Delhi Coronavirus: రాష్ట్రపతి భవన్‌‌లో పనిచేసే కార్మికుడికి కరోనావైరస్, స్వీయ నిర్భంధంలోకి 125 కుటుంబాలు, ఢిల్లీలో రెండు వేలు దాటిన కోవిడ్-19 కేసులు

ఇప్పటి వరకు ఢిల్లీ వీధుల్లో వ్యాప్తిచెందిన వైరస్‌ (COVID-19) తాజాగా ప్రతిష్టాత్మక రాష్ట్రపతి భవన్‌కూ పాకింది. రాష్ట్రపతి భవన్‌లో ( Rashtrapati Bhavan) పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుడకి కరోనావైరస్ పాజిటివ్ వచ్చింది. అతనితో సంబంధం ఉన్న వారు 100 మందికి పైగా సెల్ఫ్ దిగ్బంధంలో ఉండాలని అధికారులు కోరారు.

File image of Rashtrapati Bhavan | (Photo Credits: ANI)

New Delhi, April 21: దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్‌ (Delhi Coronavirus) విజృంభిస్తోంది. ఇప్పటి వరకు ఢిల్లీ వీధుల్లో వ్యాప్తిచెందిన వైరస్‌ (COVID-19) తాజాగా ప్రతిష్టాత్మక రాష్ట్రపతి భవన్‌కూ పాకింది. రాష్ట్రపతి భవన్‌లో ( Rashtrapati Bhavan) పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుడకి కరోనావైరస్ పాజిటివ్ వచ్చింది. అతనితో సంబంధం ఉన్న వారు 100 మందికి పైగా సెల్ఫ్ దిగ్బంధంలో ఉండాలని అధికారులు కోరారు. రోజుకు వెయ్యికి పైగా కేసులు నమోదు, గడిచిన 24 గంటల్లో 47 మంది మృతి, దేశంలో 18 వేలు దాటిన కోవిడ్-19 కేసుల సంఖ్య

కాగా ఈ వ్యక్తిని నాలుగు రోజుల క్రితం పాజిటివ్‌గా నిర్థారించారు. దీంతో పారిశుధ్య కార్మికులే కాకుండా, మిగతా వారందరికి COVID-19 పరీక్షలు చేశారు. వారందరికీ నెగిటివ్ వచ్చింది. అయితే కార్యదర్శి స్థాయి అధికారులు మరియు వారి కుటుంబాలు ముందు జాగ్రత్తగా తమను తాము స్వీయ-నిర్బంధంలోకి వెళ్లారు. ప్రాంగణంలోని ఇతర కార్మికులను నిర్బంధ సదుపాయానికి తీసుకువెళ్లారు.

అయితే అంతకుముందే అతని కుటుంబంలో ఒకరు ఈ వైరస్‌ కారణంగా మృతి చెందారు. తాజాగా అతనికి కూడా వైరస్‌ సోకడంతో పరిసర ప్రాంతాల్లోని 125 కుటుంబాలను అధికారులు స్వీయ నిర్బంధంలోకి పంపించారు. రాష్ట్రపతి భవన్‌లో పనిచేసే ఉద్యోగులతో పాటు ఆయా పరిసర ప్రాంతాల్లోని ప్రజలెవ్వరూ బయటకు రావద్దని అధికారులు ఆదేశించారు. మొత్తం 125 కుటుంబాల్లో 500 మందిని స్వీయ నిర్బంధంలోకి పంపినట్లు ఢిల్లీ వైద్యులు తెలిపారు. దీంతో రాష్ట్రపతి భవన్‌లో అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ముంబైలో కరోనా కల్లోలం, 53 మంది జర్నలిస్టులకు కోవిడ్ -19 పాజిటివ్

కాగా ఢిల్లీలోని కరోనా పాజిటివ్‌ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. సోమవారం అర్థరాత్రి నాటికి కరోనా కేసుల సంఖ్య 2,003కి చేరింది. మరోవైపు వైరస్‌ కారణంగా 45 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే మే 3 వరకు లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించే ప్రసక్తేలేదని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు.



సంబంధిత వార్తలు