్ష‌ల మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, అందులో 3.5 శాతం మంది అంటే 37,975 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు.

దేశరాజధాని ఢిల్లీని క‌రోనా వైర‌స్ వణికిస్తోంది. వరుసగా నాలుగో రోజూ కరోనా మృతుల సంఖ్య 100 (Covid Deaths in Delhi) దాటింది. గడచిన 24 గంటల్లో 121 మంది కరోనా బాధితులు మ‌ర‌ణించారు. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 8,512 దాటింది. నిన్న కొత్త‌గా 4,454 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో రాష్ట్రంలో క‌రోనా కేసులు 5.34 ల‌క్ష‌లు దాటాయి.

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ప్రమాదం, అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్, ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని సూచన

ఇందులో 4,88,476 మంది కోలుకోగా, మ‌రో 37,327 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. సోమవారం మొత్తం 37,307 కరోనా టెస్టులు చేయగా, వాటిలో 4,454 పాజిటివ్‌గా తేలింది. దీని ప్రకారం కరోనా సంక్రమణ రేటు 11.94గా ఉందని వెల్లడయ్యింది. ఢిల్లీలో ఇప్ప‌టివ‌ర‌కు అత్య‌ధికంగా న‌వంబ‌ర్ 11న ఒక్క‌రోజులో 8,593 కేసులు న‌మోద‌య్యాయి.

మహారాష్ట్రకు వెళ్లాలంటే కోవిడ్ నెగిటివ్ ఉండాల్సిందే

ఇదిలా ఉంటే త‌మ రాష్ట్రానికి వ‌చ్చే ఢిల్లీ, గుజ‌రాత్‌, రాజ‌స్థాన్, గోవా రాష్ట్రాల ప్ర‌జ‌లు క‌చ్చితంగా కొవిడ్‌-19 నెగ‌టివ్ రిపోర్ట్ తీసుకురావాల్సిందేన‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. బ‌య‌టి రాష్ట్రాల నుంచి వ‌చ్చే వాళ్ల‌కు కొత్త నిబంధ‌న‌ల‌ను జారీ చేసింది. విమానాలు, రైళ్ల ద్వారా వ‌చ్చే ప్ర‌యాణికులు అంతా నెగ‌టివ్ రిపోర్ట్ చూపించాల్సి ఉంటుంది. విమాన ప్ర‌యాణికులు అయితే మ‌హారాష్ట్ర‌లో ల్యాండ్ అయ్యే 72 గంట‌ల ముందు, రైలు ప్రయాణికులు 96 గంట‌ల ముందు టెస్ట్ చేయించుకోవాలి.

కరోనాంతర సమస్యలతో అసోం మాజీ సీఎం తరుణ్‌ గొగోయ్‌ కన్నుమూత

అసోం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తరుణ్‌ గొగోయ్‌(84) కన్నుమూశారు. కరోనా అనంతరం తలెత్తిన అనారోగ్య సమస్యలతో గత కొన్ని వారాలుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. బహుళ అవయవాల వైఫల్యం కారణంగా ఆయన మృతిచెందినట్టు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి హిమంత బిశ్వశర్మ వెల్లడించారు. ఆగస్టు 25న గొగోయ్‌కు కరోనా సోకినట్టు నిర్ధారణ కాగా ఆ మరుసటి రోజే గువాహటి మెడికల్‌ కాలేజ్‌ దవాఖానలో చేరారు.

కరోనా చికిత్సకు ఉపయోగించే రెమిడిసివిర్‌ సస్పెండ్, దాంతో ఎటువంటి ప్రయోజనం లేదని తెలిపిన డబ్ల్యూహెచ్‌వో, అమెరికా జూనియర్ ట్రంప్‌కి కోవిడ్ పాజిటివ్

రెండు నెలల తర్వాత కరోనా నుంచి కోలుకుని, డిశ్చార్జి అయ్యారు. అయితే ఇతర అనారోగ్య సమస్యలు ఆయనను చుట్టుముట్టడంతో మళ్లీ ఈ నెల 2న తిరిగి ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. కీలక అవయవాలు పనిచేయకపోవడంతో తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు ప్రకటించారు. గొగోయ్‌కు భార్య డాలీ, కుమార్తె చంద్రిమ, కుమారుడు గౌరవ్‌ ఉన్నారు. గొగోయ్‌ మృతితో అసోం ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిపింది.

కరోనాతో ఒడిశా గవర్నర్‌ భార్య సుశీలా దేవి కన్నుమూత

ఒడిశా గవర్నర్‌ గణేశీ లాల్ సతీమణి సుశీలా దేవి కరోనా కారణంగా కన్నుమూశారు. ఈ విషయాన్ని గవర్నర్‌ ​కార్యాలయం వెల్లడించింది. రాష్ష్ర్ట ప్రథమ మహిళ సుశీలా దేవి ఆదివారం రాత్రి చనిపోయిందని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేసింది. కాగా నవంబర్‌ 2న గవర్నర్‌ గణేశీ లాల్, ఆయన భార్యతో పాటు నలుగురు కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. దీంతో వీరంతా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా, అనారోగ్యం క్షీణించి సుశీలా దేవి గతరాత్రి మరణించారు.

గాంధీ మనవడు కరోనాతో కన్నుమూత

కరోనా వైరస్‌ కారణంగా జాతిపిత మహాత్మా గాంధీ మునిమనవడు సతీష్ ధుపేలియా ఆదివారం జోహన్నెస్‌బర్గ్‌లో మరణించారు. ఆయన కరోనా వైరస్‌తో మృతి చెందినట్లు ఆయన సోదరి ఉమా ధుపేలియా తెలిపారు. న్యుమోనియాతో ఆస్పత్రిలో చేరిన తన సోదరుడికి కరోనా వైరస్‌ కూడా సోకిందని తెలిపారు. ఆయన నెల రోజుల నుంచి ఆస్పత్రిలో కోవిడ్‌ చికిత్స తీసుకుంటున్నారు. చికిత్స పొందుతున్న సతీష్‌కి ఆదివారం హఠాత్తుగా గుండెపోటు రావటంతో మృతి చెందారని ఆమె సోషల్‌ మీడియలో వెల్లడించారు. ఆయనతో పాటు సోదరి ఉమా, మరో సోదరి కీర్తి మీనన్ జోహన్నెస్‌బర్గ్‌లో నివసిస్తున్నారు