New Delhi, April 21: భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య (2020 Coronavirus Pandemic in India) రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,336 కరోనా కేసులు (Coronavirus) నమోదు కాగా, 47 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య (COVID 19 Positive Case) 18,601కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకు కరోనా నుంచి 3,252 మంది కోలుకున్నారని, 590 మంది మృతిచెందారని తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో (India) 14,759 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్టు పేర్కొంది. ముంబైలో కరోనా కల్లోలం, 53 మంది జర్నలిస్టులకు కోవిడ్ -19 పాజిటివ్
దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 4,666 కరోనా కేసులు నమోదు కాగా, 232 మంది మృతిచెందారు. ఆ తర్వాత ఢిల్లీలో 2,081, గుజరాత్‌లో 1,939, రాజస్తాన్‌లో 1,576, తమిళనాడులో 1,520, మధ్యప్రదేశ్‌లో 1,485, ఉత్తరప్రదేశ్‌లో 1,184 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు గోవాలో 7 గురికి కరోనా సోకగా.. వారంతా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కేరళలో కూడా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. మొత్తం 408 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 291 మంది కోలుకున్నారు.
ఢిల్లీలో మొత్తం కొత్త కరోనావైరస్ కేసులు సోమవారం 2,081 కు చేరుకున్నాయి. కొత్తగా 78 కేసులు, రెండు మరణాలు సంభవించాయి. ఢిల్లీ హెల్త్ రిపోర్ట్ ప్రకారం సోమవారం నాటికి 1,603 కేసులు చురుకుగా ఉన్నాయని, దేశ రాజధానిలో ఇప్పటివరకు 431 మంది కరోనావైరస్ నుండి కోలుకున్నాయని నివేదికలు తెలియజేస్తున్నాయి.