Tablighi Jamaat: బ్లాక్‌లిస్టులో తబ్లిగీ జమాత్‌ విదేశీ సభ్యులు, 2 వేలకు పైగా విదేశీయులు వీసా నిబంధనలకు విరుద్ధంగా దేశంలోకి ప్రవేశించారని తెలిపిన కేంద్రప్రభుత్వం

నిబంధనలకు విరుద్ధంగా భారత్‌లో ప్రవేశించిన దాదాపు 2 వేలకు పైగా తబ్లిగీ జమాత్‌ (Tablighi Jamaat) విదేశీ సభ్యులకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ షాకినట్లు తెలుస్తోంది. తబ్లిగీ జమాతే కార్యకలాపాల్లో (Tablighi Jamaat congregation) పాల్గొన్నవేల మంది విదేశీయులను కేంద్రప్రభుత్వం బ్లాక్‌లిస్టులో పెట్టింది. పదేండ్లపాటు భారత్‌లోకి రాకుండా వారిపై నిషేధం విధించింది. దేశంలో తబ్లిగీ జమాత్‌ కార్యకలాపాల్లో పాల్గొనకుండా వారిని బ్లాక్‌లిస్టులో ఉంచింది.

COVID-19 Delhi government to ask police to register FIR against Maulana of Nizamuddin Markaz (Photo-PTI)

New Delhi, June 4: నిబంధనలకు విరుద్ధంగా భారత్‌లో ప్రవేశించిన దాదాపు 2 వేలకు పైగా తబ్లిగీ జమాత్‌ (Tablighi Jamaat) విదేశీ సభ్యులకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ షాకినట్లు తెలుస్తోంది. తబ్లిగీ జమాతే కార్యకలాపాల్లో (Tablighi Jamaat congregation) పాల్గొన్నవేల మంది విదేశీయులను కేంద్రప్రభుత్వం బ్లాక్‌లిస్టులో పెట్టింది. పదేండ్లపాటు భారత్‌లోకి రాకుండా వారిపై నిషేధం విధించింది. దేశంలో తబ్లిగీ జమాత్‌ కార్యకలాపాల్లో పాల్గొనకుండా వారిని బ్లాక్‌లిస్టులో ఉంచింది. 17 రాష్ట్రాలకు పాకిన మర్కజ్‌ మత ప్రకంపనలు, దేశ వ్యాప్తంగా మర్కజ్‌కు సంబంధించి 1023 కేసులు, 22వేల మంది క్వారెంటైన్‌ కేంద్రాలకు, వెల్లడించిన కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ

వీరిలో నలుగురు అమెరికన్లు, తొమ్మిది మంది బ్రిటిషర్లు, ఆరుగురు చైనీయులు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది మార్చి నెలలో ఢిల్లీలోని మర్కజ్‌లో (Delhi's Nizamuddin area) జరిగిన తబ్లిగీ జమాతే ప్రార్థనల్లో విదేశీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీసా నిబంధనలకు విరుద్ధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు నియంత్రణలో ఉన్న సయమంలో తబ్లిగీ జమాత్‌ ఉదంతం బయటపడింది. ఈ ఈవెంట్లో పాల్గొన్న అత్యధికులకు మహమ్మారి సోకడం సహా వారంతా వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన నేపథ్యంలో.. తబ్లిగీల ద్వారా దేశంలోని పలు ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి చెందిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఢిల్లీ మత ప్రార్థనల్లో కరోనావైరస్ కల్లోలం, ఆరుమంది మృతి, మర్కజ్‌ మౌలానాపై కేసు నమోదు

దేశంలో కరోనా కేసులు అధికమవడానికి మర్కజ్‌లోని తబ్లిగీ జమాతే కారణమని తెలంగాణ పోలీసులు మొదటి సారిగా గుర్తించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు. దీంతో వివిధ రాష్ట్రాలనుంచి తబ్లిగీ ప్రార్థనల్లో పాల్గొన్న వారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు టూరిస్ట్ వీసాతో వచ్చి మతపరమైన ప్రచారం నిర్వహించిన విదేశీయులు

లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న కారణంతో తబ్లిగీ చీఫ్‌ మౌలానా సాద్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే. అదే విధంగా దాదాపు 67 దేశాల నుంచి టూరిస్టు వీసా మీద భారత్‌కు వచ్చి మతపరమైన సమావేశంలో పాల్గొని వీసా నిబంధలను ఉల్లంఘించిన విదేశీయులపై కూడా కేసులు నమోదయ్యాయి.

అంతేగాక గల్ఫ్ దేశాల నుంచి ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ పెద్దల ఖాతాల్లోకి కోట్లాది రూపాయల నిధులు మళ్లించినట్లు ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో మౌలానాపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మనీ ల్యాండరింగ్‌ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో మౌలానాకు అత్యంత సన్నిహితులు, ముఖ్య అనుచరులుగా భావిస్తున్న ఐదుగురి పాస్‌పోర్టులను సీజ్‌ చేసి విచారణ వేగవంతం చేశారు

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now