Coronavirus In South India: సౌత్ ఇండియాలో కరోనా కల్లోలం, మూడు రాష్ట్రాల్లో రోజు రోజుకు రికార్డు స్థాయిలో నమోదవుతున్న కోవిడ్-19 కేసులు

నిన్న మొన్నటి వరకు సౌత్ ఇండియాలో (Coronavirus In South India)తక్కువ స్థాయిలో కేసులు నమోదు కాగా ఇప్పుడు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. తమిళనాడు (Tamil Nadu), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కోవిడ్ 19 కేసులు రోజు రొజుకు రికార్డు స్థాయిలో నమోదువుతున్నాయి. గత మూడు రోజుల నుంచి ఈ కేసులు (Coronavirus) భారీ స్థాయిలో బయటపడుతున్నాయి.

Coronavirus Outbreak (Photo Credits: IANS)

Chennai, July 24: భారతదేశంలో కరోనావైరస్ కేసులు ( COVID-19 Pandemic India) అంతకంతకూ పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు సౌత్ ఇండియాలో (Coronavirus In South India)తక్కువ స్థాయిలో కేసులు నమోదు కాగా ఇప్పుడు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. తమిళనాడు (Tamil Nadu), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కోవిడ్ 19 కేసులు రోజు రొజుకు రికార్డు స్థాయిలో నమోదువుతున్నాయి. గత మూడు రోజుల నుంచి ఈ కేసులు (Coronavirus) భారీ స్థాయిలో బయటపడుతున్నాయి. శవాల ద్వారా కరోనా వచ్చే అవకాశం లేదు, మృతదేహాల్లో వైరస్ 3-4 గంటలు మాత్రమే బతికి ఉంటుందని వైద్యులు వెల్లడి, దేశంలో 30 వేలు దాటిన కోవిడ్-19 మరణాలు

తమిళనాడులో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 6785 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2 లక్షలకు చేరువలో ఉంది. 1,99, 749 కేసులు ఇప్పటివరకు తమిళనాడులో నమోదయ్యాయి. రాష్ట్రంలో మరణాల సంఖ్య 3,320కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 88మంది మరణించారు. రాష్ట్ర ఆరోగ్య సంస్థ అందించిన వివరాల ప్రకారం ప్రస్తుతం 53,132 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గత 24 గంటల్లో 6504 మంది వ్యాధి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.  భయపెడుతున్న తూర్పుగోదావరి, మొత్తం 11 వేలకు పైగా కోవిడ్-19 కేసులు నమోదు, ఏపీలో తాజాగా 8,147 పాజిటివ్‌ కేసులు నమోదు

ఏపీలో రోజురోజుకూ కోవిడ్ కేసులు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. కరోనా నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టినా కేసుల ఉధృతి మాత్రం తగ్గట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 8147 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 2,380 మంది కరోనా నుంచి సంపూర్ణంగా కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించింది. కొత్తగా వైరస్‌ బాధితుల్లో 44 మంది మృతి చెందడంతో.. మొత్తం మరణాల సంఖ్య 933 కు చేరింది. తూర్పుగోదావరిలో 11 మంది, కృష్ణాలో 9 మంది, కర్నూలులో 8 మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, పశ్చిమగోదావరిలో ఐదుగురు, గుంటూరులో ముగ్గురు, విశాఖలో ముగ్గురు, చిత్తూరులో ఒకరు, ప్రకాశంలో ఒకరు, విజయనగరంలో ఒకరు కరోనాతో చనిపోయారు. తెలంగాణలో 50 వేలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో కొత్తగా మరో 1567 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 447కు చేరిన కరోనా మరణాలు

ఈమేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 15,41,993 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వెల్లడించింది.తాజా పరీక్షల్లో 25,125 పరీక్షలు ట్రూనాట్‌ పద్ధతిలో, 22,989 ర్యాపిడ్‌ టెస్టింగ్‌ పద్ధతిలో చేశారు. ఇప్పటి వరకు 39,935 మంది డిశ్చార్జ్ కాగా 39,990 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. మొత్తం కేసుల సంఖ్య 80,858గా ఉంది.

కర్ణాటకలో గడిచిన 24 గంటల్లో తాజాగా 5007 కేసులు నమోదయ్యాయి. 110 మంది మరణించారు. కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 85, 870కు చేరింది. ఇందులో 52,791 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం 1724 మంది కరోనాతో మరణించారు. కేరళ విషయానికి వస్తే కొంచెం పరిస్థితి మెరుగ్గానే ఉందని చెప్పవచ్చు. గత 24 గంటల్లో 885 మంది కరోనావైరస్ భారీన పడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 16,695 కు చేరింది. 54 మంది ఇప్పటి వరకు కరోనాతో మరణించారు.

ఇక తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య శుక్రవారం సాయంత్రం నాటికి అందిన సమాచారం ప్రకారం... రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 1567 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 50,826 కి చేరుకుంది. గత 24 గంటల్లో మరో 9 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 447 కు పెరిగింది. అలాగే, గురువారం సాయంత్రం వరకు మరో 1661 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 39,327 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,052 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. గత 24 గంటల్లో 13,367 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3,22,326 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

దేశంలో గ‌త 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో 49,310 మంది క‌రోనా పాజిటివ్‌లుగా (Coronavirus in India) నమోదు అయ్యాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య 12,87,945కు చేరింది. ఇందులో 4,40,135 యాక్టివ్ కేసులు ఉండ‌గా, 8,17,209 మంది కోలుకున్నారు. ఈ వైర‌స్ వ‌ల్ల ఇప్ప‌టివ‌ర‌కు 30,601 మంది (Coronavirus Deaths) చ‌నిపోయారు. నిన్న ఒకేరోజు కొత్త‌గా 720 మంది మృతిచెందార‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది.