Mumbai, April 21: దేశంలోనే అత్యధిక కరోనావైరస్ (Coronavirus) కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో ఒక్క ముంబై నగరంలోనే (Mumbai Coronavirus) సుమారు సగం కేసులు నమోదవుతుండటం అక్కడ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ముంబైలో 53 మంది జర్నలిస్టులకు కరోనా (53 journalists test corona positive) సోకింది. BMC(బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్) నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. కాగా ఆదివారం వరకు ముంబైలో 2,724 కరోనావైరస్ కేసులు, 132 మంది మరణించారు. కరోనావైరస్ మానవ సృష్టే, చైనా వుహాన్ ల్యాబొరేటరీ నుంచి ఈ వైరస్ బయటకు వచ్చింది, నోబెల్ గ్రహీత మాంటగ్నియర్ ఆసక్తికర వ్యాఖ్యలు
అయితే వారెవరికీ కరోనా లక్షణాలు కనిపించకపోవడం గమనార్హం. ఏప్రిల్ 16,17 తేదీల్లో రిపోర్టర్లు, కెమెరామన్‌లు కలుపుకుని మొత్తంగా 167 మంది జర్నలిస్టులకు పరీక్షలు నిర్వహించగా వీరిలో సుమారు 53 మందికి సోకినట్లు తేలింది. దీంతో వెంటనే వారిని క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి సహోద్యోగులకు కూడా పరీక్షలు నిర్వహించనున్నారు.
కరోనా సోకినవారు క్షేత్రస్థాయిలో పనిచేసిన వారు కాగా టీవీ జర్నలిస్టులకే ఎక్కువగా సోకిందని అధికారులు వెల్లడించారు. ఇదిలావుండగా మహారాష్ట్రలో 4,203 మందికి కరోనా కేసులు నమోదవగా 223 మంది మరణించారు. 507 మంది కరోనాను జయించి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.