Amaravati, July 7: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1178 కరోనా పాజిటివ్ కేసులు (AP Coronavirus Report) నమోదయ్యాయి. ఇందులో ఇతర దేశాల నుంచి వచ్చిన ఒకరికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 22 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ (AP Coronavirus) అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 16,238 శాంపిల్స్‌ను పరీక్షించగా 1178 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆమెను రేప్ చేశాడు, 60 మంది పోలీసులను క్వారంటైన్‌కి పంపాడు, దేశంలో 7 లక్షలు దాటిన కోవిడ్-19 కేసుల సంఖ్య, దేశంలో కోటి దాటిన నిర్థారణ పరీక్షలు
దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 21,197కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని క్షేమంగా 762 మంది డిశ్చార్జ్ కాగా, 13 మంది మరణించారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడి రాష్ట్రంలో 252 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు ఏపీలో 10,50,090 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11200 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కర్నూలు జిల్లాలో నలుగురు, అనంతపూర్‌లో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, విశాఖలో ఇద్దరు, ప్రకాశం, ప.గోదాదరి జిల్లాలో ఒక్కొక్కరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 252కు చేరింది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 85 మంది మరణించగా, కృష్ణా జిల్లాలో 70 మంది మరణించారు. అక్కాచెల్లెమ్మలకు ఆస్తిని ఇద్దామంటే టీడీపీ అడ్డుపడుతోంది, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది, స్పందన సమీక్షలో కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్
పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 2 వేలు దాటాయి. కొత్తగా 197 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏలూరులో 97, పాలకొల్లులో 34 కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన వాటితో కలిసి పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేల 63 కి చేరుకున్నాయి. మృతుల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. నిన్న నలుగురు మృతి చెందారు. ఏపీలో 125 అడుగుల బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం, విజయవాడ నడిబొడ్డున స్వరాజ్య మైదానంలో విగ్రహం ఏర్పాటు, ఈ నెల 8న ప్రారంభించనున్న ఏపీ సీఎం
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. జిల్లాలో ఇప్పటి వరకూ 2,147 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,442 ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం 306 ప్రాంతాల్లో కంటైన్మెంట్ ఆంక్షలున్నాయి. కరోనా లక్షణాలు ఉన్న వారికి మాత్రమే అధికారులు వైద్య పరీక్షలు చేస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో తాజాగా 257 మంది నుంచి మాత్రమే నమూనాలు సేకరించారు.