Railway Budget 2020: రైల్వే ప్రయాణికులకు శుభవార్త, మరిన్నికొత్త రైళ్లు అందుబాటులోకి, కొత్తగా కిసాన్ రైలు, పర్యాటక ప్రాంతాల్లో తేజస్ రైళ్లు, రవాణా మౌలిక సదుపాయాల కోసం రూ.1.7 లక్షల కోట్లు
మరిన్ని కొత్త రైళ్లు అందుబాటులోకి తీసుకువస్తామని బడ్జెట్‌లో తెలిపారు.ఇండియన్ రైల్వేస్ కొత్తగా కిసాన్ రైలును (Kisan Rail) ఏర్పాటు చేస్తుందని నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో (పీపీపీ) భాగస్వామ్యంలో ఈ రైలు నిర్మాణం ఉంటుందని పేర్కొన్నారు. ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య హై స్పీడ్ టరైన్ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
New Delhi, Febuary 01: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దశాబ్దంలో అత్యంత క్లిష్టమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈమె యూనియన్ బడ్జెట్‌తోపాటు రైల్వే బడ్జెట్‌ను (Railway Budget 2020) కూడా ఆవిష్కరించారు. కాగా రైల్వే బడ్జెట్‌ను సీతారామన్ (Sitharaman Budget 2020) సమర్పించడం ఇది రెండోసారి.
అంతకుముందు 5 జూలై 2019 న ఆమె కేంద్ర బడ్జెట్ 2019 తో పాటు రైల్వే బడ్జెట్ 2019 ను సమర్పించారు. ఈ బడ్జెట్లో రైల్వే ప్రయాణికులు శుభవార్తను అందించారు. మరిన్ని కొత్త రైళ్లు అందుబాటులోకి తీసుకువస్తామని బడ్జెట్‌లో తెలిపారు.
విద్యారంగానికి రూ.99,300 కోట్లు
ఇండియన్ రైల్వేస్ కొత్తగా కిసాన్ రైలును (Kisan Rail) ఏర్పాటు చేస్తుందని నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో (పీపీపీ) భాగస్వామ్యంలో ఈ రైలు నిర్మాణం ఉంటుందని పేర్కొన్నారు. ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య హై స్పీడ్ టరైన్ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
బెంగళూరులో 18,600 కోట్లతో నిర్మించ తలపెట్టిన మెట్రో తరహా సబర్బన్ రైలు ఏర్పాటుకు కేంద్రం 20 శాతం నిధుల సాయం అందిస్తుందని ప్రకటించారు. ముంబయి-అహ్మాదాబాద్ మధ్య నడపనున్న హైస్పీడ్ రైళ్లను మరికొన్ని ముఖ్యకేంద్రాల మధ్య నడపనున్నట్లు ప్రకటించారు.
బడ్జెట్ లైవ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
చెన్నై- బెంగళూరు మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ వే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రధాన పర్యాటక కేంద్రాలను కలుపుతూ తేజస్ (Tejas Express) లాంటి రైళ్లను ఏర్పాటు చేస్తామని, రైలు మార్గాలకు ఇరువైపులా వీలున్న చోట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
27000 కిలోమీటర్ల మేర భారత రైల్వే ట్రాక్‌లను విద్యుదీకరిస్తామనీ.. డిమాండ్-సరఫరా మధ్య అంతరాన్ని తగ్గించేందుకు రైల్వేలకు సౌరవిద్యుత్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
ఇందుకోసం రైల్వే స్వాధీనంలో ఉన్న ట్రాక్‌ల పొడవునా సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆమె అన్నారు. దేశంలోని మరిన్ని కీలక పర్యాటక ప్రాంతాలకు కూడా తేజస్ వంటి రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
2020-21 బడ్జెట్లో రవాణా మౌలిక సదుపాయాల కోసం రూ.1.7 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు నిర్మల పేర్కొన్నారు. పవర్ అండ్ రిన్యువబుల్ ఎనర్జీ రంగానికి 22 వేల కోట్లు కేటాయించినట్లు ఆమె తెలిపారు. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేను 2023 నాటికల్లా పూర్తిచేస్తామని ఆమె పేర్కొన్నారు. రైల్వేల్లో మరింత ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నామని... ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిలో 150 రైళ్లు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు
ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి భారీగా నిధులు
లోక్‌సభలో బడ్జెట్ (Union Budget 2020-21) ప్రవేశపెట్టిన ఆమె మాట్లాడుతూ.. తేజస్ లాంటి మరిన్ని రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశంలో ప్రఖ్యాత ప్రాంతాలకు లింక్ చేసే విధంగా తేజస్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్‌లో రవాణా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా విమానాశ్రయాల అభివృద్ధితోపాటు రైల్వే వ్యవస్థల ఆధునికీకరణ, సదుపాయాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఉడాన్ పథకంలో భాగంగా 2024 నాటికి దేశంలోని మరో వంద విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు.
5 స్మార్ట్ నగరాల అభివృద్ధి
ఈ ఏడాది కొత్తగా 5 స్మార్ట్ నగరాలను అభివృద్ధి చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. టెక్స్‌టైల్ రంగానికి మరింత ప్రోత్సహం అందిస్తామని చెప్పారు. మొబైల్ తయారీ పరిశ్రమలకు మరింత ప్రోత్సహం అందజేస్తామన్నారు. నేషనల్ టెక్స్‌టైల్ మిషన్‌కు రూ.1480 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి కొత్త పథకానికి తీసుకురానున్నట్టు చెప్పారు.
గ్లోబలైజేషన్‌కు అనుగుణంగా పరిశ్రమల అభివృద్దికి తోడ్పాటు అందిస్తామన్నారు. ల్యాండ్ బ్యాంక్, ఇతర ప్రభుత్వ అనుమతుల కోసం ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. మౌలిక వసతులు అభివృద్ధికి సంబంధించి పీపీపీ విధానం తీసుకోస్తున్నట్టు చెప్పారు. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు.