MP Shocker: కరోనా సోకిన మహిళను కూడా వదలని కామాంధుడు, తాకరాని చోట తాకుతూ అత్యాచారయత్నానికి ప్రయత్నించిన వార్డు బాయ్, భయంతో అలారం మోగించిన 59 ఏళ్ల మహిళ, నిందితుడిపై సెక్షన్ 376, 354 కింద కేసు నమోదు చేసిన పోలీసులు

కామంతో కళ్లు మూసుకుపోయిన వార్డు బాయ్ కోవిడ్ వైరస్ బారిన పడిన మహిళపై అత్యాచార యత్నం (Ward Boy Attempts to Rape 50-Year-Old COVID-19 Patient) చేశాడు.

stop rape Rape accused| Representational Image (Photo Credits: File Image)

Gwalior, April 19: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దారుణ ఘటన (Madhya Pradesh Shocker) చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన వార్డు బాయ్ కోవిడ్ వైరస్ బారిన పడిన మహిళపై అత్యాచార యత్నం (Ward Boy Attempts to Rape 50-Year-Old COVID-19 Patient) చేశాడు. ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళితే.. ఎంపీలోని గ్వాలియర్‌లోని లోటస్ హాస్పిటల్‌లో కరోనావైరస్ సోకిన 59 ఏళ్ల మహిళ చికిత్స పొందుతోంది. కాగా ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆమెకు వెంటిలేటర్ సాయంతో వైద్యులు చికిత్సనందిస్తున్నారు.

అలాంటి పరిస్థితుల్లో ఉన్న మహిళపై అదే వార్డులో పనిచేసే వివేక్ లోధి(25) అనే వార్డు బాయ్ అత్యాచారానికి యత్నించాడు. ఆమెను తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ మహిళ వెంటనే భయంతో అలారం మోగించడంతో అక్కడి నుంచి వివేక్ పారిపోయాడు. సదరు మహిళ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో నిందితుడిపై సెక్షన్ 376, 354 కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

భార్య రెండు కూరలు వండలేదని పురుగు మందు తాగిన భర్త, చికిత్స పొందుతూ మృతి, గొల్లప్రోలు మండలం కొడవలిలో విషాద ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గొల్లప్రోలు పోలీసులు

అయితే.. ఈ ఘటన కారణంగా ఆమెకు హాస్పిటల్ ఉద్దేశపూర్వకంగా ట్రీట్‌మెంట్ నిలిపివేసిందని, హాస్పిటల్ యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పదమూడేళ్ల బాలికపై ఒకరి తర్వాత ఒకరు లైంగికదాడి, అయిదు రోజుల్లో రెండు సార్లు అత్యాచారం చేసిన కామాంధులు, పోస్కో మరియు ఐపీసీ సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేసిన మధ్యప్రదేశ్ పోలీసులు

చెత్త కుప్పల్లోకి లాక్కెళ్లి చిన్నారిపై అత్యాచారం, ఆపై చేతిలో రూ.5 పెట్టిన కామాంధుడు, మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

మద్యం తాగించి రెండు రోజులు పాటు యువతిపై గ్యాంగ్ రేప్, నిందితుల్లో ఒకరు బీజేపీ నేత, పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ, మిగతా ముగ్గురు కోసం గాలింపుల చర్యలు చేపట్టిన పోలీసులు

నన్నే రేప్ చేస్తావా..రేపిస్ట్ పురుషాంగాన్ని కోసేసిన యువతి, నిందితుడిపై అత్యాచారయత్నం సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఎంపీ పోలీసులు, నాపై కొడవలితో దాడి చేసిందని మహిళపై ఫిర్యాదు చేసిన నిందితుడు

బాధితురాలి కుమారుడు మాట్లాడుతూ.. లోధిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హాస్పిటల్ పరువు పోయిందని భావించిన యాజమాన్యం తమను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.



సంబంధిత వార్తలు