LPG Gas Price Cut: భారీగా తగ్గిన ఎల్‌పిజి సిలిండర్ ధరలు, మే 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి, హైదరాబాదులో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర 589.50 నుంచి ప్రారంభం
నెలవారీ సమీక్షలో భాగంగా చమురు మార్కెటింగ్ సంస్థలు సిలిండర్ ధరను (LPG Cylinder Price Cut) మళ్లీ భారీగా తగ్గించాయి. దీంతో ఎల్‌పిజి సిలిండర్ల ధరలు (LPG Cylinder Price) వివిధ మెట్రో మూడవ సారి భారీగా దిగి వచ్చాయి. సవరించిన రేట్లు ఈ రోజు నుంచే (మే 1) నుంచే అమల్లోకి వచ్చాయి. హైదరాబాదులో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 207 తగ్గి రూ. 589.50 నుంచి ప్రారంభమవుతుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కూడా రూ. 336 క్షీణించి ప్రారంభ ధర రూ. 988 కి చేరింది
New Delhi, May 1: వంట గ్యాస్ వినియోగదారులకు మరోసారి ఊరట లభించింది. నెలవారీ సమీక్షలో భాగంగా చమురు మార్కెటింగ్ సంస్థలు సిలిండర్ ధరను (LPG Cylinder Price Cut) మళ్లీ భారీగా తగ్గించాయి. దీంతో ఎల్‌పిజి సిలిండర్ల ధరలు (LPG Cylinder Price) వివిధ మెట్రో మూడవ సారి భారీగా దిగి వచ్చాయి. సవరించిన రేట్లు ఈ రోజు నుంచే (మే 1) నుంచే అమల్లోకి వచ్చాయి. దేశంలో తొలి రైలు కదిలింది, వలస కార్మికులతో లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి జార్ఖండ్‌కు బయలు దేరిన ప్రత్యేక రైలు
హైదరాబాదులో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 207 తగ్గి రూ. 589.50 నుంచి ప్రారంభమవుతుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కూడా రూ. 336 క్షీణించి ప్రారంభ ధర రూ. 988 కి చేరింది.
న్యూఢిల్లీలో ఎల్‌పిజి (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) సిలిండర్ ధర 744 నుంచి తగ్గి రూ. 581.50 గా వుంటుంది. ఇక్కడ దాదాపు 162 రూపాయలు తగ్గింది. ముంబైలో 714.50 తో పోలిస్తే తాజాగా రూ. 579 ఖర్చవుతుంది. కోల్‌కతాలో రూ. 190 తగ్గి రూ. 584.50, చెన్నైలో రూ .569.50 కు విక్రయించనున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరలు, డాలర్ మారకంలో రూపాయి విలువ ఆధారంగా గ్యాస్ సిలిండర్ ధరలు మారుతూ వుంటాయి. లాక్‌డౌన్ పొడిగిస్తారా, ఎత్తేస్తారా, ఉత్కంఠ మధ్య క్యాబినెట్ మంత్రులతో ప్రధాని మోదీ భేటీ, రేపు జాతినుద్దేశించి ప్రసగించనున్న ప్రధాని
ప్రపంచ ఇంధన మార్కెట్లో తిరోగమనం మధ్య గత రెండు నెలల్లో ధరలు తగ్గించబడటానికి ముందు, ప్రతి నెల మొదటి రోజున సవరించబడే ఎల్పిజి సిలిండర్ రేట్లు గత ఆగస్టు నుండి పెరుగుతున్న రీతిలో ఉన్నాయి. కరోనావైరస్ లాక్డౌన్ మార్చి 25 నుండి ప్రారంభమైనప్పటి నుండి, దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎల్పిజి సిలిండర్ల స్టాకుపై భయాందోళనలు కలిగాయి. అయితే స్థానిక డిమాండ్‌ను తీర్చడానికి తగినంత గ్యాస్ నిల్వ ఉన్నందున దేశంలో ఎల్‌పిజి సిలిండర్ల కొరత లేదని చిల్లర వ్యాపారులు చెప్పారు.
భారతదేశపు అతిపెద్ద ఇంధన రిటైలర్ ఇండియన్ ఆయిల్ కార్ప్ లిమిటెడ్ (ఐఓసి) ఏప్రిల్‌లో అమ్మకాలలో 20% పెరుగుదల నమోదైందని తెలిపింది. భారతదేశంలో ఎల్పిజి సిలిండర్ల ధర ప్రధానంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది - అంతర్జాతీయ బెంచ్మార్క్ ఎల్పిజి రేటు మరియు యుఎస్ డాలర్ మరియు రూపాయి మారకపు రేటు. వంట గ్యాస్ దేశవ్యాప్తంగా మార్కెట్ ధరలకు మాత్రమే లభిస్తుంది. ప్రతి ఇంటికి సంవత్సరానికి 14.2 కిలోల 12 సిలిండర్లు సబ్సిడీ రేటుకు లభిస్తాయి. సబ్సిడీని నేరుగా బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు.