Bihar CM Nitish Kumar (photo-ANI)

Patna, July 7: బీహార్ సీఎం నివాసానికి కరోనా సెగ తగిలింది. పాట్నాలోని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Bihar Chief Minister Nitish Kumar) అధికారిక నివాసంలో ఉంటున్న ఆయన దగ్గరి బంధువుకు కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సీఎం నితీష్ మేనకోడలికి క‌రోనా పాజిటివ్‌ రావడంతో ఆమెను పాట్నా ఎయిమ్స్ లోని ఐసోలేషన్ వార్డుకు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. సీఎం అధికారిక నివాసాన్ని పూర్తిగా శానిటేష‌న్ చేయించామనీ, ఈ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ఆమెను రేప్ చేశాడు, 60 మంది పోలీసులను క్వారంటైన్‌కి పంపాడు, దేశంలో 7 లక్షలు దాటిన కోవిడ్-19 కేసుల సంఖ్య, దేశంలో కోటి దాటిన నిర్థారణ పరీక్షలు

ఈ నేపథ్యంలో త్వరలోనే సీఎం కుటుంబ స‌భ్యులంద‌రికీ క‌రోనా ప‌రీక్షలు చేయనున్నారు. అలాగే పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (పిఎంసిహెచ్) నుండి మూడు వేర్వేరు బృందాలను ముఖ్యమంత్రి నివాసానికి (Nitish Kumar's Residence) తరలించారు. ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఉత్తర్వుల ప్రకారం, వెంటిలేటర్‌తో కూడిన తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. వైద్యులు, నర్సులు మూడు షిఫ్టులలో ఇక్కడ పని చేయనున్నారు.

Here's ANI Tweet

మ‌రోవైపు బొహార్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ చైర్‌పర్సన్ అవధేశ్‌ నారాయణసింగ్ కరోనా బారిన పడటంతో సీఎం నితీష్‌ కుమార్‌ కు కరోనా పరీక్షలు నిర్వహించారు. శనివారం సీఎంకు కరోనా నెగిటివ్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్న సంగతి తెలిసిందే. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులలో ఒకరైన నితీష్ కుమార్ నేతృత్వంలోని జెడి (యు) కు చెందిన గులాం ఘౌస్ కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. బజాజ్‌ను వెంటాడుతున్న కరోనావైరస్, ముంబై వాలూజ్ ప్లాంట్‌లో 400కు పెరిగిన కోవిడ్-19 కేసులు, ప్లాంట్‌‌ను తాత్కాలికంగా మూసివేయాలని డిమాండ్ చేస్తున్న యూనియన్

బీహార్లో వైరస్ విజృంభణ నేపథ్యంలో స్పందించిన ప్రతిపక్ష నాయకుడు తేజశ్వి యాదవ్ రాష్ట్రంలో అటు పరీక్షలూ, ఇటు చికిత్సలు లేవంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేసులు విపరీతంగా పెరుగుతున్నా ప్రభుత్వానికి చింత లేదనీ, ఎన్నికలకు సన్నద్ధమవుతోందంటూ ఆరోపించారు. కేసులకు సంబంధించి డేటాను దాచిపెడుతోందనికూడా ఆయన విమర్శించారు. ఇప్పటికైనా స్పందించకపోతే ఆగస్టు-సెప్టెంబర్ నాటికి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందంటూ ట్విట్ చేశారు.

బీహార్లో గత 24 గంటల్లో 385 కేసులు (Coronavirus in Bihar) రికార్డయ్యాయి. మొత్తం 3088 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్య శాఖ బులిటెన్ లో తెలిపింది. 324 మంది గత 24 గంటల్లో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని దీంతో మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 9,339 కు చేరుకుందని ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో రికవరీ రేటు 74.55 శాతంగా ఉంది. దేశంలో కేసులు 7,19,655కు చేరుకోగా ఇందులో 2,59,557 యాక్టివ్ కేసులు, 4,39949 డిశ్చార్జి కేసులు ఉన్నాయి. మరణాల సంఖ్య 20,160 గా ఉంది.