Sai Baba Birth Place Row: ముదురుతున్న షిర్డి సాయి జన్మస్థల వివాదం, రాజకీయ వివాదంగా మారిన ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యలు, బంద్‌కు పిలుపునిచ్చిన షిర్డీ గ్రామస్థులు, సాయినాధుని జన్మస్థలం షిర్డీనా లేక పత్రినా..?
అక్కడ షిర్డీలో కొలువైన సాయిబాబా జన్మస్థలంపై(Sri Sai Janmasthan Temple) వివాదం ముదురుతోంది. ఆయన జన్మించింది పత్రిలోనేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే* Maharashtra Chief Minister) ప్రకటించడంతో ఈ వివాదం రాజుకుంది. దీంతో పత్రి (Pathri) ప్రాంతం ఇప్పుడు తెరమీదకు వచ్చింది. షిర్డీ సాయి జన్మ స్థలమని కొందరు భక్తులు నమ్మే పర్భనీ జిల్లాలోని(Parbhani) పత్రి పట్టణ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ఉద్ధవ్ ఠాక్రే చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారింది.
Shirdi, January 18: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో వివాదం మొదలైంది. అక్కడ షిర్డీలో కొలువైన సాయిబాబా జన్మస్థలంపై(Sri Sai Janmasthan Temple) వివాదం ముదురుతోంది. ఆయన జన్మించింది పత్రిలోనేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే( Maharashtra Chief Minister) ప్రకటించడంతో ఈ వివాదం రాజుకుంది. దీంతో పత్రి (Pathri) ప్రాంతం ఇప్పుడు తెరమీదకు వచ్చింది. షిర్డీ సాయి జన్మ స్థలమని కొందరు భక్తులు నమ్మే పర్భనీ జిల్లాలోని(Parbhani) పత్రి పట్టణ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ఉద్ధవ్ ఠాక్రే చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారింది.
ఈ విషయంపై బీజేపీ (BJP)తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. శివసేన–ఎన్సీపీ– కాంగ్రెస్ ప్రభుత్వం సాయి బాబా జన్మస్థలాన్ని వివాదాల్లోకి లాగుతోందని ఆరోపించింది. షిర్డీ సాయి జన్మ స్థలం విషయమై రాజకీయ జోక్యం ఇలాగే కొనసాగితే షిర్డీ ప్రజలు న్యాయపోరాటానికి దిగుతారని అహ్మద్‌నగర్ ఎంపీ సుజయ్ విఖే పాటిల్ హెచ్చరించారు.
జమ్మూలో పూజలు అందుకోనున్న వెంకటేశ్వరుడు
కాగా పత్రి అభివృద్ధి ప్రణాళికను గత ప్రభుత్వం ఆమోదించినట్లు పత్రిలోని శ్రీ సాయి ఆలయ జన్మ స్థాన ఆలయ ధర్మకర్త, NCP మాజీ ఎంఎల్‌సీ బాబా జానీ దురానీ వెల్లడించారు.
Update by ANI
ప్రస్తుత ముఖ్యమంత్రి థాకరే నిధులు అందుబాటులో ఉంచాలని సంబంధింత అధికారులను ఆదేశించారని, భూ సేకరణ, ప్రాజెక్టు కోసం నిరాశ్రయులైన వారికి పునరావాసం కల్పించడానికి కృషి చేస్తామన్నారు.
యాదాద్రి చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలి
పత్రి అభివృద్ధి చేస్తే షిర్డీపై ప్రభావం చూపుతుందనే భయం అక్కడి వారిలో నెలకొందని దురానీ వెల్లడించారు. అయితే షిర్డీలోనే సాయిబాబా(Shirdi Temple ) జన్మించారి ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. తమ వాదనను వినిపించడానికి తమ వద్ద అన్ని ఆధారాలున్నాయని, పత్రి నివాసితులు అఖిలపక్ష కార్యాచరణ ప్యానెల్‌ను ఏర్పాటు చేశారని వెల్లడించారు.
అయోధ్యలో ఆకాశాన్ని తాకేలా రామమందిరం
ఇదిలా ఉంటే పత్రీని సాయిబాబా స్వస్థలంగా అభివృద్ధి చేస్తామన్ని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటనకు నిరసనగా షీర్డీ గ్రామస్తులు బంద్‌కు పిలుపునిచ్చారు. పత్రి అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, కానీ సాయిబాబా జన్మస్థలంగా అభివర్ణించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు స్థానిక కార్యకర్త నితిన్ కోటే తెలిపారు. షిర్డీలో జన్మించడానికి తమ వద్ద కూడా ఆధారాలున్నాయని సాయిబాబా మతాలకతీతంగా ఉన్నారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
యాదాద్రి శిలలపై కేసీఆర్ చిత్రాలు
మరోవైపు సీఎం ఉద్దవ్ థాకరే చేసిన వ్యాఖ్యలపై త్వరలో షిర్డీలో బంద్ పాటిస్తామంటున్నారు. అయితే, ప్రభుత్వ ప్రకటనకు నిరసనగా షిర్డీ ఆలయం మూసివేస్తున్నారన్న వార్తలు అవాస్తవమని ఆలయ ట్రస్ట్ స్పష్టం చేసింది. గ్రామస్తులు ప్రకటించిన బంద్‌తో ట్రస్ట్‌కు సంబంధం లేదని తెలిపింది. భక్తులు ఆందోళనకు గురికావద్దని షిర్డీ ఆలయం, భక్తి నివాస్‌లో సేవలు యథావిధిగా కొనసాగుతాయని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ పీఆర్‌వో మోహన్ యాదవ్ చెప్పారు. సాయంత్రం షిర్డీ గ్రామస్తులతో సమావేశమవుతామని తెలిపారు.
ఈ పరిస్థితులు ఇలా ఉంటే శివసేన సభ్యులు కమలకర్ కోటే, సచిన్ కోటేతో, ఇతర రాజకీయ నేతలు చర్చలకు దిగారు. సీఎంతో సమావేశం కావాలని నిర్ణయించారు. చారిత్రాత్మక ప్రదేశాలను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని మంత్రి ప్రకటించారు.
శబరిమలలో తెరుచుకున్న అయ్యప్ప ఆలయం
షిర్డీకి సుమారు 260 కిలోమీటర్ల దూరంలో పత్రి ఉంది. అయితే ఇక్కడ తగిన సౌకర్యాలు లేవు. షిర్డీలో అన్నీ మౌలిక సదుపాయాలు అంటే విమానాశ్రయం, రైలు, బస్సు వంటి సౌకర్యాలున్నాయి. హోటల్స్, మెరుగైన రోడ్డు, రైలు కనెక్టివిటీ ఉన్నాయి. అంతేగాకుండా ఆలయ ట్రస్టు కూడా ఉంది. షిర్డి సాయి నాధుని జన్మస్థల వివాదం ముందు ముందు ఏ మలుపు తిరుగుతుందనేది ముందు ముందు చూడాలి.