Bajaj Auto Ltd (Photo-ANI)

Mumbai. July 7: దేశంలో కరోనావైరస్ కల్లోలాన్ని రేపుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రను కరోనా వణికిస్తోంది. ముంబై నగరంలో కరోనా కేసులు రోజు రొజుకు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. కరోనా సెగ కంపెనీలను వదిలిపెట్టడం లేదు. ముంబైలో ఆటో దిగ్గజం బజాజ్ ఆటో (Corona Fear at Bajaj Plant) తీవ్ర ఇబ్బందులు పడుతోంది. కంపెనీకి సంబంధించిన ముంబై వాలూజ్ ప్లాంట్‌లో (Mumbai Waluj Plant) కోవిడ్‌ కేసులు తాజాగా 400కు పెరిగాయి. దీంతో కార్మికులు (Bajaj Auto Workers) ప్లాంట్‌కు వచ్చేందుకు హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్లాంట్‌ ను తాత్కాలికంగా మూసివేయాలనే డిమాండ్ అక్కడ ఊపందుకుంది. ఆమెను రేప్ చేశాడు, 60 మంది పోలీసులను క్వారంటైన్‌కి పంపాడు, దేశంలో 7 లక్షలు దాటిన కోవిడ్-19 కేసుల సంఖ్య, దేశంలో కోటి దాటిన నిర్థారణ పరీక్షలు

కోవిడ్-19 కేసుల సంఖ్య పెరిగినందున, ప్లాంటును పూర్తిగా శానిటైజ్ చేయడం ఇతరత్రా పనుల కోసం ఎనిమిది నుంచి 10 రోజులు ప్లాంట్‌లో పని నిలిపివేయాలని కోరుతున్నామని బజాజ్ ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు తెంగడే బాజీరావ్ (Thengade Bajirao) తెలిపారు. దీనికి సంబంధించి మళ్ళీ మేనేజ్‌మెంట్‌తో చర్చిస్తామనీ, మధ్యవర్తిత్వం వహించడానికి ప్రభుత్వ అధికారులను కూడా సంప్రదించనున్నామని చెప్పారు. అవసరమైతే ఉత్పత్తి నష్టాన్ని భర్తీ చేసేందుకు అదనపు గంటలు కేటాయించమని కోరినట్లు వర్కర్స్‌ యూనియన్‌ తెలిపింది. అయితే దీనిపై బజాజ్‌ యాజమాన్యం ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు.

కాగా ప్రస్తుతం బజాజ్‌ ఆటోకు 3 ఉత్పత్తి ప్లాంట్‌లు ఉన్నాయి. మహారాష్ట్రలోని వాలూజ్‌, చకన్‌ వద్ద రెండు ప్లాంట్‌లు ఉండగా, ఉత్తరాఖండ్‌లోని పంత్‌నగర్‌ వద్ద మరో ప్లాంట్‌ ఉంది. డిస్కవర్‌, ప్లాటినా, సిటీ 100, బాక్సర్‌ 150తో పాటు త్రిచక్ర వాహనాలను కంపెనీ వాలూజ్ ప్లాంట్‌లో తయారు చేస్తోంది. 8,100 మందికి పైగా కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. కరోనా కారణంగా ఇప్పటివరకు బజాజ్ ఆటో కార్మికులు ఏడుగురు చనిపోయారు