COVID in Telangana:  తెలంగాణలో 27 వేలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో కొత్తగా మరో 1879 పాజిటివ్ కేసులు నమోదు
Coronavirus in India | (Photo Credits: PTI)

Hyderabad,July 7: తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ తీవ్రత కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా మరో 1879 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 27,612 కి చేరుకుంది.

దాదాపు వచ్చే కేసులన్నీ హైదరాబాద్ నగరం నుంచే ఉంటున్నాయి. రోజుకు వెయ్యికి పైగానే పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగించే విషయం. మంగళవారం నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా 1422 కేసులు ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి.

హైదరాబాద్ సమీపాన ఉండే మేడ్చల్ మరియు రంగారెడ్డి జిల్లాలలో రోజురోజుకు కేసుల తీవ్రత పెరుగుతోంది. ఈరోజు రంగారెడ్డి నుంచి 176 కేసులు రాగా, మేడ్చల్ నుంచి 94  కేసులు వచ్చాయి.

అటు కరీంనగర్ జిల్లాలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూపోతుంది. ఈరోజు జిల్లా నుంచి 32 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా నుంచి కూడా దాదాపు ఇదే స్థాయిలో 31 కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో కరోనావైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. జిల్లా నుంచి ఈరోజు 19 కేసులు రికార్డ్ అయ్యాయి.

మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 27 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు  గత 24 గంటల్లో మరో 7 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 313 కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో మరో  1506 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 16,287  మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో  11,012 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. 132 ఏళ్ల చరిత్ర గల భవనం కూల్చివేత, కొత్త సచివాలయ భవన నమూనా విడుదల

గత 24 గంటల్లో 6,220  మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,28,438 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.