India Coronavirus Report: ఇరవై వేలు దాటిన కరోనా మరణాలు, గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 22,752 కోవిడ్-19 కేసులు నమోదు, దేశంలో 7,42,417కి చేరిన మొత్తం కరోనా కేసుల సంఖ్య
దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,42,417కి ఎగబాకింది. మహమ్మారి బారినపడి గడిచిన 24 గంటల్లో 482 మంది మరణించగా మొత్తం మరణాల సంఖ్య 20,642కి పెరిగింది. కరోనా వైరస్ నుంచి కోలుకుని 4,56,830 మంది డిశ్చార్జి అయ్యారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా 2,64,944 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. కోవిడ్-19 విజృంభణ కొనసాగుతుండటంతో అధికారులు కరోనా నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేశారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,62,679 కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. ఇప్పటివరకూ దేశంలో 1,04,73,771 కరోనా టెస్టులు నిర్వహించారు
New Delhi, July 8: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 22,752 తాజా పాజిటివ్ కేసులు (India Coronavirus Report) వెలుగుచూశాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,42,417కి ఎగబాకింది. మహమ్మారి బారినపడి గడిచిన 24 గంటల్లో 482 మంది మరణించగా మొత్తం మరణాల సంఖ్య 20,642కి పెరిగింది. కరోనా వైరస్ నుంచి కోలుకుని 4,56,830 మంది డిశ్చార్జి అయ్యారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది.ఇక దేశవ్యాప్తంగా 2,64,944 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. బీహార్ సీఎం నివాసానికి కరోనా సెగ, నితీష్ కుమార్ మేనకోడలికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ, అప్రమత్తమైన అధికారులు
కోవిడ్-19 విజృంభణ కొనసాగుతుండటంతో అధికారులు కరోనా నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేశారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,62,679 కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. ఇప్పటివరకూ దేశంలో 1,04,73,771 కరోనా టెస్టులు నిర్వహించారు.
కేవలం 37 రోజుల్లోనే దాదాపు 15 వేల మంది వైర్‌సతో ప్రాణాలు కోల్పోయారు. జూన్ 1 నాటికి 5,600గా ఉన్న మరణాలు.. మంగళవారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం 20,160కి చేరాయి. 24 గంటల వ్యవధిలో దేశంలో 22,252 మందికి వైరస్ సోకినట్లు కేంద్రం తెలిపింది. తెలంగాణలో 27 వేలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో కొత్తగా మరో 1879 పాజిటివ్ కేసులు నమోదు
ఇదిలా ఉంటే గత మూడు రోజులుగా అమెరికాలో కంటే భారత్‌లోనే కరోనా మరణాల సంఖ్య (Coronavirus Deaths) అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 1వ తేదీ నుంచి 6వ తేదీ మధ్య దేశంలో 1.34 లక్షల కేసులు (Coronavirus New cases) నమోదవగా, 2,760 మంది చనిపోయారు. దేశంలో మొత్తం కరోనా మరణాల్లో 16 వేలపైగా మహారాష్ట్ర (9,026), తమిళనాడు (1,571), ఢిల్లీ (3,115), గుజరాత్ (1,960), ఉత్తరప్రదేశ్‌లో (809)లోనే సంభవించాయి. మంగళవారం రికవరీ రేటు 61.13 శాతానికి చేరిందని కేంద్రం పేర్కొంది. అత్యధికంగా 15,515 మంది కోలుకున్నారు. ఏపీలో తాజాగా 1178 కరోనా కేసులు నమోదు, 13 మంది మృతి, రాష్ట్రంలో 21,197కు చేరుకున్న కోవిడ్-19 కేసుల సంఖ్య, 252కు చేరిన మరణాల సంఖ్య
వైరస్ పుట్టిన చైనాను దేశ ఆర్థిక రాజధాని ముంబై మించిపోయింది. చైనాలో ఇప్పటివరకు 4,600 మంది మరణించగా, 83 వేల కేసులు నమోదయ్యాయి. కానీ, మార్చి రెండో వారంలో కరోనా తొలి కేసు నమోదైన ముంబైలో రెండున్నర నెలల తర్వాత.. మంగళవారం నాటికి 4,938 మంది మృతి చెందారు. 85,724 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో మంగళవారం ఒక్కరోజే 1498 కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 26,815కు చేరుకున్నాయి. మొత్తం మృతుల సంఖ్య 416కి చేరింది.
దేశంలో తొలి లక్ష కేసులు నమోదు కావడానికి 110 రోజులు పట్టగా.. ఆ తర్వాత 49 రోజుల్లోనే కేసుల సంఖ్య 7 లక్షలకు చేరడమే ఇందుకు నిదర్శనం. తొలి కేసు కేరళలో జనవరి 30న నమోదు కాగా.. మే 19 నాటికి లక్ష కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత పదిహేను రోజుల్లోనే కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. లక్ష నుంచి 5 లక్షలకు చేరడానికి 39 రోజులు పట్టగా.. ఏడు లక్షలకు చేరడానికి 49 రోజులు పట్టింది. అంటే గత పది రోజుల్లోనే రెండు లక్షల కేసులు నమోదయ్యాయి. అయితే, వైరస్ బారిన పడి కోలుకున్నవారి సంఖ్య 61.13 శాతంగా ఉండడం.. యాక్టివ్ కేసుల కన్నా కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండడం, మరణాల రేటు తక్కువగా ఉండడం ఊరట కలిగించే విషయంగా చెప్పవచ్చు.
కరోనా మరణాలు అధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ ఏడోస్థానంలో నిలిచింది. దేశంలో ప్రతి పదిలక్షల మంది జనాభాకుగాను.. కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతున్నవారి (యాక్టివ్ కేసుల) కంటే, వైరస్ బారిన పడి కోలుకున్నవారి (రికవరీ కేసుల) సంఖ్యే ఎక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. మిలియన్ జనాభాకు యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 186.3గా ఉండగా.. రికవరీ కేసుల సంఖ్య 315.8గా ఉందని వెల్లడించింది