'Lockdown 4.0': నాలుగవ దశ లాక్‌డౌన్, ఈ నెల 15 లోగా రాష్ట్రాల సీఎంలు తమ అభిప్రాయాలు చెప్పాలన్న ప్రధాని మోదీ, వీడియో కాన్ఫరెన్స్‌లో ఎవరేమన్నారంటే..
కరోనా విజృంభణ తర్వాత సీఎంలతో సమావేశం కావడం ఇది ఐదోసారి.
New Delhi, May 11: దేశంలో మూడో విడత లాక్‌డౌన్ (Lockdown 3.0) ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ (PM Modi 5th Video Conference) ద్వారా సమావేశమయ్యారు.కరోనా కట్టడి, ఆంక్షల సడలింపు, ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణపై ముఖ్యమంత్రులతో సమగ్రంగా చర్చించారు. కరోనా విజృంభణ తర్వాత సీఎంలతో సమావేశం కావడం ఇది ఐదోసారి. మన ముందు పెద్ధ ఛాలెంజ్ ఉంది, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రారంభమైన ప్రధాని మోదీ 5వ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం
కరోనాపై పోరులో రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను ఈ సందర్భంగా ప్రధాని (PM Modi) ప్రశంసించారు. మహమ్మారి నుంచి భారత్ (India Coronavirus) తనను తాను రక్షించుకోగలిగిందని యావత్ ప్రపంచం భావిస్తున్నదని చెప్పారు. అయితే నాలుగవ దశ లాక్ డౌన్ (Lockdown 4.0) ఉంటుందా లేదా అనేదానిపై కేంద్రం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. రైళ్లను నడపవద్దన్న కేసీఆర్, ప్రజల్లో భయాన్ని తొలగించాలన్న వైయస్ జగన్, ప్రధాని మోదీతో ముగిసిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్
కరోనాపై సమన్వయ వ్యూహం అవసరమని, రాష్ట్రాలు వెలిబుచ్చే అభిప్రాయాల ఆధారంగానే భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని ప్రధాని స్పష్టంచేశారు. కరోనా వ్యాప్తిరేటు తగ్గించడంతోపాటు ప్రజా కార్యకలాపాలను క్రమంగా పెంచడంపై దృష్టిసారించాలన్నారు. లాక్‌డౌన్‌పై 15లోగా అభిప్రాయాలు తెలియజేయాలని సీఎంలను కోరారు. రైళ్లను పునఃప్రారంభించడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయని ప్రధాని పేర్కొన్నారు. అయితే పరిమిత స్థాయిలోనే సర్వీసులు నడుస్తాయని చెప్పారు.
రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏమన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి
ప్రజల్లో భయం, ఆందోళన తొలగించడం ద్వారా సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. కరోనా సోకిన వారిని సమాజం వేరుగా చూస్తుందన్న భావన నెలకొందని.. ఈ కారణం వల్లనే కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవడం లేదు. ఈ పరిణామాలు కరోనా పరీక్షల ముఖ్య ఉద్ధేశం, లక్ష్యాలపై ప్రభావం చూపిస్తోంది. దేశంలో 70 వేలు దాటిన కోవిడ్-19 కేసులు, గత 24 గంటల్లో 3604 కొత్త కేసులు, దేశ వ్యాప్తంగా 2293 మంది కరోనాతో మృతి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో నిలిపేసిన ప్రయాణికుల రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దు. రాష్ట్రాల అప్పులను రీ షెడ్యూల్ చేయాలని, ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంచాలని, ఏ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆ రాష్ట్రం అనుమతించాలి.
అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్
లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగించాలని అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్ నిబంధనలు మరింతగా సడలిస్తే కరోనా వ్యాప్తి ఎక్కువయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.
కేరళ సీఎం పినరయి విజయన్
రోడ్డు, రైళ్లు, విమానాల సర్వీసులను కచ్చితంగా పునరుద్ధరించాలి. అయితే సామాజిక ఎడబాటు, మాస్కులు ధరించడం వంటి నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలి. నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో మెట్రో రైళ్లు, బస్సులు నడిపేందుకు అనుమతినివ్వాలి. సూక్ష్మ, చిన్న, తరహా తరగతి పరిశ్రమలకు ప్యాకేజీ ప్రకటించాలి.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే
జూన్ లేదా జూలై నాటికి కరోనా పాజిటివ్ కేసులు శిఖరస్థాయికి చేరుకునే అవకాశం ఉంది. వైరస్ విజృంభిస్తున్న తరుణంలో లాక్‌డౌన్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. అయితే ముంబైలో నిత్యావసరాల కోసం స్థానిక రైళ్లను నడిపేందుకు అనుమతినివ్వాలి. తమ రాష్ట్ర సిబ్బందికి కాస్త విశ్రాంతినిచ్చేలా కేంద్ర బలగాలను పంపాలి
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్
ఆర్థిక కార్యకలాపాల విషయంలో రాష్ట్రాలకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే వెసలుబాటు కల్పించాలని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. అదే విధంగా కరోనా తీవ్రతను బట్టి గ్రీన్, రెడ్, ఆరెంజ్ జోన్లను విభజించే అధికారం కూడా రాష్ట్రాలకే వదిలేస్తే బాగుంటుందన్నారు.
పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్
లాక్‌డౌన్ పటిష్టంగా అమలు చేస్తూనే ఆర్థిక వ్యవస్థను పునురుద్ధరించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామి
మే 12 నుంచి ఢిల్లీ నుంచి చెన్నైకి రెగ్యులర్‌గా రైళ్లు నడుపబోతున్నారని మీడియా ద్వారా తెలుసుకున్నాం. చెన్నైలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కాబట్టి మే 31 వరకు రాష్ట్రంలోకి విమాన, రైలు సర్వీసులను నిలిపివేయండి.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
కరోనాలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కేం ద్రం రాజకీయాలు చేస్తున్నది. కరోనా విషయంలో బెంగాల్‌ను రాజకీయంగా టార్గెట్ చేసుకున్నారు. మా అభిప్రాయాలను ఎప్పుడూ ఎవరూ కోరలేదు. సమాఖ్య స్ఫూర్తిని గౌరవించాలి. ఎప్పుడూ బెంగాల్‌పైనే ఎందుకు విమర్శలు? ఒకవైపు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుచేయాలని అంటారు. మరోవైపు, రైళ్లను ప్రారంభిస్తారు.
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ
కంటైన్మెంట్ జోన్ల వరకే లాక్‌డౌన్‌ను పరిమితం చేయాలి. వేసవి సెలవుల తర్వాతనే విద్యాసంస్థలను తెరువాలి. ప్రజారవాణాను నెమ్మదిగా ప్రారంభించాలి.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీలో కంటైన్మెంట్ జోన్లు మినహా, మిగిలిన ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతివ్వాలి.